- Home
- Entertainment
- మేమేం దొంగలు కాదు కదా బాబాయ్.. సుమన్ శెట్టి ఆన్ డ్యూటీ.. రగిలిపోతున్న మాస్క్ మ్యాన్
మేమేం దొంగలు కాదు కదా బాబాయ్.. సుమన్ శెట్టి ఆన్ డ్యూటీ.. రగిలిపోతున్న మాస్క్ మ్యాన్
Bigg Boss Telugu 9 Week 2 Nominations: బిగ్ బాస్ తెలుగు 9 రెండో వారం నామినేషన్ల పర్వం హాస్యం, భావోద్వేగాలు, గొడవల మేళవింపుగా సాగుతోంది. సుమన్ శెట్టి కామెడీతో హౌస్ నవ్వుల మయం కాగా, గుండు అంకుల్ vs రెడ్ ఫ్లవర్ డైలాగ్ వార్ హైలైట్‌గా నిలిచింది.

హీటెక్కిన నామినేషన్స్ డ్రామా
బిగ్ బాస్ హౌస్ లో రెండో వారపు నామినేషన్స్ రంజుగా సాగుతున్నాయి. మొదటి వారంలో కాస్త తేడా ఉన్న మర్యాద మనీష్ కాస్త దారిలోకి వస్తున్నాడు. మరోవైపు మాస్క్ మ్యాన్ హరీష్ రచ్చ చేస్తున్నారు. రకరకాల గొడవలకు కారణమవుతున్నారు. మొదట తనూజతో గొడవపెట్టుకున్న హరీష్, తరువాత ఇమ్మాన్యువెల్‌తో ఘర్షణకు దిగాడు. ఆవేశంతో ఊగిపోయారు. ఇక సుమన్ శెట్టి ఈ రోజే డ్యూటీ ఎక్కినట్టు ఉన్నాడు. సీరియస్ గా నామినేషన్లు జరుగుతుంటే.. తన కామెడీ టైమింగ్ తో హౌస్‌లో నవ్వుల వర్షం కురిపించాడు.
సుమన్ శెట్టి ఆన్ డ్యూటీ
తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే.. సుమన్ శెట్టిని సంజన నామినేట్ చేస్తుంది. దీంతో సుమన్ శెట్టి ముందుకు వస్తూ.. ‘రాయండి మేడమ్ రాయండి. ఏం మాట్లాడకుండా రాసేయండి. టైమ్ వెస్ట్ అవుతుంది. కాళ్లు నొప్పులు పెడుతున్నాయి’ అంటూ పంచ్ వేశారు. దీంతో సంజనకు ఏం మాట్లాడాలో అర్థం కాక.. ‘ఓపికతో మాట్లాడండి’ అని రిజెస్ట్ చేస్తుంది. వెంటనే సుమన్ స్లోగా నవ్వుతూ “మీరు వస్తే రాయించుకుంటాను” అని ప్రతిస్పందించాడు, దీంతో హౌస్ మెట్స్ ఒక్కసారిగా నవ్వేస్తారు.
దోశే ఇష్యూపై సుమన్ శెట్టి సరదా కౌంటర్..
సుమన్ శెట్టి ఆ తరువాత ప్రియను నామినేట్ చేస్తాడు. ఈ సమయంలో ప్రియ మాట్లాడుతూ.. మీకు దోశె ఇవ్వడం వల్ల హౌస్ లో గొడవ జరిగిందని చెప్పుతున్నంది. ‘మీరు ఇంప్రెస్ చేస్తే దోశె ఇస్తా అన్నారు. ఆ విషయం మీరే అడగాలి. నేనే ఇంప్రెస్ చేస్తాననీ మీ ముందుకు రావాలేంటీ?’ అంటూ ప్రియకు సరదాగా కౌంటర్ వేశాడు. సుమన్ శెట్టి కామెడీ టైమింగ్ కు ఇమ్యూ, రీతూ, తనూజ పడిపడి నవ్వుతారు. సుమన్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మేమేం దొంగలు కాదు బాబాయ్
సుమన్ తరువాత మనీష్ నామినేట్ చేస్తారు. “నేను అడిగి డోర్ తీసుకొని వెళ్లిపోవట్లేదు కదా బ్రో” అంటూ మాట్లాడగా, మనీష్ “ఎందుకు వస్తున్నారో బేసిక్ రీజన్ తెలుసుకోవాలి”అని అంటారు. వెంటనే సుమన్ శెట్టి రియాక్ట్ అవుతూ.. ‘మేమేం దొంగలు కాదు కదా బాబాయ్..’ అంటూ పంచ్ వేస్తాడు. రియల్లీ ఆ కామెడీ టైమింగ్ కు హీటెక్కిన హౌస్ లో నవ్వులు అల్లుకున్నారు.
ఇమ్మాన్యువెల్ వర్సెస్ మర్యాద మనీష్
ఇమ్మాన్యువెల్ మొదల మర్యాద మనీష్ ను నామినేట్ చేసి, “నాగ్ సార్ ముందు ఒప్పుకున్నదేదో.. నా ముందు ఒప్పుకుంటే.. కొంత న్యాయం జరిగేదనేది నా ఫీలింగ్” అని చెప్పాడు. దీంతో మనీష్ ఎమోషనల్ గా రియాక్ట్ అవుతూ.. ఒక వ్యక్తి ఇతరులపై ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాడని స్పష్టత ఇచ్చాడు. ఆ తరువాత డీమన్ పవన్ బాండింగ్, రిలేషన్‌షిప్స్ విషయాలపై హౌస్‌కి సలహా ఇచ్చాడు. దీంతో తనూజ వెంటనే రియాక్ట్ అవుతూ.. బాండింగ్స్ అంటూ ఏదో ఏదో మాట్లాడుతున్నావ్ అంటూ వార్నింగ్ ఇచ్చింది.
గుండు అంకుల్ vs రెడ్ ఫ్లవర్
ప్రోమో చివరిలో మాస్క్ మ్యాన్ ను ఇమ్మాన్యువెల్ నామినేట్ చేశారు. ఈ సమయంలో ఇమ్మూ మాట్లాడూతూ.. “గుండు అంకుల్ అనేది బాడీ షేమింగ్ అయితే, రెడ్ ఫ్లవర్ అంటే ఏంటి?” అని హరీష్ ను నిలదీస్తాడు. దీంతో హరీష్ “ నేను రెడ్ ఫ్లవర్ అనలేదు” అని బదులిస్తాడు. వెంటనే ఇమ్మూ రియాక్ట్ అవుతూ.. ‘ అన్నా మీరు అన్న విషయం అందరూ చూశారన్న’ అని బదులిస్తాడు. మొదటి వీరి మధ్య సంభాషణ సరదాగానే జరిగినా.. క్రమంగా సిరీయస్ అవుతుంది.
లిమిట్స్ లో ఉండాలని ఇమ్మూకు మాస్క్ మ్యాన్ వార్నింగ్ ఇస్తారు. దీంతో ఇద్దరి మధ్య హోరాహోరీగా డైలాగ్ వార్ జరుగుతోంది. వారిద్దరూ ఎక్కడ కొట్టుకుంటారో అనేలా హైప్ క్రియేట్ చేశారు. మొత్తానికి నామినేషన్ల పర్వం కామెడీ, డ్రామా, గొడవల మేళవింపుగా సాగినట్టు తెలుస్తోంది. అయితే.. ఎంత మంది నామినేట్ అయ్యారో తెలియాలంటే? ఈ ఎపిసోడ్ వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.