- Home
- Entertainment
- James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్
వారణాసి షూటింగ్ లో పులులతో చిత్రీకరించే సీన్లు, ఇతర క్రేజీ సీన్లు ఏవైనా ఉంటే చెప్పాలని తాను కూడా షూటింగ్ కి వస్తానని రాజమౌళితో అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అన్నారు. దీనికి జక్కన్న ఎలాంటి సమాధానం ఇచ్చారో ఈ కథనంలో తెలుసుకోండి.

అవతార్ 3 పై భారీ అంచనాలు
హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరూన్ తెరకెక్కించే చిత్రాలకు ఇండియాలో కూడా విశేష ఆదరణ దక్కుతూ ఉంటుంది. ఇటీవల అవతార్ ప్రాంఛైజీపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అవతార్ 1, అవతార్ 2 చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని విజయం సాధించాయి. ఇప్పుడు డిసెంబర్ 19 శుక్రవారం రోజు అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ మూవీ రిలీజ్ కాబోతోంది. దీనితో తారా స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
జేమ్స్ కామెరూన్ తో రాజమౌళి ఇంటర్వ్యూ
ఇండియాలో కూడా అవతార్ 3 పై క్రేజ్ ఉండడంతో 20th సెంచరీ స్టూడియోస్ సంస్థ రాజమౌళి, జేమ్స్ కామెరూన్ మధ్య వీడియో కాన్ఫెరెన్స్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలో ఇద్దరు టాప్ డైరెక్టర్ ఆసక్తికర విషయాలు చర్చించుకున్నారు. రాజమౌళి అవతార్ విశేషాలని కామెరూన్ ని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా కామెరూన్ వారణాసి సినిమా గురించి రాజమౌళి అడిగి మరీ తెలుసుకోవడం విశేషం.
నీ సినిమా సెట్ కి వస్తాను
కామెరూన్ మాట్లాడుతూ.. ఫిలిం మేకర్స్ క్రియేటివ్ ప్రాసెస్ గురించి చర్చించుకోవడం చాలా అవసరం. నేను ఏదో ఒక టైంలో నీ సినిమా సెట్ కి రావాలని అనుకుంటున్నాను. నేను నీ మూవీ షూటింగ్ కి రావచ్చా అని కామెరూన్ అడిగారు. వెంటనే రాజమౌళి స్పందిస్తూ అంతకి మించిన గౌరవం ఇంకొకటి లేదు. మీ కోసం నా సినిమా యూనిట్ మాత్రమే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం ఎదురుచూస్తుంది.. మీరు వస్తే ఘనస్వాగతం లభిస్తుంది అని అన్నారు.
పులులతో సీన్లు ఉన్నాయా ?
నువ్వు తీస్తున్న వారణాసి సినిమా సంగతి ఏంటి అని కామెరూన్ అడిగారు. రాజమౌళి సమాధానం ఇస్తూ.. అవును సార్, ఏడాదిగా షూట్ చేస్తున్నాం. ఇంకో 8 నెలల షూటింగ్ మిగిలి ఉంది అని తెలిపారు. వారణాసి షూటింగ్ లో ఏదైనా ఫన్ ఉంటే చెప్పు, టైగర్స్ తో సీన్లు ఉంటే చెప్పు నేను కూడా వస్తాను అని సరదాగా అన్నారు. రాజమౌళి నవ్వేశారు.
అవతార్ విశేషాలు తెలుసుకున్న రాజమౌళి
ఆ తర్వాత రాజమౌళి కామెరూన్ ని కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. అవతార్ లో అంతటి క్లిష్టమైన పాత్రలు ఎలా క్రియేట్ చేశారు అని అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా ఈ ఇంటర్వ్యూ ఇండియాలో రిలీజ్ అవుతున్న అవతార్ 3 ప్రమోషన్స్ కి.. వారణాసి చిత్రాన్నిగ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లాలని చూస్తున్న రాజమౌళి కి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు.

