- Home
- Entertainment
- `బిగ్ బాస్ తెలుగు 9` హౌజ్‌లోకి ఈసారి ఎంత మంది కామన్ మ్యాన్ కంటెస్టెంట్లు వస్తున్నారో తెలుసా? వారికి పెద్ద దెబ్బే
`బిగ్ బాస్ తెలుగు 9` హౌజ్‌లోకి ఈసారి ఎంత మంది కామన్ మ్యాన్ కంటెస్టెంట్లు వస్తున్నారో తెలుసా? వారికి పెద్ద దెబ్బే
`బిగ్ బాస్ తెలుగు 9`వ సీజన్‌కి సంబంధించి ఒక ఆసక్తికర అప్ డేట్ వినిపిస్తోంది. కామన్ మ్యాన్ కేటగిరిలో ఈ సారి ఎక్కువ మందిని కంటెస్టెంట్లుగా ఎంపిక చేయబోతున్నారట.
- FB
- TW
- Linkdin
Follow Us

`బిగ్ బాస్ తెలుగు 9` అప్ డేట్
`బిగ్ బాస్ తెలుగు 9`వ సీజన్ సందడి ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. ప్రోమోలతో సందడి చేశారు హోస్ట్ నాగార్జున. 9వ సీజన్ లోగో ఎలా ఉండబోతుందో తెలిపారు. ఈ సారి అరాచకమే అని వెల్లడించారు.
గతంతో పోల్చితే ఈ సారి గేమ్ వేరే లెవల్‌లో ఉండబోతుందనే విషయాన్ని హింట్ ఇచ్చారు నాగార్జున. దీంతోపాటు కామన్ మ్యాన్‌కి కంటెస్టెంట్లుగా అవకాశం కల్పిస్తున్నట్టు వెల్లడించారు.
కామన్ మ్యాన్‌కి బిగ్ బాస్ బంపర్ ఆఫర్
గతంలోనూ కామన్ మ్యాన్ కేటగిరి నుంచి ఒక్కరిని మాత్రమే కంటెస్టెంట్లుగా తీసుకున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. అలా వచ్చినవారు చాలా వరకు సెలబ్రిటీలుగా మారిపోయాయి.
బిగ్ బాస్ తెలుగు 7లో పల్లవి ప్రశాంత్ ఏకంగా విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సీజన్‌లో షో రచ్చ రచ్చ అయ్యింది. టీఆర్‌పీ రేటింగ్ కూడా బాగానే వచ్చింది. గత సీజన్ల కంటే బాగా సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు.
బిగ్ బాస్ తెలుగు 9లో కామన్ మ్యాన్ కంటెస్టెంట్లకి పెద్ద పీఠ
కానీ గత సీజన్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. చాలా సప్పగా సాగింది. కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్లని బిగ్ బాస్ నిర్వాహకులు తీసుకురాలేకపోవడంతో ఆ లోటు కనిపించిందనే టాక్ వినిపించింది.
ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారట. ఈ క్రమంలోనే కామన్ మ్యాన్ కేటగిరికి పెద్ద పీఠ వేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఎక్కువ మందిని కంటెస్టెంట్లుగా ఎంపిక చేయబోతున్నారట.
కామన్ మ్యాన్ కేటగిరిలో ఐదుగురికి ఛాన్స్
గతంలో ఒక్కరినే కామన్ మ్యాన్‌ని కంటెస్టెంట్‌గా తీసుకున్నారు. ఈ సీజన్‌లో ఏకంగా ఐదుగురుని ఎంపిక చేసే అవకాశం ఉందట. కనిష్టంగా ఇద్దరు నుంచి, గరిష్టంగా ఐదుగురు వరకు కామన్ మ్యాన్లని కంటెస్టెంట్లుగా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రాసెస్ జరుగుతుందట. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని సమాచారం. ఈ సారి గరిష్టంగా 22 మందిని కంటెస్టెంట్లుగా బిగ్ బాస్ హౌజ్‌లోకి పంపబోతున్నారని సమాచారం.
అందులో సుమారు ఐదుగురు వరకు కామన్ మ్యాన్ కేటగిరిలో ఉంటే, మిగిలిన వారు సెలబ్రిటీలో ఉండబోతున్నారు. వీరిలో యూట్యూబర్లు, సింగర్లు, జబర్దస్త్ కమెడియన్లు, టీవీ ఆర్టిస్ట్ లు, సినిమా నటులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఉండబోతున్నారు.
`బిగ్ బాస్ తెలుగు 9`లో కంటెస్టెంట్లుగా వినిపిస్తున్న వారి లిస్ట్
ఇక ఇప్పటి వరకు సెలబ్రిటీ విభాగంలో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అలేఖ్య చిట్టి పికిల్స్ అమ్మాయి రమ్య కంచర్ల ఇప్పటికే కన్ఫమ్ అయ్యిందట. కల్పిక గణేష్, దీపికా, దేబ్జానీ, తేజస్విని, రీతూ చౌదరీ, కావ్య శ్రీ, సాయి కిరణ్,
మై విలేజ్ షో అనిల్, సీనియర్ నటుడు ప్రదీప్, జ్యోతిరాయ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్, ఛత్రపతి శేఖర్, సుమంత్ అశ్విన్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో లేడీ కంటెస్టెంట్లు చాలా వరకు ఓకే అయ్యారని సమాచారం. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.