- Home
- Entertainment
- శంకర్‌తో చిరంజీవి మిస్ చేసుకున్న మూవీస్ ఏంటో తెలుసా? బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించిన సినిమాలు
శంకర్‌తో చిరంజీవి మిస్ చేసుకున్న మూవీస్ ఏంటో తెలుసా? బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించిన సినిమాలు
మెగాస్టార్ చిరంజీవి.. ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో కలిసి పనిచేసే అవకాశాన్ని వదులుకున్నారు. రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్నారు.

శంకర్ దర్శకత్వంలో సినిమాలు మిస్ చేసుకున్న చిరంజీవి
చిత్ర పరిశ్రమలో హీరోలు కొన్ని మంచి సినిమాలను వదులుకోవడం సర్వసాధారణమే. చాలా మంది హీరోల విషయంలో ఇది జరుగుతుంది. చిరంజీవి కెరీర్‌లోనూ చాలానే ఉన్నాయి.
అయితే రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలను చేసే ఛాన్స్ ని ఆయన వదులుకున్నారు. దర్శకుడు శంకర్‌తో పనిచేసే ఛాన్స్ ని రిజెక్ట్ చేశారు. మరి ఆ సినిమాలేంటి? ఏం జరిగిందనేది చూస్తే.
`ఖైదీ` తో బ్రేక్ అందుకున్న చిరంజీవి
చిరంజీవి కెరీర్‌లో మైల్ స్టోన్ చిత్రాలు చాలానే ఉన్నాయి. `ఖైదీ`, `జగదేక వీరుడు అతిలోక సుందరి`, `ఠాగూర్` లాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఆయన్ని హీరోగా, ఇమేజ్ పరంగా, మార్కెట్ పరంగా కొన్ని మెట్లు ఎక్కించిన చిత్రాలు అనేకం.
అదే సమయంలో కొన్ని హిట్ చిత్రాలను కూడా చిరు మిస్ చేసుకున్నారు. అవి చేసి ఉంటే తన కెరీర్‌లో మరో గొప్ప స్థాయి ఉండేదని చెప్పొచ్చు.
పాన్ ఇండియా ట్రెండ్‌ని సృష్టించిన శంకర్
చిరంజీవి.. దర్శకుడు శంకర్‌తో పనిచేసే అవకాశాన్ని రెండు సార్లు రిజెక్ట్ చేయడం గమనార్హం. దర్శకుడు శంకర్ కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్‌గా రాణించారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది.
కానీ ఆయన ఇరవై, ముప్పై ఏళ్ల క్రితమే ఈ పాన్ ఇండియా ట్రెండ్‌ని క్రియేట్ చేశారు. `జెంటిల్‌మ్యాన్`, `ఇండియన్`, `ఒకే ఒక్కడు`, `నాయక్`, `జీన్స్`, `అపరిచితుడు`, `శివాజీ`, `రోబో`, `2.0` వంటి బ్లాక్ బస్టర్స్ ని ఆయన చిత్ర పరిశ్రమకి అందించారు. ఇవన్నీ అప్పట్లోనే పాన్ ఇండియా రేంజ్ మూవీస్.
`జెంటిల్మెన్` మొదట చేయాల్సింది చిరంజీవినే
శంకర్ తన తొలి సినిమా చిరంజీవితో చేయాలనుకున్నాడట. ఆయన అర్జున్‌తో `జెంటిల్ మెన్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో ఒక్కసారిగా అందరి దృష్టి శంకర్‌పై పడింది.
కమల్ హాసన్ కూడా ఫిదా అయ్యారు. దీంతో `ఇండియన్`కి అవకాశం ఇచ్చాడు. అయితే `జెంటిల్మెన్` మూవీని మొదట చిరంజీవితో చేయాలనుకున్నారట శంకర్. కానీ మెగాస్టార్ ఒప్పుకోలేదు.
దీంతో అర్జున్ తో చేశాడు. అర్జున్‌కి అది పెద్ద హిట్. అర్జున్‌ని హీరోగా మరో స్థాయికి తీసుకెళ్లింది ఈ మూవీ. అయితే ఈ చిత్ర హిందీ రీమేక్ లో చిరు నటించాడు. కానీ అక్కడ పెద్దగా ఆడలేదు.
`ఒకే ఒక్కడు` కూడా వదులుకున్న చిరంజీవి
దీంతోపాటు ఆరేళ్ల తర్వాత అర్జున్‌తో `ఒకే ఒక్కడు` సినిమా చేశాడు శంకర్. మనిషా కోయిరాలా హీరోయిన్‌గా, రఘువరన్ విలన్‌గా నటించిన ఈ మూవీ కూడా అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలచింది. అర్జున్ ఇమేజ్‌ని మరో స్థాయికి పెంచిన చిత్రమిది.
శంకర్ ఈ మూవీ స్క్రిప్ట్ ని ముందుగా చిరంజీవికే చెప్పారట. ఈ చిత్రాన్ని మొదట శంకర్ తెలుగు తమిళంలో ఏకకాలంలో చేయాలనుకున్నారు. ఇద్దరు వేర్వేరు హీరోలతో ప్లాన్ చేశారు.
డేట్స్ లేకపోవడంతో మరో బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్న చిరు
తమిళంలో అర్జున్‌తో, తెలుగులో చిరంజీవితో చేయాలనుకున్నారు. కానీ చిరు నో చెప్పాడు. కారణం ఆయనకు డేట్స్ లేకపోవడమే. అదే చేసి ఉంటే `ఠాగూర్` లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా చిరంజీవికి పడేది అని చెప్పొచ్చు. అలా శంకర్ తో రెండు బ్లాక్ బస్టర్స్ ని మిస్ చేసుకున్నారు శంకర్.
ప్రస్తుతం చిరంజీవి `విశ్వంభర`, అలాగే అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. `విశ్వంభర` ఈ ఏడాది చివర్లో వచ్చే ఛాన్స్ ఉంది. అనిల్ రావిపూడి మూవీ వచ్చ ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.