- Home
- Entertainment
- `బిగ్ బాస్ తెలుగు 1` విన్నర్ శివ బాలాజీ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా? సినిమాల్లేక అలా సెటిల్ అయ్యాడా?
`బిగ్ బాస్ తెలుగు 1` విన్నర్ శివ బాలాజీ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా? సినిమాల్లేక అలా సెటిల్ అయ్యాడా?
Siva Balaji: తెలుగు నటుడు శివ బాలాజీ బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారనేది చూస్తే.
- FB
- TW
- Linkdin
Follow Us
)
siva balaji
`బిగ్ బాస్ తెలుగు` రియాలిటీ షోకి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. క్రమక్రమంగా ఈ షోకి ఫ్యాన్స్ పెరుగుతున్నారు. ఫాలో అయ్యే శాతం పెరుగుతుంది. అదే సమయంలో విమర్శలు కూడా బాగానే ఉన్నాయి.
కంటెంట్ బాగా లేదని, ఎంటర్‌టైన్ చేసేలా లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో త్వరలో బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ స్టార్ట్ కాబోతుంది. అందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ విన్నర్ శివబాలాజీ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసుకుందాం.
శివబాలాజీ మొదట నటుడిగా నిరూపించుకున్నారు. హీరోగానూ సినిమాలు చేసి మెప్పించాడు. ప్రారంభంలో అనేక చిత్రాలు చేసి ఆకట్టుకున్నారు. హీరోకి ఫ్రెండ్స్ రోల్స్, అలాగే నెగటివ్ రోల్స్ కూడా చేసి ఆకట్టుకున్నారు.
టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగా కెరీర్ బిజీగా ఉన్న సమయంలోనే ఆయన బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్‌లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన ఈ షోపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
siva balaji
మొదటి సీజన్ బాగా రన్ అయ్యింది. చాలా మంది ఈ షోని ఫాలో అయ్యారు. మంచి రేటింగ్ వచ్చింది. ఇందులో శివా బాలాజీ విన్నర్‌గా నిలిచారు. ప్రారంభంలో చాలా హడావుడి చేశారు. మీడియా ఛానెళ్లు ఇంటర్వ్యూల కోసం ఎగబడ్డారు.
సినిమా ఆఫర్ల పరంగానూ హడావుడి జరిగింది. కానీ ఆ తర్వాత శివబాలాజీకి ఆ స్థాయిలో సినిమా అవకాశాలు రాలేదు. షోకి ముందు బాగానే ఆఫర్లు ఉన్నా, ఆ తర్వాత తగ్గిపోయాయి. ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తున్నారు.
ఇటీవల కాలంలో ఆయనకు మూవీస్ బాగా తగ్గాయి. `మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్`లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. చాలా కాలంగా ఆయన `మా`లో యాక్టివ్‌గా ఉన్నారు. ఇప్పుడు మంచు విష్ణు అధ్యక్షుడుగా ఉండగా, ఆయన ప్యానెల్‌లో ట్రెజరర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు శివబాలాజీ. అలాగే పలు సామాజిక కార్యక్రమాల్లోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు.
siva balaji
ప్రస్తుతం ఆయన మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న `కన్నప్ప`లో కీలక పాత్రలో నటిస్తున్నారు శివ బాలాజీ. చివరగా ఆయన `కాలింగ్ సహస్త్ర` చిత్రంలో మెరిశారు. పవన్ కళ్యాన్ కి క్లోజ్ గా ఉండే శివబాలాజీ ఇటీవల కాలంలో కొంత గ్యాప్ వచ్చినట్టు తెలుస్తుంది.
గత మా ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ ని మెగా ఫ్యామిలీ అపోజ్ చేసి, ప్రకాష్ రాజ్‌కి సపోర్ట్ చేసింది. శివబాలాజీ మంచు విష్ణు ప్యానెల్‌లో ఉండటంతో కొంత గ్యాప్ వచ్చినట్టు సమాచారం.