MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అమ్మ చేతిలో చావు దెబ్బలు తిన్న హీరో ఎవరో తెలుసా? ఇప్పుడు ఏకంగా పాన్‌ ఇండియా స్టార్‌

అమ్మ చేతిలో చావు దెబ్బలు తిన్న హీరో ఎవరో తెలుసా? ఇప్పుడు ఏకంగా పాన్‌ ఇండియా స్టార్‌

ఓ టాలీవుడ్‌ స్టార్‌ హీరో చిన్నప్పుడు చాలా అల్లరిగా ఉండేవారు. దీంతో అమ్మచేతిలో చావు దెబ్బలు తిన్నాడట. ఆ హీరోనే ఈ విషయాన్ని బయటపెట్టడం విశేషం.  

2 Min read
Author : Aithagoni Raju
Published : May 16 2025, 03:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

అమ్మ చేతిలో దెబ్బలు తినడం కామన్‌. చిన్నప్పుడు కొంటె పనులు చేసినప్పుడు పేరెంట్స్ కొడుతుంటారు. అయితే ఓ హీరో మాత్రం తన అమ్మ చేతిలో చావు దెబ్బలు తిన్నాడు.

ఆయన ఏదైనా కొంటె పని చేసినా తల్లి శివతాండవం చేసేదట. అమ్మకి కోపం వచ్చిందంటే తనకు చుక్కలే అని, మామూలుగా కొట్టేది కాదని ఆ హీరోనే తెలిపారు. మరి ఆ పాన్‌ ఇండియా హీరో ఎవరు? ఆ కథేంటో చూద్దాం. 

25
ntr

ntr

అమ్మ చేతిలో చావు దెబ్బలు తిన్న హీరో ఎవరో కాదు ఎన్టీఆర్‌. ఆయన చాలా అల్లరి అంటుంటారు. సినిమా సెట్‌లోనూ ఆయన ఉంటే సందడిగా ఉంటుందని, ఎప్పుడూ గలగల మాట్లాడుతుంటాడు, నవ్విస్తూ, ఆటపట్టిస్తూ ఉంటాడని ఆయనతో పని చేసిన దర్శకులు చెబుతుంటారు. రాజమౌళి లాంటి వాళ్లు ఇంకా బాగా చెబుతారు. ఆయన ఎంతటి అల్లరివాడో చాలా సార్లు చెప్పారు. 
 

Related Articles

Related image1
ప్రెగ్నెంట్‌ భార్య కోసం కిచెన్‌లో వరుణ్‌ తేజ్‌ సాహసం, చూస్తే నోరూరిపోవాల్సిందే, క్రేజీ సెటైర్లు
Related image2
ఎన్టీఆర్‌కి హృతిక్‌ రోషన్‌ బర్త్ డే ట్రీట్‌, ట్వీట్‌తో సంచలనం.. `వార్‌ 2` నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ?
35
ntr

ntr

ఎన్టీఆర్‌ చిన్నప్పుడు చాలా అల్లరిగా ఉండేవాడట. తనని గుడ్‌ బాయ్‌ అని పిలిపించుకోవడం అస్సలు ఇష్టం ఉండేది కాదట. స్కూల్‌లో, క్రికెట్‌ ఆడేటప్పుడు, ఫ్రెండ్స్ తో గొడవలు పడేవాడట. సినిమాలు, షికార్లు అంటూ తిరిగేవాడట.

కాలు ఒక్క చోట నిలబడేది కాదట. తారక్‌ అల్లరిని చూసి అమ్మ శాలిని యమ కొట్టుడు కొట్టేదట. `ఆడవాళ్లు సున్నితంగా ఉంటారని అంటారు. కానీ మా అమ్మ నాపై శివతాండవం ఆడేద`ని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు ఎన్టీఆర్‌. 

45
ntr, shalini

ntr, shalini

అల్లరి చేస్తే మామూలుగా కొట్టేది కాదట. చేతికి ఏది దొరికితే దానితోనే బడిత పూజ చేసేదట. ఓ సారి అమ్మని బాగా విసిగించడంతో బెల్టు తీసుకుని తెగేదాకి కొట్టిందట. అయినా కోపం తగ్గలేదని, హ్యాంగర్‌ పట్టుకుని బాధిందట. ఆ దెబ్బలు తట్టుకోలేక గోడ దూకి పక్కనే ఉన్న గుళ్లో దాక్కున్నాడట. గుళ్లో నుంచి బయటకు వచ్చేదాక ఎదురుచూసి మళ్లీకొట్టిందట. 
 

55
ntr

ntr

అయితే తన అల్లరి పనులకు ఎంత కోప్పడుతుందో, ఆ తర్వాత అంతే కూల్‌ అవుతుందని, దెబ్బలకు మందు రాస్తూ భోరున ఏడ్చేదట. తానంటే అమ్మకి ప్రాణం అని, తాను ఎక్కడ పక్కదారి పడతానేమో అనే భయంతో అలా చేసేదని చెప్పారు ఎన్టీఆర్‌.

తన విషయంలో ఎప్పుడూ గారాబం చేసేది కాదని, వాస్తవంలో ఎలా బతకాలో అమ్మనే నేర్పిందని, తనకు అమ్మే మొదటి గురువు అని తెలిపాడు ఎన్టీఆర్‌. `జీవితంలో ఏదో ఒకటి చెయ్‌, నిరూపించుకో, లేదంటే మనుగడ కష్టం` అని చెప్పేదట. అమ్మ తనకు అమ్మ మాత్రమే కాదని, తన బలం, బలగం అన్నీ తనే అని ఎమోషనల్‌ కామెంట్స్ చేశారు ఎన్టీఆర్‌. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
రాఘవేంద్ర రావు నుంచి కోదండరామిరెడ్డి వరకు.. మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ట్విస్ట్
Recommended image2
Food from Prabhas: ఆ కొత్త హీరోయిన్‌కి ప్రభాస్ ఇంటి నుంచి స్పెషల్ ఫుడ్, చూస్తేనే నోరూరిపోతుంది
Recommended image3
Niharika : అవార్డు వచ్చిన సంతోషమే లేదు.. బాగా హర్ట్ అయిన మెగా డాటర్
Related Stories
Recommended image1
ప్రెగ్నెంట్‌ భార్య కోసం కిచెన్‌లో వరుణ్‌ తేజ్‌ సాహసం, చూస్తే నోరూరిపోవాల్సిందే, క్రేజీ సెటైర్లు
Recommended image2
ఎన్టీఆర్‌కి హృతిక్‌ రోషన్‌ బర్త్ డే ట్రీట్‌, ట్వీట్‌తో సంచలనం.. `వార్‌ 2` నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved