- Home
- Entertainment
- Bigg Boss Telugu 10: నీకీ గతికి ఆ దేవుడే కారణం, ముఖేష్‌పై వంశీ ఫైర్.. ఎలిమినేషన్ నుంచి జస్ట్ మిస్ ఎవరంటే?
Bigg Boss Telugu 10: నీకీ గతికి ఆ దేవుడే కారణం, ముఖేష్‌పై వంశీ ఫైర్.. ఎలిమినేషన్ నుంచి జస్ట్ మిస్ ఎవరంటే?
బిగ్ బాస్ తెలుగు 10 8వ వారం సడెన్ ఎలిమినేషన్ ఉంటుందని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. కానీ ఆ తర్వాత ఊరించి ఉసూరుమనిపించాడు. ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది చూస్తే,

కెప్టెన్ అయిన త్రిగుణ్
బిగ్ బాస్ తెలుగు 10.. ఎనిమిదో వారం శుక్రవారం(54వ రోజు) హౌజ్‌లో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. అల్టీమేట్ గోట్కి సంబంధించిన టాస్క్ లు జరిగాయి. ఇది కెప్టెన్సీ టాస్క్. ఇందులో త్రిగుణ్, ముఖేష్, రామ్ ప్రసాద్, దేబ్జానీ, నీతూ నటరాజ్, వర్షిణి పాల్గొన్నారు. ఇందులో త్రిగుణ్ వేగంగా తన బాల్స్ ని తీసుకెళ్లి తనకు ఇచ్చిన టార్గెట్‌ని దాటేశాడు. అయితే ఇందులో ముఖేష్ కూడా బాగానే చేశాడు. కానీ బాల్స్ ఎక్కువగా పడలేదు. దీంతో త్రిగుణ్ విన్ అయ్యాడు. గోట్‌ని సాధించి కెప్టెన్ అయ్యాడు. అంతేకాదు బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నన్ని వారాలు కెప్టెన్సీ కంటెండర్‌గా నిలుస్తాడని బిగ్ బాస్ తెలిపారు.
రిస్క్ చేసి వెళ్లిన ముఖేష్
అయితే టాస్క్ సాగే క్రమంలో రోహిత్, అమన్‌ల మధ్య, అలాగే.. ముఖేష్, వంశీ మధ్య గట్టిగా వాదన చోటు చేసుకుంది. ముకేష్, వంశీ, శివ్ మధ్య జరిగిన పరిణామాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ఈ వారం గోట్ పోటీలో గ్రీన్ జోన్‌కు చేరుకున్న కంటెస్టెంట్లకు కెప్టెన్సీ సాధించే అవకాశం కల్పించాడు బిగ్ బాస్. ముకేష్, వర్షిణి, త్రిగుణ్, దేబ్జానీ, రామ్ ప్రసాద్ పోటీలో నిలిచారు. వీరికి అమన్, శివ్, వంశీ సపోర్టర్లుగా వ్యవహరించాల్సి వచ్చింది. ఒక్కో హర్డిల్ దాటుకుంటూ బాల్‌ను సపోర్టర్లకు అందించడం, అనంతరం ప్రత్యేక బోర్డుపై బాల్‌ను సరైన ఆప్షన్లో పడేలా చేయడం ఈ టాస్క్‌లో కీలకమైన అంశాలు.
వంశీ, ముఖేష్ మధ్య మాటల యుద్ధం
బాల్ ఎక్కడ పడుతుందనే దాని ఆధారంగా పోటీదారుల స్థానాలు ముందుకు లేదా వెనక్కి కదులుతాయి. రెండు అడుగులు ముందుకు, రెండు అడుగులు వెనక్కి, ఒక అడుగు ముందుకు, ఒక అడుగు వెనక్కి వంటి ఆప్షన్లతో ఆటను ఆసక్తికరంగా రూపొందించారు. ఇందులో అదృష్టంతో పాటు సపోర్టర్ల వ్యూహం కూడా కీలకంగా మారింది. ఈ టాస్క్‌లో ముకేష్ కొంత అసహనానికి గురయ్యాడు. ముఖ్యంగా వంశీ, శివ్ వ్యవహరించిన తీరు అతడికి నచ్చలేదు. తనకు సహకరించాలని ఆశించిన ముకేష్, బాల్‌ను ఎంచుకునే విషయంలో అనుకున్న ఫలితం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. వంశీని నమ్మి మరోసారి అవకాశం ఇచ్చానని ముకేష్ చెప్పడం, అందుకు వంశీ ఘాటుగా సమాధానం ఇవ్వడం హౌస్‌లో హీట్ పెంచింది. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అన్నట్టుగా ముకేష్ వ్యవహరిస్తున్నాడంటూ వంశీ విమర్శించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది.
నువ్వు కన్నింగ్ అంటూ అమన్‌పై రోహిత్ ఫైర్
మరోవైపు శివ్ కూడా ముకేష్ ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేశాడు. ఏంటి అలా చూపిస్తున్నావ్.. కొడతావా? అంటూ ప్రశ్నించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అయితే అమన్, శివ్ ఇద్దరూ ఈ టాస్క్‌లో నిర్ణయాలు తీసుకోవడం అంత సులభం కాదని చెప్పడం గమనార్హం. ఈ ఎపిసోడ్లో త్రిగుణ్‌కు కూడా కెప్టెన్సీ సాధించే అవకాశాలు కనిపించాయి. అతడికి అమన్, శివ్, వంశీల సపోర్ట్ ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది. మరోవైపు వర్షిణి, రామ్ ప్రసాద్ కూడా గ్రీన్ జోన్లో తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించారు. అమన్, రోహిత్ ల మధ్య కూడా ఆసక్తికర వాదన జరిగింది. ఇందులో వాళ్లరిద్దరు గట్టిగానే గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు వెళ్లారు. కొన్ని అసభ్యకరమైన పదాలు కూడా వాడారు. నువ్వు కన్నింగ్ అని రోహిత్ అనడంతో అమన్ ఫైర్ అయ్యాడు. రోహిత్ చుట్టు చూపించిన నేపథ్యంలో అమన్ కూడా బొచ్చు అంటూ రెచ్చిపోయాడు. ఇది ఆసక్తికరంగా మారింది.
సుధీర్ సడెన్ ఎలిమినేషన్
ఇదిలా ఉంటే శుక్రవారం ఎపిసోడ్లో సడెన్ ఎలిమినేషన్ తో పెద్ద షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. రెడ్ జోన్లో ఉన్నవారిలో కంటెస్టెంట్ల ఓట్ల ద్వారా ఒకరిని ఎలిమినేట్ చేయాలనుకున్నారు. చాలా వరకు రామకృష్ణకి ఓట్లు పడ్డాయి. కానీ ఆడియెన్స్ ఓటింగ్ ద్వారా సుధీర్‌కి తక్కువగా వచ్చాయి. దీంతో ఆయన ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. కానీ ముఖేష్ తన పవర్‌ని ఉపయోగించి సింగర్ ఝాన్సీ తన వద్ద ఉన్న పవర్‌ని రీ యూజ్ చేసే అవకాశం కల్పించారు. దీంతో ఝాన్సీ రీయూజ్ చేసి ఎలిమినేషన్ నుంచి బయటపడేసింది. అలా సుధీర్ సడెన్ ఎలిమినేషన్ నుంచి బయటపడ్డాడు. అయితే ఈ వారం రోహిత్, వంశీ, సుధీర్, రామకృష్ణ, శివ, వర్షిణి, సింగర్ ఝాన్సీ నామినేషన్లో ఉన్నారు. వీరిలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనేది చూడాలి.





