- Home
- Entertainment
- Bigg Boss 10: ఎనిమిదో వారం ఓటింగ్.. ఈ వారం బిగ్ బాస్ తెలుగు 10 నుంచి ఎలిమినేషన్ అయ్యేది ఎవరు?
Bigg Boss 10: ఎనిమిదో వారం ఓటింగ్.. ఈ వారం బిగ్ బాస్ తెలుగు 10 నుంచి ఎలిమినేషన్ అయ్యేది ఎవరు?
Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు 10 ఎనిమిదో వారం ఓటింగ్ ఆశ్చర్యపరుస్తోంది. అదే సమయంలో ఐదుగురు డేంజర్ జోన్లో ఉన్నారు. మరి ఈ వారం హౌజ్‌ని వీడబోతుందని ఎవరు?

నామినేషన్లో ఉన్నది ఎవరు?
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ఎనిమిదవ వారం రన్ అవుతుంది. ఇది కూడా చివరకు చేరుకుంది. గత వారం ఇద్దరు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. దక్షి, షాలిని ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఎనిమిదో వారం నామినేషన్లో వంశీ, రోహిత్, సుధీర్, ఝాన్సీ, రామ్ ప్రసాద్, శివ, రామకృష్ణ, వర్షిణి ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం హౌజ్‌ని వీడతారు.
టాప్‌లో దూసుకుపోతున్నది వీళ్లే
అనధికారికమైన ఓటింగ్ చూస్తే, ఈ వారం ఊహించని విధంగా వంశీ టాప్‌లో ఉన్నారు. ఆయనకు మంచి ఓటింగ్ పడుతుంది. ఆ తర్వాత రోహిత్ మంచి ఓటింగ్‌తో దూసుకుపోతున్నాడు. రోహిత్ కి ప్రారంభం నుంచి అదిరిపోయే ఓటింగ్ వస్తుంది. తనకు సంబంధించి ఎంత బ్యాడ్ చేస్తున్నా, ఓటింగ్ విషయంలో మాత్రం తగ్గేదెలే అని నిరూపించుకుంటున్నాడు. ఇక సుధీర్‌కి కూడా ఓటింగ్ బాగానే ఉందని సమాచారం. సింగర్ ఝాన్సీకి ఈ సారి మంచి ఓటింగ్ వస్తోంది. ఆమె క్రమంగా పుంజుకుంటున్నట్టు తెలుస్తోంది.
డేంజర్లో ఉన్నది వీరే
ఇక అనధికారిక ఓటింగ్‌లో బాటమ్‌లో శివ, రామకృష్ణ, వర్షిణి ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే డేంజర్లో ఝాన్సీ కూడా ఉంది. రెడ్ జోన్లో ఆమెతోపాటు సుధీర్ కూడా ఉన్నారు. అయితే ఆడియెన్స్ ఓటింగ్ మాత్రమే కాదు, వాళ్ల ఆట తీరు కూడా చాలా ముఖ్యం. ఆటల ద్వారా రెడ్ జోన్ నుంచి ఎల్లో, గ్రీన్ జోన్లోకి రావాల్సి ఉంది. మరి ఈ రోజు, రేపటి ఆటని బట్టి వీళ్లు ఏ కేటగిరిలో ఉంటారో తెలుస్తుంది. రెడ్ జోన్లో ఉన్నవారిలో మాత్రం ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయి.
వాళ్ల మధ్యనే ఎలిమినేషన్
ఈ లెక్కన ఇప్పుడు సింగర్ ఝాన్సీ, సుధీర్, వర్షిణి, రామకృష్ణల మధ్య ఎలిమినేషన్ ఉండే అవకాశాలున్నాయి. సుధీర్ ఎలిమినేట్ అవుతాడా? వర్షిణి అవుతుందా? వీరిద్దరు కాకుండా ఝాన్సీకి ప్రమాదం ఉందా అనేది చూడాలి. కాకపోతే ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమనే చెప్పాలి. నాగార్జున హోస్ట్ గా రన్ అవుతున్న బిగ్ బాస్ తెలుగు 10 ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హౌజ్‌లో రామ్ ప్రసాద్, నరేష్, ముఖేష్, దేబ్జానీ, సుధీర్, రామకృష్ణ, వర్షిణి, టెంపర్ వంశీ, శ్వేతా నాయుడు, నీతూ నటరాజ్, అమన్, సింగర్ ఝాన్సీ, శివ, త్రిగుణ్, రోహిత్ హౌజ్ మేట్స్ గా ఉన్నారు.





