'ప్రేమద ఊరలి' సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్‌ ను తీసుకోవాలని డైరెక్టర్ మనోజ్ కుమార్ గట్టిగానే ట్రై చేశారు. కానీ ఆమె బిజీ షెడ్యూల్, కాల్ షీట్ల ప్రాబ్లమ్ వల్ల అది కుదరలేదు.

శాండల్‌వుడ్ సినిమా 'ప్రేమద ఊరలి' బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. రిలీజైన పది రోజుల్లోనే ఏకంగా రూ.16 కోట్ల కలెక్షన్లు రాబట్టి సక్సెస్ ట్రాక్‌లో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ మనోజ్ కుమార్ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అందులో హీరోయిన్ రుక్మిణి వసంత్ గురించి చెప్పిన ఓ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

డైరెక్టర్ మనోజ్ కుమార్.. రుక్మిణి వసంత్ యాక్టింగ్‌కు పెద్ద ఫ్యాన్ అట. అందుకే 'ప్రేమద ఊరలి' సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఆమెను ఎలాగైనా తీసుకోవాలని ఆయన అనుకున్నారు. దీనికోసం చిత్రబృందం రుక్మిణి వసంత్‌ను సంప్రదించే ప్రయత్నం కూడా చేసింది.

కానీ, రుక్మిణి వసంత్ బిజీ షెడ్యూల్ వల్ల డైరెక్టర్ ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఒకవైపు కాల్ షీట్లు, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం.. మరోవైపు ఇది చిన్న బడ్జెట్ సినిమా కావడంతో ఆమెను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకురాలేకపోయామని మనోజ్ కుమార్ చెప్పారు.

హీరోయిన్ రాలేదు.. కానీ పేరు మాత్రం ఉండిపోయింది!

రుక్మిణి వసంత్‌ను సినిమాలో నటింపజేయలేకపోయినా, డైరెక్టర్ ఆమె పేరును మాత్రం వదులుకోలేదు. 'రుక్మిణి వసంత' అనే పేరు మనోజ్ కుమార్‌కు బాగా నచ్చేసింది. అందుకే సినిమాలో ఉన్న ఇద్దరు హీరోయిన్ల పాత్రలకు 'రుక్మిణి', 'వసంత' అని పేర్లు పెట్టారు. ఇందులో 'వసంత' అనేది కేవలం పాత్ర పేరు మాత్రమే కాదు, సినిమాలో ప్రకృతిని సూచించేలా ఆ పేరును వాడినట్లు డైరెక్టర్ వివరించారు.

మొదట సినిమా పేరు కూడా 'రుక్మిణి వసంత'నే!

ఇందులో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. 'ప్రేమద ఊరలి' అనే టైటిల్ ఫిక్స్ చేయడానికి ముందు ఈ సినిమాకు 'రుక్మిణి వసంత' అనే పేరే పెట్టారు. ఆ తర్వాత దాన్ని 'ప్రేమద ఊరలి'గా మార్చారు. ఇలా రుక్మిణి వసంత్ ఈ సినిమాలో నటించకపోయినా, ఆమె పేరు మాత్రం కథతో స్పెషల్‌గా కనెక్ట్ అయిపోయింది.

ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ మనోజ్ కుమార్ బయటపెట్టడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం 'ప్రేమద ఊరలి' సక్సెస్ కావడంతో సినిమా గురించి మరిన్ని చర్చలు జరుగుతున్నాయి. పది రోజుల్లో రూ.16 కోట్లు రాబట్టిన ఈ చిత్రం రాబోయే రోజుల్లో ఇంకెన్ని కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి.