- Home
- Entertainment
- Biggboss telugu 5:రూ. 25 లక్షలు తీసుకుని పోటీ నుంచి తప్పుకున్న టాప్ కంటెస్టెంట్.. ఫ్యాన్స్ కి భారీ షాక్
Biggboss telugu 5:రూ. 25 లక్షలు తీసుకుని పోటీ నుంచి తప్పుకున్న టాప్ కంటెస్టెంట్.. ఫ్యాన్స్ కి భారీ షాక్
మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే (Bigg boss season 5 grand finale)మొదలుకానుంది. అయితే ఇప్పటికే ఈ ఫైనల్ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి. టైటిల్ విన్నర్ తో పాటు ఎవరు ఏ స్థానంలో నిలిచారనే సమాచారం అందుతుంది.

కాగా అనూహ్యంగా ఓ కంటెస్టెంట్ రూ. 25 లక్షలు తీసుకొని టైటిల్ రేసు నుంచి తప్పుకున్నట్లు షాకింగ్ న్యూస్ అందుతుంది. గత సీజన్ లో ఇలాంటి పరిణామమే చోటు చేసుకోగా... పునరావృతం కావడం సంచలనంగా మారింది.
బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ కి చేరిన సోహైల్ (Sohail)అందరికీ షాకిస్తూ టైటిల్ రేసు నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ సీజన్ లో అభిజీత్, అఖిల్, సోహైల్, అరియానా, హారిక ఫైనల్ లో పోటీపడ్డారు. హారికకు 5వ స్థానం, అరియానాకు 4వ స్థానం దక్కింది. టైటిల్ కోసం అభిజీత్, అఖిల్, సోహైల్ మధ్య పోటీ నెలకొంది. ఆ సమయంలో నాగార్జున రూ. 25 లక్షలు ఆఫర్ చేశారు. నమ్మకం లేని వాళ్లు డబ్బులు తీసుకొని టైటిల్ రేసు నుండి తప్పుకోవచ్చని అడిగారు.
ఈ ఆఫర్ ని సోహైల్ తీసుకోవడం జరిగింది. దీంతో అభిజీత్, అఖిల్ ఫైనల్ కి చేరారు. ఫైనల్ లో అభిజీత్ గెలుపొంది, టైటిల్ అందుకున్నారు. నాగార్జున (Nagarjuna)ఆఫర్ ఈసారి సింగర్ శ్రీరామ్ తీసుకున్నట్లు వినికిడి. సిరి, మానస్ 4,5 స్థానాలతో ఎలిమినేట్ కాగా... టైటిల్ కోసం సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్ పోటీపడ్డారట.
ఈ క్రమంలో నాగార్జున టైటిల్ దక్కుతుందని నమ్మకం లేనివారు ఎవరైనా ఒకరు.. రూ. 25 లక్షలు తీసుకొని రేసు నుండి తప్పుకోవాలని సూచించగా... శ్రీరామ్ (Srirama chandra)డబ్బులు తీసుకొని టైటిల్ రేసు నుండి తప్పుకున్నట్లు సమాచారం. దీనితో సన్నీ, షణ్ముఖ్ ఫైనల్ కి చేరారు.
ఇది అధికారిక సమాచారం కానున్నప్పటికీ పరిశ్రమలో ప్రముఖంగా వినిపిస్తుంది. మరికొన్ని గంటల్లో దీనిపై క్లారిటీ రానుంది.కాగా నేటి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి గెస్ట్స్ గా రామ్ చరణ్, అలియా భట్, శ్యామ్ సింగరాయ్ టీమ్ గెస్ట్స్ గా రానున్నారట. ఎన్టీఆర్ కూడా వస్తున్నట్లు సమాచారం.
మరోవైపు టైటిల్ విన్నర్ గా సన్నీ పేరు వినిపిస్తుంది. మెజారిటీ ఓట్లు దక్కించుకున్న సన్నీ బిగ్ బాస్ సీజన్ 5 (Bigg boss telugu 5)టైటిల్ దక్కించుకున్నారట. యూట్యూబర్ షణ్ముఖ్ రెండవ స్థానంతో సరిపెట్టుకున్నాడని సమాచారం అందుతుంది. అనూహ్యంగా చివరి వారాల్లో సన్నీ పుంజుకోగా, షణ్ముఖ్ సిరి కారణంగా గేమ్ లో వెనుకబడ్డారని ఆడియన్స్ అభిప్రాయం.
Also read BIGG BOSS WINNER SUNNY: బిగ్ బాస్5 టైటిల్ సన్నీదే... ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా...?