గ్రాండ్ ఫినాలేకి ముందు చిన్న ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు గత నాలుగు బిగ్‌బాస్ సీజన్ల ఫైనలిస్ట్ కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఐదో సీజన్ ఫైనలిస్ట్ లతో చాట్ చేస్తూ, వారిచేత గేమ్‌లు ఆడిస్తూ సందడి చేశారు.
బిగ్‌బాస్ తెలుగు 5వ సీజన్ ముగింపుకి చేరుకుంది. ఆదివారం జరిగే గ్రాండ్ ఫినాలేతో ఈ సీజన్ పూర్తి కానుంది. గ్రాండ్ ఫినాలేకి ముందు చిన్న ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు గత నాలుగు బిగ్‌బాస్ సీజన్ల ఫైనలిస్ట్ కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఐదో సీజన్ ఫైనలిస్ట్ లతో చాట్ చేస్తూ, వారిచేత గేమ్‌లు ఆడిస్తూ సందడి చేశారు. నవ్వులు పూయించారు. పంచ్‌లు, ప్రశంసలు, పాటలు, ఆటలు, గేమ్‌లతో ఎంటర్‌టైన్ చేశారు. చేయించారు. అందులో భాగంగా మొదట బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్ విన్నర్ శివబాలాజీ, ఫైనలిస్ట్ లో ఒకరైన హరితేజ సందడి చేశారు.
వీరిద్దరు హౌజ్‌మేట్స్ తో చాట్ చేశారు. అనేక విషయాలు పంచుకున్నారు. ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ వెళ్లారు. ఇమిటేట్ చేశారు. మానస్,పింకీల మధ్య జరిగిన సంఘటనలను ఇమిటేట్ చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరి గురించి బుర్రకథ రూపంలో చెప్పింది హరితేజ. ఆమె చెప్పిన విధానం పాట పాడిన విధానం ఆకట్టుకుంది. అంతేకాదు ఓ పాటని గెస్ చేయాలనే టాస్క్ ఇచ్చారు. వీరి ఎపిసోడ్ ఆకట్టుకుంది. అనంతరం రెండో సీజన్ ఫైనలిస్ట్ లు రోడ్ రైడా, గీతా మాధురి సందడి చేశారు. వీరిద్దరు హౌజ్‌మేట్స్ కి పాటలిస్తూ వాటిని బోర్డ్ పై బొమ్మల రూపంలో తమ టీమ్‌కి చెప్పాల్సి ఉంటుంది. ఈ గేమ్ నవ్వించింది.
ఈ క్రమంలో షణ్ముఖ్‌పై గీతామాధురి పంచ్ వేసింది. సిరితో గ్యాప్ ఉండటం వల్ల మైండ్ బాగా పనిచేస్తుందని అన్నది. అప్పుడు దాన్ని లైట్ తీసుకున్నా ఆ తర్వాత మోజ్ రూమ్ లో మరోసారి తన స్టైల్ విశ్వరూపం చూపించారు. గీతామాధురి తమపై ఆ రేంజ్‌లో పంచ్ వేసిందని, దానికి మిగిలిన ముగ్గురు నవ్వుతూ మనల్ని టార్గెట్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. దీంతో సిరి అలిగి వెళ్లిపోయింది. కిచెన్ రూమ్‌లో సిరిని పట్టుకుని హగ్ చేసుకున్నాడు షన్ను.దీంతో ఆమె కూడా కూల్ అయిపోయింది. ఆ తర్వాత మూడో సీజన్ బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, కంటెస్టెంట్ శివజ్యోతి సందడి చేశారు. వీరిద్దరు సన్నీ గురించి, శ్రీరామ్ గురించి బాగా చెప్పారు. అలాగే షణ్ముఖ్, సిరిల గురించి చెప్పారు. శ్రీరామ్‌ని బయటకు వెళ్లాక ఏం చేస్తావని అడగ్గా,తాను హమీద కోసం వెతుకుతానని చెప్పడం హైలైట్‌గా నిలిచింది.
అనంతరం నాల్గో సీజన్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్లు అరియానా, అఖిల్ వచ్చారు. ఇంటి సభ్యులతో బెలూన్స్ తో పాటలు పాడించారు. బెలూన్ సైజ్‌ని బట్టి ఆ వాయిస్‌తో డైలాగులు చెప్పడం, ఇమిటేట్ చేయడం చేయాల్సి ఉంది.ఈ టాస్క్ నవ్వులు పూయించింది. ఈ సందర్భంగా సన్నీ గతంలో ఓ అమ్మాయితో డేట్‌కి వెళ్లినప్పుడు ఆమె తన గురించి కాకుండా తన బాయ్‌ఫ్రెండ్ గురించి తనచేత ఓదార్చు యాత్రం చేయించుకుందని చెప్పడం నవ్వులు పూయించింది. ఆ తర్వాత అరియానా, అఖిల్ ఓ ఫోటో చూపించి, అది హౌజ్‌లో ఎక్కడుందో చెప్పాల్సి ఉంది. ఇది ఆకట్టుకుంది.
మొత్తంగా శనివారం ఎపిసోడ్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్స్ ని ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. ప్రస్తుతం హౌజ్‌లో ఉన్న సన్నీ, సిరి, శ్రీరామ్, షణ్ముఖ్,మానస్‌లో ఎవరు విన్నర్ అనేది ఆసక్తికరంగా మారింది. ప్రిడిక్షన్స్, బిగ్‌బాస్ నుంచి అందుతున్నసమాచారం మేరకు సన్నీ విన్నర్ అని తెలుస్తుంది.ఇక బిగ్‌బాస్ 5 గ్రాండ్ ఫినాలేలో రామ్‌చరణ్, అలియాభట్, నాని, సాయిపల్లవి సందడి చేయబోతున్నారట.
