BIGG BOSS WINNER SUNNY: బిగ్ బాస్5 టైటిల్ సన్నీదే... ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా...?

బిగ్ బాస్ ఫైనల్స్ కు ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలుంది. విన్నర్.. రన్నర్ ఎవరు అన్న ఉత్కంఠకు ఆదివారం ఎపిసోడ్ తో తెరపడబోతోంది. అయితే ఇప్పటికే బిగ్ బాస్ విన్నర్ పై సోషల్ మీడియా లీక్స్ వచ్చేశాయి..

Bigg boss5 telugu winner sunny..  voting poll results

స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించిన తెలుగు రియాల్టి షో బిగ్ బాస్ సీజన్ 5. కింగ్ నాగార్జున హోస్ట్ గా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు వచ్చేసింది. అయితే అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న  ఈ సీజన్ విన్నర్ ఎవరో రేపు తెలిసిపోతుంది. మరోవైపు ఈ సీజన్ విన్నర్ ఎవరుకావచ్చనే దానిపై పెద్ద చర్చ జరుగుతోంది. 19 మందితో స్టార్ట్ అయింది బిగ్ బాస్ హౌస్..

 

ఒక్కో వారం ఒక్కొకరూ ఎలిమినేట్ అవుతూ..చివరికి వీజే సన్నీ, శ్రీరామచంద్ర, షన్ముఖ్ జశ్వంత్, మానస్, సిరిలు ఫైనల్స్ వరకు వచ్చారు. ఇక వీరిలో విన్నర్ ఎవరు.. రన్నర్ ఎవరూ అనేది ఆడియన్స్ వేసే ఓట్లను బట్టి తెలియబోతుంది. అయితే ఇప్పటికే ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. దాంతో విన్నర్ గురించి ఇప్పటికే క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో... సోషల్ మీడియాలో మార్కుల లిస్ట్ లీక్ అయినట్టు తెలుస్తోంది.

 

ఇక ఈ సీజన్ విన్నర్ సన్నీ అంటూ సోషల్ మీడియాలో న్యూస్ హల్ చల్ చేస్తుంది. ఆడియన్స్ ఓటింగ్ లో  ఎక్కువ శాతం ఓట్లు సన్నీకే పడినట్టు తెలుస్తోంది మరో వైపు 40 లక్షలకు  పైగా సోషల్ మీడియ ఫాలోవర్స్ ఉన్న షన్ముఖ్ ను కూడా పక్కన పెట్టి ఆడియన్స్ సన్నీకి పట్టం కట్టినట్టు సమాచారం. ఓటింగ్ లో ఎక్కువ శాతం ఓట్లతో సన్నీ టాప్ ప్లేస్ కు చేరినట్టు తెలుస్తోంది. ముందు నుంచీ సన్నీ విన్నర్ అంటూ గట్టిగానే టాక్ విపించింది. ఇక ఉన్నఐదుగురిలో.. 34 శాతం ఓట్లు  సన్నీకే పడినట్టు తెలుస్తోంది. అటు బిగ్ బాస్ కూడా రీసెంట్ గా జరిగిన జర్నీ ఈవెంట్ లో సన్నీ యువర్ టైమ్ ఆగయా అంటూ హింట్ ఇచ్చారు. దాంతో అప్పటి నుంచే సన్నీ విన్నర్ అంటూ ఫిక్స్ అయ్యారు ఫ్యాస్.

Also Read :  BALAKRISHNA: ఆదిత్య 369 సీక్వెల్ మోక్షజ్ఞ కాదు.. బాలయ్యే చేస్తున్నారా..?

34 శాతం ఓట్లతో సన్ని  తొలి స్థానంలో నిలవగా... ఆ తర్వాతి స్థానాల్లో 31 శాతం ఓట్లతో.. షన్ముఖ్,20 శాతం ఓట్లతో  శ్రీరామచంద్ర, 8 శాతం ఓట్లతో మానస్ 7 శాతం ఓట్లతో సిరి ఉన్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో ఈ ఓటింగ్ చార్ట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఏది ఏమైనా ఇఫ్పుడు ఉన్న ఐదుగురు ఫైనలిస్ట్ లలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్నది సన్నీ మాత్రమే. దాంతో బిగ్ బాస్ కప్పును సన్నీనే గెటుస్తాడంటూ..ఎక్కువ మంది అభిప్రాయ పడుతున్నారు. రన్నర్ గా షన్ముఖ్ కాని.. శ్రీరామచంద్రా కాని ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios