త్రిష ఇల్లు అమ్మేస్తే కొన్నా, బెడ్ రూం ఎలా ఉందని అడిగింది

First Published Dec 22, 2020, 3:52 PM IST

 దాదాపు రెండు దశాబ్ధాల పాటు తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణించారు చెన్నై భామ త్రిష. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించిన త్రిష చివరిగా జూనీయర్‌ సరసన ‘దమ్ము’లో చిత్రంలో నటించారు. ఆ తర్వాత సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చిన త్రిష ప్రస్తుతం తెలుగులో తక్కువ.. తమిళ సినిమాలలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇక మూడు పదుల వయసుకు వచ్చినప్పటికి ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. 

అలాగే త్రిష తండ్రి ఆ ఇల్లు అప్పట్లో వేరే చోట వ్యాపారం లో పెట్టుబడి పెట్టడానికి డబ్బు అవసరమై అమ్మారని భానుచందర్ అప్పటి  పరిస్దితులను గుర్తు చేసుకుని చెప్పారు. ఆ ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుతో వ్యాపారం చేసారని అన్నారు.

అలాగే ఆ ఇంట్లో ఉన్న సమయంలో త్రిష..ఇంకా హీరోయిన్ కాలేదని, చిన్న చిన్న పాత్రలు వేసేదని అన్నారు. ఆ తర్వాత తాము ఇంటిని  కొనుక్కున్నామని చెప్పారు. ఆ తర్వాత త్రిష హీరోయిన్ గా ఎదిగిందని అన్నారు. అలాగని ఆ ఇల్లు కలిసి రాలేదని అనలేమని, అప్పటికి ఆమె  కెరీర్ ప్రారంభ దశలో ఉందని అన్నారు.

ఇక ఓ రోజు సురేష్ బాబు కుమార్తె వివాహ సమయంలో నానక్ రామ్ గూడలో కలిసినప్పుడు త్రిష ఆ ఇంటి విషయం గుర్తు చేసిందని  చెప్పారు. తనను చూడగానే పలకరించి ఇంటి గురించి అడిగిందని అన్నారు.

ముఖ్యంగా ఇంట్లో తను పడుకునే బెడ్ రూమ్ ఎలా ఉందని సరదాగా అడిగిందని అన్నారు. ఆమె రౌండ్ బెడ్ వాడేదని చెప్పారు. తను సైతం  ఆ బెడ్ రూమ్ నే వాడుతున్నానని అన్నారు. అక్కడే టీవి చూస్తానని అన్నారు.

త్రిష ..ఓ సారి వచ్చి ఇల్లు చూసుకోవచ్చా అని తనని అడిగిందని, ఖచ్చితంగా చూడవచ్చు అని తను జవాబు ఇచ్చానని భానుచందర్  చెప్పారు. అయితే త్రిష మెయింటైన్ చేసినంత బాగా తను ఇంటిని మెయింటైన్ చేయకపోవచ్చు అని ఆమెతో అన్నానని అన్నారు.

అయితే ఇప్పటిదాకా ఆమె తన అమ్మేసిన ఇంటిని చూసుకోవటానికి రాలేదని అన్నారు. ఆమె బిజీగా ఉంటుందని, సరదాగా అడిగి  ఉంటుందని వివరించారు. ఆ ఇల్లు తమకు కలిసి వచ్చిందే అని అన్నారు. లిటిల్ క్యూట్ హౌస్ అని వివరించారు.

త్రిష 2002లో లేసా లేసా చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమయ్యారు. హీరోయిన్ గా పుష్కర కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ మధ్యన తిష నటించిన భూలోకం, ఎన్నై అరిందాల్ చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధం అయ్యాయి.

త్రిష చేతిలో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’, ‘పరమపదం విలయాట్టు’, ‘రాంగీ’, ‘రామ్‌’, ‘గర్జనై’ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాలో త్రిషతోపాటు విక్రమ్‌, జయం రవి, కార్తి, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, ఐశ్వర్య లక్ష్మి తదితరులు నటిస్తున్నారు.

ఇక ఆమె అసలు చిరంజీవి ఆచార్యలో నటించాల్సి ఉంది. ఆమె కొన్ని రోజులు షూటింగ్‌లోనూ పాల్గొన్నారు. అయితే క్రియేటివ్‌ విషయంలో భిన్నాభిప్రాయాల వల్ల ప్రాజెక్టు నుంచి వైదొలిగినట్లు త్రిష ట్వీట్‌ చేసి, అందరికీ షాక్‌ ఇచ్చారు. ఆపై ఆమె స్థానంలో కథానాయిక కాజల్‌ను తీసుకున్నారు.

అయితే త్రిష ప్రాజెక్టు నుంచి వైదొలగడం గురించి చిరు అప్పట్లో స్పందించారు. ఆమె తప్పుకుందని తెలిసి షాక్‌కు గురైనట్లు చెప్పారు. ‘త్రిషతో ఏదైనా సమస్య ఉందా? అని నా టీమ్ ని అడిగాను. నా కుమార్తె సుస్మితా.. త్రిష కాస్ట్యూమ్స్‌ కూడా సిద్ధం చేసింది. ఆమె సినిమా నుంచి తప్పుకుందన్న వార్త తెలిసి షాక్‌ అయ్యా. ఆ తర్వాత.. ఆమె మణిరత్నం ప్రాజెక్టుకు సంతకం చేశారని, ఆ సినిమాకు అధికంగా డేట్స్‌ ఇచ్చారని నాకు తెలిసింది. క్రియేటివిటీ విషయంలో త్రిషతో మా టీంలో ఎవరికీ ఎటువంటి భిన్నాభిప్రాయాలూ లేవు’ అని పేర్కొన్నారు.

'96' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు త్రిష. విజయ్‌ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈచిత్రం ఊహించని స్థాయిలో విశేష ఆదరణను చూరగొంది. ఆ తర్వాత 'పేటా' సినిమాలో ఆమె తొలిసారిగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు జోడీగా నటించారు.

సినీ నిర్మాత వరుణ్‌ మణియన్‌తో నిశ్చితార్ధం వరకు వెళ్లి.. ఏవో కారణాలతో చివరి నిమిషంలో త్రిష ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌లోని ఓ నటుడిని ఆమె పెళ్లాడనుందనే వార్తలు వినిపించాయి.

ఆ నటుడి విషయంలో స్పందించిన త్రిష.. అతను కేవలం తనకు ప్రాణ స్నేహితుడు మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది. మరి ఈ తరుణంలో అసలు త్రిషకు పెళ్లి అవుతుందా? అనే అనుమానాలు కూడా వ్యాపించాయి.

‘అన్ని విషయాల్లో నన్ను పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తినే నేను పెళ్లి చేసుకుంటాను. అది కూడా ప్రేమ వివాహమే. అలాంటి వ్యక్తి దొరికినప్పుడు తప్పకుండా వివాహ బంధంలోకి అడుగుపెడతాను. అప్పటివరకూ సింగిల్‌గా ఉండడానికి ఇబ్బంది లేదు. ఒకవేళ సరైన జీవిత భాగస్వామి దొరక్కపోతే ఎలాంటి బాధా లేకుండా ఎప్పటికీ సింగిల్‌గానే ఉండగలను’ అని త్రిష

అమితాబ్‌ బచ్చన్‌, దీపిక పదుకొణె ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘పీకూ’. తండ్రీ కూతుళ్ల అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు బాలీవుడ్‌లో మంచి ఆదరణ వచ్చింది. ₹100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ రీమేక్ లో త్రిష నటిస్తోంది.

‘పీకూ’ను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించేందుకు ఓ ప్రముఖ సంస్థ హక్కులు తీసుకుందట. ఇందులో కథానాయిక పాత్ర కోసం త్రిషను సంప్రదించారని, అందుకు ఆమె సుముఖంగా ఉన్నారనీ తెలుస్తోంది. హిందీ మాతృకలో ఆ పాత్రను దీపిక పదుకొణె పోషించిన విషయం తెలిసిందే.

అయితే సినిమా ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఇతర ప్రధాన పాత్రధారులు ఎవరు అనే విషయంలో సమాచారం లేదు. ఓ రోడ్‌ ట్రిప్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఇర్ఫాన్‌ ఖాన్‌ మరో ప్రధాన పాత్రధారి. అమితాబ్‌, దీపిక, ఇర్ఫాన్‌ మధ్యనే ఈ సినిమా నడుస్తుంది.

కోపిష్ఠి వృద్ధుడిగా అమితాబ్‌, ఉద్యోగం చేస్తూ తండ్రిని చూసుకునే యువతిగా దీపిక పదుకొణె, వారిద్దరిని కారులో గమ్యం చేర్చే డ్రైవర్‌గా ఇర్ఫాన్‌ అదరగొట్టేశారు. మరి తెలుగు/తమిళంలో ఎవరు చేస్తారో, ఎలా చేస్తారో చూడాలి.

ఇక ఆ మధ్యన సెప్టెంబరు 30 1999.. తన జీవితాన్ని మార్చేసిందని నటి త్రిష గుర్తు చేసుకున్నారు. ‘మిస్‌ చెన్నై’ అందాల కిరీటం అందుకున్న రోజుల్ని గుర్తు చేసుకున్నారు. దీనికి మంచు లక్ష్మి స్పందిస్తూ.. త్రిష అందంలో ఎటువంటి మార్పు రాలేదని, అలానే చక్కగా ఉన్నారని కితాబిచ్చారు.

18 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో విజయవంతంగా రాణిస్తున్న హీరోయిన్ త్రిష. ట్విటర్‌ ఇండియా చిత్ర పరిశ్రమలో నెటిజన్లు అత్యధికంగా మాట్లాడుకున్నహీరోయిన్స్ జాబితాలో పదో స్థానంలో నిలిచారు. గత ఏడాది ‘పేటా’ తర్వాత పలు ప్రాజెక్టులకు సంతకం చేశారు. ఇప్పుడు ఆమె దాదాపు ఏడు సినిమాల్లో నటిస్తున్నారు. త్రిషను ట్విటర్‌లో 5.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆమె 47 మందిని అనుసరిస్తున్నారు.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?