MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Nagarjuna: ఛి.. ఛి ఇదేం పని అనుకున్న నాగార్జున, బిగ్ బాస్ హోస్ట్ ఎలా అయ్యాడు, కింగ్ షాకింగ్ కామెంట్స్

Nagarjuna: ఛి.. ఛి ఇదేం పని అనుకున్న నాగార్జున, బిగ్ బాస్ హోస్ట్ ఎలా అయ్యాడు, కింగ్ షాకింగ్ కామెంట్స్

Nagarjuna: బిగ్ బాస్ తెలుగు 9 సీజన్లు కంప్లీట్ అయ్యి 10వ సీజన్ నడుస్తుంది. 7 సీజన్లను సక్సెస్ ఫుల్ గా హోస్ట్ చేసిన కింగ్ నాగార్జున.. సీజన్ 10 ను కూడా పరుగులు పెట్టిస్తున్నారు. ఇక బిగ్ బాస్ కు రాకముందు ఈ షో గురించి ఆయన ఏమన్నారో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 07 2026, 11:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బిగ్ బాస్ సక్సెస్ ఫుల్ హోస్ట్ గా నాగార్జున
Image Credit : Youtube/@StarMaa

బిగ్ బాస్ సక్సెస్ ఫుల్ హోస్ట్ గా నాగార్జున

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షోలలో 'బిగ్ బాస్' (Bigg Boss Telugu) ఒకటి. తెలుగింటి ప్రేక్షకులను కట్టిపడేసే ఈ బిగ్ బాస్ షోకి టాలీవుడ్ 'కింగ్' అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తూ తనదైన శైలిలో షోను దిగ్విజయంగా నడిపిస్తున్నారు. బిగ్ బాస్ 9 సీజన్లు కంప్లీట్ అవ్వగా.. అందులో 7 సీజన్లను నాగ్ సక్సెస్ ఫుల్ గా హోస్ట్ చేశాడు..

ఇప్పుడు ఆయన హోస్ట్ చేస్తున్న 10 వ సీజన్ కు కూడా భారీ రెస్పాన్స్ వస్తోంది. అయితే, ఒకప్పుడు బిగ్ బాస్ సెట్‌కి వెళ్లినప్పుడు తనకు కలిగిన అనుభవాన్ని, ఆ సమయాల్లో తనకు ఎదురైన విచిత్రమైన భావాలను నాగార్జున ఒక ఇంటర్వ్యూలో సరదాగా పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఛి ఛి ఛి! ఇదేం పని అనిపించింది
Image Credit : Jio Hotstar

ఛి ఛి ఛి! ఇదేం పని అనిపించింది

బిగ్ బాస్ మీద నాగార్జునకు అప్పుడున్న అభిప్రాయానికి.. ఆయన అసలు హోస్ట్ ఎలా అయ్యాడంటారు? నాగార్జున హోస్ట్‌గా మారకముందు.. అన్నపూర్ణ స్టూడియోస్ లోనే సెట్ ఉండటంతో.. బిగ్ బాస్ హౌస్ సెట్ వాతావరణం ఎలా ఉంటుందో చూడాలనే క్యూరియాసిటీతో (Curiosity) ఒకసారి సెట్స్‌కి వెళ్లారట. "అప్పటికే లోపల కంటెస్టెంట్లు ఉన్నారు. జస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని ఉత్సాహంతో లోపలికి వెళ్లాను" అని నాగార్జున చెప్పారు.

అయితే, సెట్‌లో కంటెస్టెంట్లకు తెలియకుండా కెమెరాల ద్వారా వారిని నిఘా పెట్టి చూడటం తనకు కాస్త విచిత్రంగా, ఇబ్బందిగా అనిపించిందని ఆయన తెలిపారు. "వాళ్లకు తెలియకుండా నేను ఇలా చాటుగా ఒకరిని చూస్తుంటే.. ఛి ఛి ఛి! ఇదేం పని అనిపించింది. ఆ వాతావరణాన్ని నేను హ్యాండిల్ చేయలేకపోయాను" అని నాగార్జున నవ్వుతూ వెల్లడించారు.

34
నేనైతే అసలు ఆ ఇంట్లో ఉండలేను!
Image Credit : Youtube/@starmaa

నేనైతే అసలు ఆ ఇంట్లో ఉండలేను!

బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు రోజులు, వారాల తరబడి ఫోన్లు, బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఎలా ఉంటారో తలచుకుంటేనే ఆశ్చర్యం వేస్తుందని నాగార్జున తన పాత ఇంటర్య్యూలో కామెంట్స చేశారు. "నన్ను గనక ఆ బిగ్ బాస్ హౌస్ లోపల ఉండమంటే నేనైతే ఒక్క రోజు కూడా ఉండలేను.. అది నాకు సాధ్యం కాని పని (Impossible)" అని నాగార్జున తేల్చి చెప్పారు.

44
హోస్ట్‌గా సక్సెస్ ఫుల్ జర్నీ
Image Credit : Asianet News

హోస్ట్‌గా సక్సెస్ ఫుల్ జర్నీ

మొదట్లో బిగ్ బాస్ కాన్సెప్ట్ చూసి అవాక్కైన నాగార్జున, ఆ తర్వాత అదే షోకి విజయవంతమైన హోస్ట్‌గా మారి సరికొత్త రికార్డులు సృష్టించడం విశేషం. వీకెండ్స్ లో కంటెస్టెంట్లకు క్లాస్ పీకుతూ, తప్పులను సరిదిద్దుతూ, వినోదాన్ని పంచుతూ బిగ్ బాస్‌కు ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చిపెట్టారు. ఒకప్పుడు 'హ్యాండిల్ చేయలేను' అనుకున్న కాన్సెప్ట్‌నే తనదైన చరిష్మాతో టెలివిజన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్ షోగా మలిచారు నాగార్జున.

ప్రస్తుతం బిగ్ బాస్ ను.. హోస్ట్ నాగార్జునను విడి విడిగా చూడటం కష్టమనే చెప్పాలి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఇప్పటికే హౌస్ నుంచి చైత్రరాయ్, కృష్ణుడు, సృష్టి ఎలిమినేట్ అవ్వగా.. మిథిలేష్ మాత్రం క్యాష్ ఆఫర్ ను తీసుకుని బయటకు వచ్చేశాడు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు రసవత్తరంగా సాగుతోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
అక్కినేని నాగార్జున
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Master Bharath: యాక్టర్ నుంచి డాక్టర్ గా.. తల్లి చివరి కోరిక తీర్చడానికి కెరీర్ ను త్యాగం చేసిన మాస్టర్ భరత్...
Recommended image2
Soundarya: చనిపోవడానికి ముందు మేనకోడలితో సౌందర్య ఏమన్నారంటే? చివరి మాటలు ఇవే
Recommended image3
Don't Trouble The Trouble 5 Days Collections: డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌కి దారుణమైన కలెక్షన్లు.. 5 రోజుల్లో ఇంతేనా
Related Stories
Recommended image1
Bhairava Dweepam Review: బాలకృష్ణ జీవితంలో చేసిన అతి పెద్ద సాహసం, భైరవద్వీపం సక్సెస్ కు కారణాలు ఇవే..
Recommended image2
Soundarya: చనిపోవడానికి ముందు మేనకోడలితో సౌందర్య ఏమన్నారంటే? చివరి మాటలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved