MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Master Bharath: యాక్టర్ నుంచి డాక్టర్ గా.. తల్లి చివరి కోరిక తీర్చడానికి కెరీర్ ను త్యాగం చేసిన మాస్టర్ భరత్...

Master Bharath: యాక్టర్ నుంచి డాక్టర్ గా.. తల్లి చివరి కోరిక తీర్చడానికి కెరీర్ ను త్యాగం చేసిన మాస్టర్ భరత్...

Master Bharath: తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వేలా అలరించిన నటుడు మాస్టర్ భరత్. వయసు పెరిగే కొద్దీ ఆఫర్లు తగ్గడంతో సినిమాలకు కాస్త దూరమయ్యాడు. తల్లి చివరి కోరికను నెరవేర్చడానికి భరత్ ఏ నిర్ణయం తీసుకున్నాడో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 07 2026, 08:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వరుస సినిమాలతో అలరించిన మాస్టర్ భరత్..
Image Credit : Asianet News

వరుస సినిమాలతో అలరించిన మాస్టర్ భరత్..

తెలుగు చలనచిత్ర రంగంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అడుగుపెట్టి, తనదైన కామెడీ టైమింగ్, ముద్దులొలికే రూపం, అద్భుత నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నటుడు భరత్ రెడ్డి. 'మాస్టర్ భరత్' అని పిలిస్తేనే టాలీవుడ్ ఆడియన్స్‌కు ఆయన గుర్తొస్తారు. 'పోకిరి', 'ఢీ', 'రెడీ', 'బింబిసార' వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హాస్యం పండించి, స్టార్ హీరోలకు సమానంగా గుర్తింపు సంపాదించుకున్నారు భరత్. ఇప్పుడు జీవితంలో మరొక అడుగు ముందుకు వేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బాలనటుడిగా దూసుకెళ్లిన భరత్..
Image Credit : Asianet News

బాలనటుడిగా దూసుకెళ్లిన భరత్..

చిన్నతనంలోనే పరిశ్రమలోకి అడుగుపెట్టిన భరత్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శ్రీను వైట్ల వంటి దిగ్గజాల కలయికలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన 'ఢీ', 'రెడీ', 'కింగ్' వంటి సినిమాలు ఆయన కెరీర్‌ను మలుపు తిప్పాయి. 'రెడీ' సినిమాలో "ఏవండీ.. నాన్నగారూ!" అంటూ ఆయన చెప్పిన డైలాగులు ఇప్పటికీ మీమ్స్‌గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా డజన్ల కొద్దీ సినిమాల్లో నటించి, 'నంది అవార్డు'ను కూడా సొంతం చేసుకున్నారు.

34
బరువు తగ్గి కొత్త లుక్‌లో భరత్..
Image Credit : Asianet News

బరువు తగ్గి కొత్త లుక్‌లో భరత్..

చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంత పేరు తెచ్చుకున్నా, వయసు పెరిగే కొద్దీ నటుడిగా నిలదొక్కుకోవడం ఎవరికైనా పెద్ద సవాలే. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు బొద్దుగా ఉన్న భరత్, టీనేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హీరో అవకాశాల కోసం తీవ్రంగా శ్రమించారు. కఠినమైన వర్కౌట్స్, ఆహార నియమాలతో ఏకంగా కిలోల కొద్దీ బరువు తగ్గి స్లిమ్‌గా, ఫిట్‌గా మారారు. ఆయన మేకోవర్ చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. కానీ, బరువు తగ్గి లుక్ మార్చుకున్నప్పటికీ హీరోగా అవకాశాలు రాలేదు. దాంతో హీరోలకు స్నేహితుడి పాత్రల్లో నటించారు. అల్లు శిరీష్ నటించిన చిత్రాలలో నటిస్తూ తనదైన శైలిలో కామెడీ పండించారు.

44
తల్లి కోరిక నెరవేర్చాలని.. యాక్టర్ నుంచి డాక్టర్‌గా!
Image Credit : Asianet News

తల్లి కోరిక నెరవేర్చాలని.. యాక్టర్ నుంచి డాక్టర్‌గా!

ఇండస్ట్రీలో డాక్టర్ చదివి నటులుగా మారినవారు చాలామంది ఉన్నారు. కానీ భరత్ మాత్రం యాక్టర్ నుంచి డాక్టర్‌గా మారి ప్రత్యేకత చాటుకున్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత భరత్ చదువుపై దృష్టి పెట్టారు. బాగా చదివి మెడిసిన్ సీటు సాధించారు. ఆయన తన MBBS విద్యను విజయవంతంగా పూర్తి చేశారని సమాచారం. . చిన్నప్పటి నుంచి చదువులోనూ చురుగ్గా ఉండే భరత్, తాను డాక్టర్ కావాలనేది తన తల్లి కమలాసిని కోరిక అని గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

అందుకోసమే చెన్నైలో మెడిసిన్ (MBBS) చదువును పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అయితే, 2025 మే నెలలో ఆయన తల్లి గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఆమె ఆశయానికి అనుగుణంగానే రాత్రింబవళ్లు కష్టపడి చదివి మెడికల్ కోర్సును పూర్తి చేసి డాక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారట భరత్. మరి తర్వాత కాలంలో ఆయన మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Soundarya: చనిపోవడానికి ముందు మేనకోడలితో సౌందర్య ఏమన్నారంటే? చివరి మాటలు ఇవే
Recommended image2
Don't Trouble The Trouble 5 Days Collections: డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌కి దారుణమైన కలెక్షన్లు.. 5 రోజుల్లో ఇంతేనా
Recommended image3
Bigg Boss 10: పులివేషం వేసుకున్న గుంటనక్క.. ఆటగాడిలా ఆడు, పోటుగాడిలా కాదు.. ముఖేష్‌, రోహిత్, అమన్‌కి వార్నింగ్‌
Related Stories
Recommended image1
Vijay Deverakonda: రష్మికను పెళ్లి చేసుకోవడానికి ఒక్కటే కారణం.. అసలు గుట్టు విప్పిన విజయ్!
Recommended image2
Soundarya: చనిపోవడానికి ముందు మేనకోడలితో సౌందర్య ఏమన్నారంటే? చివరి మాటలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved