MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • బాలయ్యతో చేసిన ఆ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్

బాలయ్యతో చేసిన ఆ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్

Anushka Shetty: నందమూరి బాలకృష్ణ హీరోగా, వైవియస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఒక్క మగాడు’. అనుష్క కెరీర్ తొలినాళ్లలో ఈ సినిమాలో విడుదలైంది. 2008 సంక్రాంతి కానుకగా విడుదలైన ‘ఒక్క మగాడు’ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

2 Min read
Author : Pavithra D
Published : Dec 16 2025, 05:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాలయ్యతోనే చేదు.. మిగిలిన హీరోలతో.!
Image Credit : Twitter

బాలయ్యతోనే చేదు.. మిగిలిన హీరోలతో.!

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ అనుష్క శెట్టి. అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక అనుష్క, ప్రభాస్ కాంబినేషన్ చిత్రాలైతే అభిమానులకు ఫీస్ట్ అని చెప్పొచ్చు. 'అరుంధతి' సినిమాతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కూడా మంచి బిజినెస్ తెచ్చిపెట్టిన అనుష్క.. క్రమంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. బాహుబలి 1 & 2 చిత్రాలతో అనుష్కకు ప్యాన్ ఇండియా స్టేటస్ వచ్చింది. ఇదిలా ఉంటే.. తన కెరీర్‌లో ఓ పెద్ద తప్పు చేశానంటోంది అనుష్క.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బాలయ్యతో ఆ సినిమానే..
Image Credit : Twitter

బాలయ్యతో ఆ సినిమానే..

బాలకృష్ణతో చేసిన ఒక్క సినిమా తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మిస్టేక్ అని స్వీటీ చెబుతోంది. ఆ సినిమా మరేదో కాదు.. నందమూరి బాలకృష్ణ హీరోగా, వైవియస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఒక్క మగాడు’. కెరీర్ తొలినాళ్లలో ఉండగా అనుష్క ఈ చిత్రం చేసింది. 2008వ సంవత్సరంలో ఈ ‘ఒక్క మగాడు’ థియేటర్లలో విడుదలై అట్టర్ ప్లాప్‌గా మారింది. ఆ సమయంలో బాలకృష్ణ – వైవియస్ చౌదరి కాంబినేషన్ క్రేజ్ ఉండటంతో.. కథను పూర్తిగా వినకుండానే, తన పాత్రకు ఎంత స్కోప్ ఉంటుందో తెలుసుకోకుండానే ఈ సినిమాకు ఒప్పుకున్నానని అనుష్క స్పష్టం చేసింది.

Related Articles

Related image1
Actress: చేసినవి 12 చిత్రాలైతే అందులో రెండే హిట్స్.. కానీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.. ఎవరంటే.?
Related image2
Actress: చేసినవి 8 చిత్రాలు.. కుర్రాళ్లకు కలల రాణి.. కానీ అర్ధాంతరంగా ఇండస్ట్రీ వదిలేసింది.. ఎవరంటే.?
35
బాక్సాఫీస్ దగ్గర బోల్తా..
Image Credit : Twitter

బాక్సాఫీస్ దగ్గర బోల్తా..

అప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. అంతేకాదు బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో అనుష్క పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. అలాగే ఓ పాటలో అనుష్క ఫుల్ గ్లామరస్‌గా కనిపిస్తోంది. దీని వల్ల అప్పట్లో అనుష్కపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ ఆ ఒక్క పాట అనుష్కను అభాసుపాలు చేస్తోందని చెప్పడంలో అతిశయోక్తి కాదు.

45
బాలకృష్ణతో పని చేయడం గొప్ప అనుభవం..
Image Credit : Twitter

బాలకృష్ణతో పని చేయడం గొప్ప అనుభవం..

ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ.. బాలకృష్ణతో పని చేయడం తనకు మంచి అనుభవమేనని అనుష్క తెలిపింది. కథ, తన పాత్ర నిడివిని పూర్తిగా తెలుసుకోకుండా ఒప్పుకోవడం తన కెరీర్‌లో చేసిన అతిపెద్ద తప్పుగా భావిస్తున్నానని స్పష్టం చేసింది. ఆ సినిమాతో చాలా నేర్చుకున్నానని.. ఆ తర్వాత సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చానని తెలిపింది.

55
ప్రభాస్‌తో స్నేహం..
Image Credit : Twitter

ప్రభాస్‌తో స్నేహం..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్, అనుష్క మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి పలు సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ఈ ఇద్దరి మధ్య పెళ్లి వార్తలు చాలానే చక్కర్లు కొట్టాయి. అయితే అవన్నీ కూడా వట్టి పుకార్లు మాత్రమే. ఇప్పటికీ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండగా.. ఇద్దరూ కూడా బ్యాచిలర్స్ కావడంతోనే ఎప్పటికప్పుడు ఏదొక రూమర్ పుట్టుకొస్తోంది. ఇక అటు ప్రభాస్, ఇటు అనుష్క.. ఇద్దరూ తమ ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
తెలుగు సినిమా
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiru-Pawan: చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే..మెగాస్టార్ జోస్యం చెప్పిన మూవీ సూపర్ హిట్
Recommended image2
Irumudi Day 12 Collections: బాక్సాఫీసు వద్ద రవితేజ రేంజ్‌ ఏంటో చూపించిన ఇరుముడి.. హైయ్యెస్ట్ ప్రాఫిట్స్
Recommended image3
Hello Brother Review: ఏఎన్నార్ వద్దని మొత్తుకున్నా నాగార్జున వినకుండా చేసిన సినిమా, చిరంజీవి మిస్సైన హలో బ్రదర్ మూవీ రివ్యూ..
Related Stories
Recommended image1
Actress: చేసినవి 12 చిత్రాలైతే అందులో రెండే హిట్స్.. కానీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.. ఎవరంటే.?
Recommended image2
Actress: చేసినవి 8 చిత్రాలు.. కుర్రాళ్లకు కలల రాణి.. కానీ అర్ధాంతరంగా ఇండస్ట్రీ వదిలేసింది.. ఎవరంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved