- Home
- Entertainment
- విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
సౌత్ స్టార్ హీరో విజయ్ దళపతి ఆయన కెరీర్ లో నటిస్తున్న చివరి సినిమా 'జన నాయగన్' వచ్చే జనవరి 9న విడుదల కానున్న నేపథ్యంలో, ఈ సినిమా రన్ టైమ్ గురించిన అప్డేట్ అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

విజయ్ దళపతి చివరి సినిమా
సౌత్ స్టార్ హీరో విజయ్ దళపతి 69వ సినిమా 'జన నాయగన్'. దీనికి హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో విజయ్ నటనకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకోవడంతో, అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాకు విజయ్ రూ.275 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. దీంతో తమిళంలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా విజయ్ నిలిచారు.
2026 సంక్రాంతి కానుకగా
జన నాయగన్ సినిమా 2026 పొంగల్ కానుకగా రానుంది. ఈ సినిమాను జనవరి 9న విడుదల చేయనున్నారు. దీనికి పోటీగా శివకార్తికేయన్ 'పరాశక్తి' కూడా విడుదల కానుంది. 'జన నాయగన్' తెలుగులో బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి రీమేక్ అని అంటున్నారు. ఈ సినిమా విజయ్ అభిమానులకు పక్కా ట్రీట్ అవుతుందని అంచనా. దీనికి రాక్‌స్టార్ అనిరుధ్ సంగీతం అందించారు.
జన నాయగన్' ఫస్ట్ సింగిల్
'జన నాయగన్' ఫస్ట్ సింగిల్ 'దళపతి కచ్చేరి' గత నెలలో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఆడియో లాంచ్‌ను మలేషియాలో గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. డిసెంబర్ 27న ఈ ఈవెంట్ జరగనుంది. టికెట్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. చాలా మంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారట.
జన నాయగన్ సినిమా రన్ టైమ్
ఇంతలో, 'జన నాయగన్' సినిమా రన్ టైమ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా రన్ టైమ్ 3 గంటల 6 నిమిషాలు ఉన్నట్టు తెలుస్తోంది. విజయ్ కెరీర్‌లో 'నన్బన్' తర్వాత ఇదే అత్యధిక నిడివి ఉన్న సినిమా. 'నన్బన్' రన్ టైమ్ 3 గంటల 8 నిమిషాలు. చివరిగా వచ్చిన 'ది గోట్' 3 గంటల 3 నిమిషాల నిడివితో విడుదలైంది. ఆ నిడివి సినిమాకు మైనస్ అయింది. ఇప్పుడు 'జన నాయగన్' కూడా ఎక్కువ రన్ టైమ్‌తో వస్తుండటంతో, ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

