- Home
- Entertainment
- Actress: చేసినవి 12 చిత్రాలైతే అందులో రెండే హిట్స్.. కానీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.. ఎవరంటే.?
Actress: చేసినవి 12 చిత్రాలైతే అందులో రెండే హిట్స్.. కానీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.. ఎవరంటే.?
Actress: ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా చేసినవి 12 చిత్రాలు అయితే.. అందులో కేవలం రెండు మాత్రమే హిట్. మిగిలినవన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి. కానీ చిన్నదాని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. మరి ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందామా..

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ..
ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2017లో 'చిత్రాంగద' అనే చిత్రం ద్వారా అరంగేట్రం చేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడకపోయినా.. సరిగ్గా రెండేళ్ళ తర్వాత హీరోయిన్‌గా డెబ్యూ అయింది ఈ చిన్నది. ముద్దుగుమ్మ తెలుగమ్మాయ్.. కానీ కెరీర్ కన్నడ ఇండస్ట్రీలో నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత తెలుగులో వరుస చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఇప్పటికీ ఆమె ఎవరో అర్ధమై ఉంటుంది.. అదేనండీ.! శ్రీలీల
రాఘవేంద్రరావు చిత్రంతో ఎంట్రీ..
2021లో 'పెళ్లి సందD' సినిమాతో తెలుగులోకి హీరోయిన్ గా పరిచయమైంది శ్రీలీల. ఈ సినిమాకు దర్శకత్వం కె. రాఘవేంద్రరావు వ్యవహరించారు. బాక్సాఫీస్ దగ్గర మూవీ కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయినా.. ఆ తర్వాత వరుసపెట్టి శ్రీలీలకు ఆఫర్స్ వచ్చిపడ్డాయి. ఆపై శ్రీలీల నటించిన 'ధమాకా' చిత్రం సూపర్ హిట్ అయింది.
చేసినవి 12 చిత్రాలు.. కానీ.!
హీరోయిన్‌గా శ్రీలీల ఇప్పటివరకు సుమారు 12 చిత్రాల్లో నటించింది. అయితే బాక్సాఫీస్ దగ్గర హిట్ అయినవి మాత్రం కేవలం రెండు. 'స్కంద', 'ఆదికేశవ', 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్', 'రాబిన్ హుడ్', 'జూనియర్'.. ఇలా వరుస సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. కానీ అమ్మడి క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఏకంగా బాలీవుడ్‌లోనూ ఛాన్స్ దక్కించుకుంది.
బాలీవుడ్‌లోకి ఎంట్రీ..
సూపర్ హిట్ అయిన అషికీ సీక్వెల్‌లో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తుండగా.. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ మూవీతోనే అటు కార్తీక్ ఆర్యన్, ఇటు శ్రీలీల మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని రూమర్స్ వస్తున్నాయి.
లైన్‌లో నాలుగు చిత్రాలు..
ప్రస్తుతం హీరోయిన్ శ్రీలీల ఖాతాలో నాలుగు చిత్రాలు ఉన్నాయి. అందులో ఒక తమిళం, ఒక హిందీ చిత్రం కాగా.. ఇక తెలుగులో రవితేజతో 'మాస్ జాతర', పవన్ కళ్యాణ్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాల్లో చేస్తోంది. ఈ రెండింటిలో ఒకటి హిట్ అయినా.. మళ్లీ శ్రీలీల తిరిగి ఫామ్‌లోకి రావడం పక్కా అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.