MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Raviteja: బాలయ్య, రవితేజ కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఇదే.. పరుచూరి బ్రదర్స్ చేసిన మోసం

Raviteja: బాలయ్య, రవితేజ కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఇదే.. పరుచూరి బ్రదర్స్ చేసిన మోసం

రవితేజ, బాలకృష్ణ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఒక సినిమా చేయాల్సి వచ్చింది. పరుచూరి బ్రదర్స్ కారణంగా తనకు అవకాశం మిస్‌ అయ్యిందని రవితేజ తెలిపారు. ఆ మూవీ ఏంటి? అసలు ఏం జరిగిందంటే?

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 29 2026, 01:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇరుముడితో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న రవితేజ
Image Credit : zee telugu

ఇరుముడితో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న రవితేజ

మాస్‌ మహారాజా రవితేజ ఇటీవలే `ఇరుముడి` మూవీతో బాక్సాఫీసు వద్ద దుమ్మురేపింది. ఈ చిత్రం ఏకంగా రూ.250కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. అదే సమయంలో చాలా రోజుల తర్వాత రవితేజకి మంచి విజయాన్ని అందించింది. ఆయన బౌన్స్ బ్యాక్‌ అయ్యేలా చేసింది. వరుసగా ఐదు ఆరు సినిమాలు పరాజయం చెందిన నేపథ్యంలో అనూహ్యంగా `ఇరుముడి` మూవీ సంచలన విజయం సాధించి రవితేజ రేంజ్‌ ఏంటో చూపించింది. అయితే రవితేజ.. చిరంజీవి మాదిరిగానే ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వచ్చారు. ప్రొడక్షన్‌లో అసిస్టెంట్‌ నుంచి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. దర్శకుడు కావాలనుకున్నారు. కానీ నటుడిగా టర్న్ తీసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా స్టార్‌గా ఎదిగిన రవితేజ
Image Credit : Pinterest

ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా స్టార్‌గా ఎదిగిన రవితేజ

చిన్న చిన్న పాత్రలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకున్నారు. పాజిటివ్‌, నెగటివ్‌ క్యారెక్టర్స్ చేసి మెప్పించారు. ఆ తర్వాత `నీ కోసం` సినిమాతో హీరోగా టర్న్ తీసుకున్నారు. ఆ తర్వాత హీరోగా నటిస్తూనే, మెయిన్‌ క్యారెక్టర్స్ చేస్తూ ఆకట్టుకున్నారు. `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం` మూవీతో రవితేజ కెరీర్‌ మారిపోయింది. ఈ మూవీ పెద్ద హిట్‌ కావడంతో ఇక హీరోగా నిలబడిపోయారు. `ఇడియట్‌` తో బిగ్ బ్రేక్‌ అందుకున్నారు. ఒక్కసారిగా స్టార్‌ అయిపోయాడు. ఆ తర్వాత రవితేజ లెక్క వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. తన కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి. హిట్లు పరాజయాలు ఉన్నాయి. పడిన ప్రతిసారి లేచాడు. తనని తాను ప్రూవ్‌ చేసుకుంటూనే ఉన్నాడు.

35
బాలయ్యతో సినిమా చేయని రవితేజ
Image Credit : aha

బాలయ్యతో సినిమా చేయని రవితేజ

రవితేజ కెరీర్‌ ప్రారంభంలో చాలా మంది హీరోలతో కలిసి నటించాడు. నాగార్జున, చిరంజీవి, సుమన్‌, జగపతిబాబు, జేడీ చక్రవర్తి, రాజశేఖర్‌ ఇలా చాలా మంది హీరోల సినిమాల్లో క్యారెక్టర్స్ చేశారు. అలాగే చిరంజీవితో ఇటీవల మల్టీస్టారర్‌ కూడా చేశారు. కానీ బాలయ్యతో మాత్రం సినిమా చేయలేదు రవితేజ. అయితే ఒక సినిమా చేయాల్సింది. కానీ జస్ట్ లో మిస్‌ అయ్యింది. పరుచూరి బ్రదర్స్ కారణంగా రవితేజ ఆ ఆఫర్‌ని కోల్పోయాడు. ఆ వివరాల్లోకి వెళితే.. బాలయ్య హీరోగా విజయశాంతి హీరోయిన్‌గా `నిప్పురవ్వ` చిత్రం రూపొందింది. ఇందులో రాజా రవీంద్ర పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. హీరో చెల్లిని పెళ్లి చేసుకునే పాత్ర. నెగటివ్‌గా ఉంటుంది.

45
బాలయ్య, రవితేజ కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ
Image Credit : aha

బాలయ్య, రవితేజ కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ

సినిమా ప్రారంభం సమయంలో జరిగిన ఆడిషన్‌ లో రవితేజ అటెండ్‌ అయ్యాడు. రాజా రవీంద్ర చేసిన పాత్రకి ఎంపికయ్యాడు. అప్పటికి రాజా రవీంద్ర లేడు. కానీ పరుచూరి బ్రదర్స్ రికమండేషన్‌తో దూరిపోయాడట. దీంతో రవితేజకి ఆఫర్‌ మిస్‌ అయ్యిందట. ఈ విషయాన్ని బాలయ్య నిర్వహించిన అన్‌ స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే షోలో రవితేజ వెల్లడించారు. ఈ వీడియో క్లిప్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది.

55
నిప్పురవ్వ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌
Image Credit : aha

నిప్పురవ్వ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌

నిప్పురవ్వ చిత్రానికి ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. బాలకృష్ణ, విజయశాంతి జంటగా నటించగా, అమ్రీష్‌ పూరి, రావు గోపాలరావు నెగటివ్‌ రోల్స్ చేశారు. 1993లో విడుదలైన ఈ చిత్రం పరాజయం చెందింది. అయితే ఈ మూవీ పోతుందని తనకు ముందే తెలుసు అని బాలయ్య చెప్పడం విశేషం. మొత్తంగా బాలకృష్ణ, రవితేజ కలిసి నటించాల్సిన మూవీ పరుచూరి బ్రదర్స్, రాజారవీంద్ర ల కారణంగా మిస్‌ అయ్యిందని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rakul Preet Singh IT Raid: రకుల్ ప్రీత్ సింగ్, వాసు భగ్నానీ ఇళ్లపై ఐటీ దాడులు.. దృశ్యం 3 నిర్మాణ సంస్థపై కూడా
Recommended image2
Bigg Boss Telugu 10: కట్టలు తెచ్చుకున్న ముఖేష్‌, వర్షిణి రొమాన్స్.. పాపం దేబ్జానీ బకరా అయిపోయిందిగా
Recommended image3
30 కోట్ల రెమ్యునరేషన్, 300 కోట్లకుపైగా ఆస్తులు, 4000 కోట్ల బడ్జెట్ సినిమా చేస్తున్నహీరో?
Related Stories
Recommended image1
Paradise 5 Days Collections: సడెన్‌గా పడిపోయిన ప్యారడైజ్‌ కలెక్షన్లు.. నాని మూవీ హిట్‌ కావాలంటే ఎంత రావాలంటే?
Recommended image2
Uday Kiran: చిరంజీవి అడ్డుపడుతున్నాడంటూ ఉదయ్‌ కిరణ్‌ ఆవేదన.. లవర్‌ బాయ్‌ నిజస్వరూపం బయటపెట్టిన నిర్మాత
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved