MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 10: కట్టలు తెచ్చుకున్న ముఖేష్‌, వర్షిణి రొమాన్స్.. పాపం దేబ్జానీ బకరా అయిపోయిందిగా

Bigg Boss Telugu 10: కట్టలు తెచ్చుకున్న ముఖేష్‌, వర్షిణి రొమాన్స్.. పాపం దేబ్జానీ బకరా అయిపోయిందిగా

Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10లో లవ్‌ ట్రాక్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ముఖేష్‌, వర్షిని సౌందరాజన్‌ మధ్య లేటేస్ట్ రొమాంటిక్‌ వీడియో వైరల్‌ అవుతుంది. రచ్చ రచ్చ చేస్తోంది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 29 2026, 09:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిగ్‌ బాస్‌ తెలుగు 10లో ట్విస్ట్ లు టర్న్ లు
Image Credit : Star Maa

బిగ్‌ బాస్‌ తెలుగు 10లో ట్విస్ట్ లు టర్న్ లు

బిగ్‌ బాస్‌ తెలుగు 10 రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది. మూడు వారాల్లో అనేక ట్విస్ట్ లు, టర్న్ లు చోటు చేసుకున్నాయి. మొదటివారమే ఇద్దరు ఎలిమినేట్‌ అయ్యారు. రెండో వారం మళ్లీ ఒకరు వచ్చారు. మూడో వారం అనూహ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన మిథిలేష్‌ రూ. 15 లక్షల సూట్‌కేసు తీసుకొని ఎలిమినేట్‌ అయ్యారు. ఇది మరింత క్రేజీ అని చెప్పొచ్చు. ఇక హౌజ్‌లో టాస్క్ లు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అయితే ఇందులో కంటెస్టెంట్ల రొమాన్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బిగ్‌ బాస్‌ హౌజ్‌లో అదిరిపోయే లవ్‌ ట్రాక్‌
Image Credit : Asianet News

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో అదిరిపోయే లవ్‌ ట్రాక్‌

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో లవ్‌ పెయిర్స్ కావడం సర్వసాధారణమే. గత సీజన్‌లో డీమాన్‌ పవన్‌, రీతూ చౌదరీ జోడీ కట్టారు. అలాగే కళ్యాణ్‌ పడాల, తనూజ మధ్య కూడా కొంత ట్రాక్‌ నడిచింది. అంతకు ముందు చాలా సీజన్లలో ఇలాంటి ట్రాక్‌లు నడిచాయి. ఆకట్టుకున్నాయి. ఇప్పుడు నడుస్తున్న ట్రాక్‌ షాకిచ్చేలా ఉంది. రొమాన్స్ పీక్‌ అనేలా ఉంది. పదులు సంఖ్యలో కెమెరాలు ఉన్నా కూడా కంటెస్టెంట్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ముఖేష్‌, వర్షిణి మధ్య ట్రాక్‌ అలానే అనిపిస్తుంది. వీరిద్దరు ఒక టాస్క్ లో భాగంగా బిగ్‌ బాస్‌ ఇచ్చిన ఆయుధాలను దొంగిలించి దాచుకోవాల్సి ఉంటుంది. అందుకోసం రెండు టీములుగా విడిపోయారు.

35
ముఖేష్‌, వర్షిణి రొమాన్స్ పీక్‌
Image Credit : Asianet News

ముఖేష్‌, వర్షిణి రొమాన్స్ పీక్‌

అందులో భాగంగా వర్షిణి ఆయుధాలు దాచుకుందని చెప్పి ఆమెని పట్టుకున్నాడు ముఖేష్‌. అయితే వీరిద్దరు మధ్య లవ్ ట్రాక్‌ స్టార్ట్ అయి చాలా రోజులే అవుతుంది. ఇప్పుడు ఈ ఆయుధాలను దొంగిలించే టాస్క్ లో మాత్రం తమ మధ్య బాండింగ్‌ ఏ రేంజ్‌కి వెళ్లిందో చూపించారు. వర్షిణిని వెనకాల నుంచి హగ్‌ చేసుకొని ఆమెని గట్టిగా పట్టుకున్నాడు ముఖేష్‌. అయితే ముఖేష్‌ని హగ్‌ని ఆమె కూడా పాజిటివ్‌గానే తీసుకుంది, ఆయనకు రియాక్ట్ అయిన తీరు చూస్తుంటే వీరిద్దరి మధ్య రొమాన్స్ చాలా దూరం వెళ్తుందనిపిస్తుంది. చివర్లో ముఖేష్‌ గట్టిగా హగ్‌ చేసుకొని వదిలేశాడు. ఇద్దరు గుసగుసలు పెట్టుకున్నారు.

45
ముఖేష్‌, వర్షిణి రొమాన్స్ పై ట్రోల్స్, మీమ్స్
Image Credit : Asianet News

ముఖేష్‌, వర్షిణి రొమాన్స్ పై ట్రోల్స్, మీమ్స్

అంతేకాదు పలు సందర్భాల్లోనూ ఈ ఇద్దరు క్లోజ్‌గా మూవ్‌ అయ్యారు. గార్డెన్‌లో కలిసి పడుకున్నారు. వర్షం పడుతుంటే గొడుగు పట్టుకొని డ్యూయెట్లు పాడుకున్నారు. వర్షిణి ఒళ్లో ముఖేష్‌ పడుకున్నాడు. ఇలాంటివి చాలానే ఉన్నాయి. రియల్ లవ్‌ ట్రాక్‌ని తలపించేలా ఈ ఇద్దరి మధ్య రొమాన్స్ ఉండటం విశేషం. ఈ వీడియో క్లిప్‌లను కట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి బిగ్‌బాస్‌ లవర్స్ రచ్చ చేస్తున్నారు. మిగిలిన వాళ్లేమో టాస్క్ కోసం కొట్టాడుకుంటుంటే, వీరిద్దరేమో రొమాన్స్ చేసుకుంటున్నారని పోస్ట్ లు పెడుతున్నారు. మరికొందరేమో.. ఇలా తెగించారేంటి? అని, వామ్మో ఇది పీక్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా రొమాన్స్ తో ముఖేష్‌, వర్షిణి ఇప్పుడు వార్తల్లో నిలిచారు. వీరి కంటెంట్‌ వైరల్‌గా మారింది.

55
దేబ్జానీ బకరా అయ్యిందా?
Image Credit : Asianet News

దేబ్జానీ బకరా అయ్యిందా?

ఇదిలా ఉంటే ఈ విషయంలో దేబ్జానీ బకరా అయ్యింది. ఆమె మొదట్నుంచి ముఖేష్‌తో ట్రాక్ నడిపిద్దామని ప్లాన్‌ చేసింది. తనకు ముఖేష్‌ అంటే ఇష్టమని చెప్పింది. ఆ ఇష్టాన్ని చెబుదామనుకుంటే, వాడు రావడం లేదని, అటు వైపు పులిహోర కలుపుతున్నాడు, ఇటు వైపు పులిహోర కలుపుతున్నాడని, నా వద్దకు మాత్రం రావడం లేదని నాగార్జున ముందే చెప్పాడు. అంతేకాదు ముఖేష్‌.. వర్షిణితో కలిసి స్విమ్మింగ్‌ ఫూల్‌లో స్విమ్‌ చేసినప్పుడు కూడా తన ఆవేదన వ్యక్తం చేసింది. ముఖేష్‌ తనకు అన్యాయం చేస్తున్నాడని వెల్లడించింది. అయినా ఆమెని పట్టించుకోలేదు ముఖేష్‌. వర్షిణితోనే పులిహోర కలుపుతున్నాడు. ఇప్పుడు అది వేరే స్థాయికి వెళ్లినట్టు తాజా కంటెంట్‌ చూస్తుంటే తెలుస్తోంది. మరి ఈ ట్రాక్ ఎటు వెళ్తుందో చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
30 కోట్ల రెమ్యునరేషన్, 300 కోట్లకుపైగా ఆస్తులు, 4000 కోట్ల బడ్జెట్ సినిమా చేస్తున్నహీరో?
Recommended image2
Paradise 5 Days Collections: సడెన్‌గా పడిపోయిన ప్యారడైజ్‌ కలెక్షన్లు.. నాని మూవీ హిట్‌ కావాలంటే ఎంత రావాలంటే?
Recommended image3
Netflix: ఓటీటీలో చిరంజీవి సంచలన పాడ్ కాస్ట్, ఇది కూతురి ప్లాన్.. సినిమాలు, రాజకీయాల్లో తెరవెనుక ఏం జరిగింది
Related Stories
Recommended image1
Paradise 5 Days Collections: సడెన్‌గా పడిపోయిన ప్యారడైజ్‌ కలెక్షన్లు.. నాని మూవీ హిట్‌ కావాలంటే ఎంత రావాలంటే?
Recommended image2
Uday Kiran: చిరంజీవి అడ్డుపడుతున్నాడంటూ ఉదయ్‌ కిరణ్‌ ఆవేదన.. లవర్‌ బాయ్‌ నిజస్వరూపం బయటపెట్టిన నిర్మాత
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved