అమెరికాలో బాలకృష్ణ అరుదైన రికార్డు, వరుసగా ఐదోసారి చరిత్ర సృష్టించిన బాలయ్య బాబు..
65 ఏళ్ల వయసులో బాలయ్య బాబు రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్ సిస్ లో కూడా బాలయ్య మ్యానియా మూమూలుగా వర్కౌట్ అవ్వడంలేదు. రీసెంట్ గా అమెరికాలో.. ఐదోసారి అద్భుతం చేశాడు నందమూరి నటసింహం. ఇంతకీ విషయం ఏంటంటే?

65 ఏళ్ల వయసులో దూసుకుపోతున్న బాలయ్య..
నందమూరి నటసింహం బాలకృష్ణ మామూలోడు కాదు. రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ.. ఇతర హీరోలకు నిద్రలేకుండా చేస్తున్నాడు. డబుల్ హ్యాట్రిక్ కు దగ్గరగా ఉన్న బాలయ్య.. కుర్ర హీరోలకు కునుకులేకుండా చేస్తున్నాడు. బాక్సాపీస్ దుమ్ము దులిపేస్తున్న ఈ హీరో.. ఓవర్సిస్ మార్కెట్ ను కూడా గట్టిగా టార్గెట్ చేశాడు. బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏమిటో నిరూపించారు. ఓవర్సీస్ మార్కెట్‌లో, అది కూడా నార్త్ అమెరికాలో ఆయనకు ఉన్నపట్టు ఎంత బలమైనదో మరోసారి తెలిసేలా చేశాడు బాలకృష్ణ. రీసెంట్ గా రిలీజ్ అయిన అఖండ2 సినిమాతో ఐదో సారి ఆయన చేసిన అద్భుతం ఏంటో తెలుసా?
అఖండ 2 వసూళ్లు..
బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన తాజా సినిమా అఖండ 2 తాండవం. ఈసినిమాకు గత సినిమాల మాదిరి పెద్దగా స్పందన రాలేదు. మిశ్రమ స్పందనను దక్కించుకున్న ఈసినిమా.. వసూళ్ల విషయంలో మాత్రం జోరు చూపించింది. ఈ విషయంలో బాలయ్య ఏమాత్రం తగ్గలేదు. బాక్సాఫీస్ దగ్గర సైలెంట్ గా దూసుకెళ్లిపోతోంది అఖండ2 సినిమా. ఈ సినిమా తాజాగా యునైటెడ్ స్టేట్స్‌లో 1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్ల మార్క్‌ను దాటేసింది. దీంతో నార్త్ అమెరికా మార్కెట్‌లో బాలకృష్ణ పవర్ ఏంటో మరోసారి రుజువయ్యింది.
ఓవర్సీస్ లో బాలయ్య అరుదైన రికార్డు..
అఖండ2 సినిమా రిజెల్ట్ ఎలా ఉన్నా, ఆయన సినిమాలకు ఓవర్సీస్‌లో ఉండే ఆదరణ మాత్రం అలానే కొనసాగుతూనే ఉండటం.. అభిమానులను సంతోషపెడుతోంది. అంతే కాదు ఈ సక్సెస్ తో బాలయ్య మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. వరుసగా 5 సినిమాలతో నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్ల గ్రాస్‌ను అందుకున్న ఏకైక సీనియర్ హీరోగా బాలయ్య నిలిచారు. ఇంతకు ముందు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ లాంటి సినిమాలు వరుసగా ఈ ఘనతను సాధించాయి. ఇక తాజాగా అఖండ2 కూడా ఈ లిస్ట్ లో చేరిపోయింది.
టాలీవుడ్ చరిత్రలో మొదటిసారి
టాలీవుడ్ చరిత్రలో ఒక సీనియర్ హీరో ఈ స్థాయిలో వరుస విజయాలు అందుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అంతే కాదు నార్త్ అమెరికాలో మొత్తంగా ఆరు 1 మిలియన్ డాలర్ల గ్రాస్ సినిమాలు కలిగిన ఏకైక సీనియర్ హీరోగా కూడా బాలకృష్ణ రికార్డు క్రియేట్ చేశారు. ఆయన గతంలో నటించిన చారిత్రాత్మక చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి కూడా యూఎస్ మార్కెట్‌లో మిలియన్ డాలర్ మార్క్‌ను అందుకుంది. కానీ ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మిశ్రమ స్పందన సాధించింది.
డబుల్ హ్యాట్రిక్ దిశగా బాలయ్య..
సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా, అభిమానుల అండతో బాక్సాఫీస్ వద్ద తన మార్కెట్ పవర్‌ను బాలకృష్ణ మరోసారి నిరూపించాడు. ప్రస్తుతం బాలకృష్ణ దర్శకుడు గోపిచంద్ మలినేనితో ‘ఎన్బీకే 111’ లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కొనసాగుతుండగా, వచ్చే ఏడాది ఈసినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి టీమ్ ప్రయత్నిస్తోంది. ఇక ఈసినిమాలో నయనతార హీరోయిన్ గా నటించబోతున్నట్టు సమాచారం. బాలయ్యతో గతంలో మూడు సినిమాల్లోజంటగా కనిపించింది నయన్. ఈ సినిమా హిట్ అయితే.. బాలకృష్ణ ఖాతాలో డబుల్ హ్యాట్రిక్ హిట్ పడినట్టు అవుతుంది.

