MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్ అభిమానులకు అల్లు శిరీష్ సర్‌ప్రైజ్‌, పెళ్లి డేట్ ను అనౌన్స్ చేసిన యంగ్ హీరో, స్పెషల్ ఏంటంటే?

అల్లు అర్జున్ అభిమానులకు అల్లు శిరీష్ సర్‌ప్రైజ్‌, పెళ్లి డేట్ ను అనౌన్స్ చేసిన యంగ్ హీరో, స్పెషల్ ఏంటంటే?

రీసెంట్ గా నయనికాతో నిశ్చితార్థం చేసుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్. పెళ్లి డేట్ పై తాజాగా ఓ ప్రకటన కూడా చేశాడు. కానీ అందులో ఎంత పెద్ద ట్విస్ట్ ఉందో తెలుసా? అల్లు అర్జున్ అభిమానులకు సర్‌ప్రైజ్‌ కూడా ఉంది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 29 2025, 04:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అల్లు వారింట పెళ్లి బాజాలు..
Image Credit : instagram

అల్లు వారింట పెళ్లి బాజాలు..

టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ ఓ సర్‌ప్రైజ్‌ న్యూస్ ను వెల్లడించాడు. తన వ్యక్తిగత జీవితంలో అతి ముఖ్యమైన పెళ్లి తేదీకి సంబంధించిన శుభవార్తను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. రీసెంట్ గా అక్టోబర్ 31న నయనికతో నిశ్చితార్థం చేసుకున్న అల్లు శిరీష్... 2026 మార్చి6 న తాము వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఈ విషయాన్ని అల్లు శిరీష్ సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా వెల్లడించారు. అంతే కాదు ఈ డేట్ అనౌన్స్ మెంట్ తో అల్లు అర్జున్ అభిమానులకు సర్‌ప్రైజ్‌ కూడా ఇచ్చాడు శిరీష్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అన్నపెళ్లి రోజే.. తమ్ముడి పెళ్లి కూడా..
Image Credit : facebook.com/AlluSirish

అన్నపెళ్లి రోజే.. తమ్ముడి పెళ్లి కూడా..

అల్లు శిరీష్ సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేస్తూ తన పెళ్లి శుభవార్తను ప్రకటించారు. ఆ వీడియోలో పెళ్లి తేదీతో పాటు కుటుంబానికి సంబంధించిన ప్రత్యేకమైన అనుబంధాన్ని కూడా ప్రస్తావించారు. అల్లు శిరీష్ తన అన్న.. పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ పెళ్లి రోజునే.. తాను కూడా వివాహం చేసుకోబోతున్నాడు. 2011 మార్చి 6వ తేదీన అల్లు అర్జున్ తాను ప్రేమించిన స్నేహారెడ్డిని పెళ్లాడగా.. 2026 మార్చి 6న అల్లు శిరీష్.. తాను ప్రేమించిన నయనికాను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయం తెలిసి అల్లు అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

35
అల్లు శిరీష్ - నయనిక ప్రేమ ఎప్పుడు మొదలయ్యింది..
Image Credit : instagram

అల్లు శిరీష్ - నయనిక ప్రేమ ఎప్పుడు మొదలయ్యింది..

అల్లు శిరీష్, నయనిక 2023లో ప్రేమలో పడ్డారు. వారి మధ్య స్నేహం మొదలై.. అది ప్రేమగా మారింది. అప్పటి నుంచి డేటింగ్ చేస్తూ వచ్చిన ఈ జంట.. పెద్దలను ఒప్పించి పెళ్లి వరకు వచ్చారు. అల్లు శిరీష్ తమ ఎంగేజ్మెంట్ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ, “నా జీవితంలోని ప్రేమతో నేను ఆనందంగా నిశ్చితార్థం చేసుకున్నాను” అని క్యాప్షన్ రాశారు. ఆ పోస్టుకు అభిమానుల నుంచి, సినీ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

45
అల్లు శిరీష్ కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
Image Credit : Asianet News

అల్లు శిరీష్ కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

ఇక అల్లు శిరీష్ ను పెళ్లాడనున్న నైనికా ఎవరు? ఆమె ఏం చేస్తుంది? ఎంత సంపాదిస్తుంది అన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది. మెగా, అల్లు అభిమానులు ఈ విషయం తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో అందుబాటులో ఉన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం, నయనికా హైదరాబాదులో పుట్టి పెరిగింది. ఆమె తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. వాటితో పాటు ఇతర వ్యాపారాల్లో కూడా నయనిక ఫ్యామిలీ రాణిస్తున్నట్టు సమాచారం. ఇక నైనిక కూడా బెంగళూర్ లో రెండు ఐటీ కంపెనీలు నడుపుతున్నట్టు తెలుస్తోంది. ఆమె ఆదాయం నెలకు కోట్లలో ఉంటుందని సమాచారం.

55
అల్లు శిరీష్ ఫిల్మ్ కెరీర్..
Image Credit : Instagram/allu sirish

అల్లు శిరీష్ ఫిల్మ్ కెరీర్..

అల్లు శిరీష్ ఫిల్మ్ కెరీర్ విషయానికి వస్తే.. టాలీవుడ్ లో ఆయన కెరీర్ అంత సక్సెస్ ఫుల్ గా కొనసాగలేదు. అల్లు శిరీష్ గౌరవం, కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు..వంటి సినిమాలతో నటుడిగా గుర్తింపు పొందారు. విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించిన ఆయన, ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నాడు. శిరీష్ సినిమా చేసి చాలా కాలం అవుతోంది. మరి ఆయన ఇదే రంగంలో కొనసాగుతాడా..? లేక వ్యాపారంలోకి దిగుతాడా అనేది చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Shooting Deaths: షూటింగ్ స్పాట్‌లోనే ప్రాణాలు వదిలారు! కెమెరా ముందు జరిగిన 8 విషాదాలు
Recommended image2
Ajay Ghosh: సుకుమార్ పుణ్యమా అని అజయ్ ఘోష్ ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా? ఇద్దరు కొడుకులు ఏం చేస్తున్నారంటే?
Recommended image3
Radhika Apte: షర్ట్ బటన్స్ విప్పమన్నారు, లోదుస్తులతో ఫైట్ చేయమన్నారు.. రాధికా ఆప్టే షాకింగ్ కామెంట్స్!
Related Stories
Recommended image1
రోజా ఎత్తుకుని ఆడించిన పాన్ ఇండియా స్టార్ హీరో ఎవరో తెలుసా? షాక్ అవుతారు
Recommended image2
ప్రభాస్ గిఫ్ట్ గా ఇచ్చిన చీరను.. మూడేళ్లు దాచుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved