లీకైన అరియనా బిగ్ బాస్ రెమ్యూనరేషన్... పాపం చాలా చీప్ గా వాడేశారుగా!
First Published Dec 30, 2020, 10:21 PM IST
గత మూడు సీజన్స్ తో పోల్చుకుంటే బిగ్ బాస్ సీజన్ 4 చాలా ప్రత్యేకం. కారణం ఏదైనా ఈసారి హౌస్ లోకి ప్రవేశించిన వారిలో చాలా మందివి కొత్త మొహాలే. హౌస్ లోకి వెళ్లిన తరువాత వాళ్ళ నేపథ్యం ఏమిటో బయటికి రావడం జరిగింది. అలా ఈ సీజన్ కి ఫేమస్ అయినవారిలో అరియనా ఒకరు.

అరియనా యాంకర్ అన్న విషయం తెలిసింది చాలా తక్కువ మందికే... యూట్యూబ్ ప్రేక్షకులకు ఆమె ఐడియా ఉన్నప్పటికీ బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఎటువంటి అంచనాలు లేకుండా హౌస్ లోకి ప్రవేశించిన అరియానా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఎదిగారు.

హౌస్ లో సోహైల్ తో గొడవలు ఈమెపై కొంత ప్రతికూల ప్రభావము చూపాయి. అవినాష్ తో అరియనా రిలేషన్ హైలైట్ అయ్యింది. అవినాష్ ఎలిమినేషన్ తరువాత అరియనా ఒంటరిగా ఫీలై ఆటమీద ఫోకస్ పెట్టలేకపోయింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?