Anushka Shetty : ప్రభాస్ చేతిలో అనుష్క శెట్టి సినిమా.. ఆ పరిధి దాటని స్వీటీ?
టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి Anushka Shetty కొత్త సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. ప్రభాస్ చేతిలో ఆసినిమా ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డిటేయిల్స్ ఇలా ఉన్నాయి.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా అనుష్క శెట్టి కొన్నేళ్లపాటు వెలుగొందారు. స్టార్స్ సరసన నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. గట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకున్నారు.
తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను కూడా పోషించారు. అలాగే ప్రతిష్టాత్మకమైన చిత్రాల్లోనూ నటించి హౌరా అనిపించారు. ‘అరుంధతి’, ‘విక్రమార్కుడు’, ‘బిల్లా’, ‘కింగ్’, ‘మిర్చి’, ‘బాహుబలి’, ‘బహుబలి : ది కన్క్లూషన్’ వంటి చిత్రాలతో చెరగని ముద్ర వేసుకుంది.
Anushka Shetty
Prabhas ప్రభాస్ తో నటించిన Baahubali ‘బాహుబలి’ తర్వాత మాత్రం అనుష్క శెట్టి సినిమాల జోరును తగ్గించింది. కారణం ఏంటో తెలియదు కానీ పెద్దగా వెండితెరపై మెరియలేదు. ఇక చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తోంది.
చివరిగా యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంలో నటించారు అనుష్క. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో గతేడాది మళ్లీ తెలుగు ఫ్యాన్స్, ఆడియెన్స్ ను పలకరించింది. ఇప్పుడు తెలుగులో మరో సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తోంది.
ప్రభాస్ హోమ్ ప్రొడక్షన్ యూవీ క్రియేషన్ లో అనుష్క కొత్త సినిమా రూపుదిద్దుకోబోతున్నదని అంటున్నారు. క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహించనన్నారని టాక్. త్వరలో చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు.
Anushka Shetty
ఇక అనుష్క నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత తెలుగులో ప్రభాస్ బ్యానర్ లోనే నటిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇక మలయాళంలో ‘కథనార్’ చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ ముగిసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.