గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో `ప్రేమమ్` బ్యూటీ అనుపమా పరమేశ్వరన్
First Published Dec 10, 2020, 7:20 PM IST
`ప్రేమమ్` బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొంది. అందులో భాగంగా మొక్కలు నాటింది. బాచుపల్లిలో మొక్కలు నాటి ఆయా ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది అనుపమ.

మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన అనుపమా పరమేశ్వరన్ `అ..ఆ` చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. అందులో నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో మెరిసింది.

ఆ తర్వాత `శతమానం భవతి`, `ప్రేమమ్`, `ఉన్నది ఒక్కటే జిందగీ`, `రాక్షసుడు` చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ ల్లో భాగమైన ఈ బ్యూటీ తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొంది. రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు బాచుపల్లి లో మొక్కలు నాటింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?