MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Savitri: జెమినీ గణేశన్ ఉండగానే సావిత్రి పక్కన కూర్చున్న ఏఎన్నార్, అన్నపూర్ణమ్మ చూసి ఏమన్నారంటే?

Savitri: జెమినీ గణేశన్ ఉండగానే సావిత్రి పక్కన కూర్చున్న ఏఎన్నార్, అన్నపూర్ణమ్మ చూసి ఏమన్నారంటే?

Savitri: మహానటి సావిత్రితో ఎక్కువ సినిమాల్లో నటించారు ఏఎన్నార్. హీరోయిన్లతో బాగా చనువుగా ఉంటారన్న పేరు ఆయనకు ఉంది. ఓ సారి గణేశన్ ఉండగానే సావిత్రి పక్కన ఏఎన్నార్ కూర్చోవడం.. ఆయన భార్య అన్నపూర్ణమ్మకు నచ్చలేదట.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 26 2026, 08:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తెలుగు సినిమా మొదటి రొమాంటిక్ హీరో..
Image Credit : Asianet News

తెలుగు సినిమా మొదటి రొమాంటిక్ హీరో..

అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాకు తొలి తరం హీరో మాత్రమే కాదు.. ఫస్ట్ రొమాంటిక్ ఇమేజ్ ఉన్న హీరో కూడా. హీరోయిన్లతో ఆయన చాలా చనువుగా ఉండేవారు. హీరోయిన్లు కూడా ఏఎన్నార్‌తో సినిమా అంటే ఎగిరిగంతేసేవారు. చాలామంది హీరోయిన్లతో ఏఎన్నార్‌కు ఎఫైర్ ఉందంటూ.. రూమర్లు కూడా షికారు చేస్తుండేవి. అక్కినేని నాగేశ్వరరావు చాలామంది హీరోయిన్లకు లైఫ్ ఇచ్చారు. తన కెరీర్ మొత్తంలో దాదాపు 80 మంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు అక్కినేని. అందులో సావిత్రితో ఏఎన్నార్ ఎక్కువ సినిమాల్లో నటించి మెప్పించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సావిత్రితో ఏఎన్నార్ హిట్ కాంబినేషన్..
Image Credit : x/indian cinema

సావిత్రితో ఏఎన్నార్ హిట్ కాంబినేషన్..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు (ANR), మహానటి సావిత్రిల కాంబినేషన్ ఒక స్వర్ణయుగం. వీరిద్దరి కలయికలో వచ్చిన 'దేవదాసు', 'మిస్సమ్మ', 'మాయాబజార్' వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. తెరపై వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ చూసి ఆ రోజుల్లో ప్రేక్షకులు మురిసిపోయేవారు. అయితే వెండితెర వెనుక వీరి నటన, వ్యక్తిగత జీవితం మరియు కుటుంబ సభ్యుల అనుబంధం గురించి ANR పెద్ద కుమారుడు అక్కినేని వెంకట్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

34
సావిత్రి పక్కన కూర్చున్న ఏఎన్నార్..
Image Credit : Asianet News

సావిత్రి పక్కన కూర్చున్న ఏఎన్నార్..

అక్కినేని వెంకట్ తన తల్లి అన్నపూర్ణమ్మ, తండ్రి ANRల మధ్య ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ ఒక సరదా జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు. ఒకరోజు షూటింగ్ కోసం సావిత్రి తన భర్త జెమినీ గణేషన్‌తో పాటు వచ్చింది. ఇద్దరూ కలిసి ఏఎన్నార్‌ను తీసుకెళ్లడానికి ఇంటికి వచ్చారు. జెమినీ గణేషన్ డ్రైవ్ చేస్తున్నాడు... సావిత్రి పక్కన కూర్చుంది. అయితే ఏఎన్నార్ వెనక సీట్లో కూర్చోకుండా.. ముందు సీట్లో సావిత్రి పక్కన కూర్చున్నారు.

44
చాటు నుంచి చూసిన అన్నపూర్ణమ్మ..
Image Credit : Asianet News

చాటు నుంచి చూసిన అన్నపూర్ణమ్మ..

వెనక సీటు ఖాళీగా ఉన్నా కూడా.. ఏఎన్నార్ సావిత్రి పక్కన కూర్చోవడం.. పైన కర్టెన్ చాటు నుంచి అన్నపూర్ణమ్మ చూశారు. ఆమెకు ఇది విచిత్రంగా అనిపించింది. వెనుక సీటు ఖాళీగా ఉంది కదా.. ముందు అలా కూర్చోవడం ఎందుకు అని ఆమె అనుకున్నారట. అంతకు మించి నాకు ఇంకా ఏమీ తెలియదు.. అని వెంకట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సంఘటనను గుర్తుచేసుకుంటూ అక్కినేని వెంకట్, నాటి తరం దంపతుల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమ, నమ్మకం, గౌరవం ఎలాంటివో వివరించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సావిత్రి (నటి)
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas: ప్రభాస్ ముఖం మీదే అడిగేసి కళ్ళు తెరిపించిన కమెడియన్, మనసులో దాచుకుని మదనపడడం ఎందుకు
Recommended image2
Bigg Boss Telugu 10: సృష్టి, అమన్ ని పీకి పడేసిన అపూర్వ, మిథిలేష్.. రాగానే రచ్చ లేపారుగా
Recommended image3
Divya Bharathi: ఇండస్ట్రీలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే.. అసలు నిజం చెప్పిన హీరోయిన్!
Related Stories
Recommended image1
Rama Prabha: ప్రతి నెలా 25 వేలు అకౌంట్ లో వేస్తాడు, కానీ ఫోన్ మాత్రం ఎత్తడు, రమాప్రభకు సహాయం చేస్తున్న డైరెక్టర్ ఎవరు?
Recommended image2
ANR: ఏఎన్నార్ తొలి సంపాదన ఎంతో తెలుసా? దాంతో ఏం చేశారు? అక్కినేని వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved