- Home
- Entertainment
- Bigg Boss Telugu 10: సృష్టి, అమన్ ని పీకి పడేసిన అపూర్వ, మిథిలేష్.. రాగానే రచ్చ లేపారుగా
Bigg Boss Telugu 10: సృష్టి, అమన్ ని పీకి పడేసిన అపూర్వ, మిథిలేష్.. రాగానే రచ్చ లేపారుగా
బిగ్ బాస్ తెలుగు 10లో అపూర్వ, మిథిలేష్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. రాగానే హౌస్ లో వీళ్ళు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వీళ్ళ రాకతో సృష్టి, అమన్ లకు చుక్కలు కనిపించాయి.

బిగ్ బాస్ తెలుగు 10
బిగ్ బాస్ తెలుగు 10లో శుక్రవారం రోజు కొత్త సభ్యులు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. అగ్ని పరీక్షలో పాల్గొన్న అపూర్వ, మిథిలేష్ కి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం దక్కింది. అయితే వాళ్ళ ఎంట్రీ నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. అపూర్వ, మిథిలేష్, రామకృష్ణ లలో ఎవరు ఎంట్రీ ఇవ్వాలి అని డిసైడ్ చేసేందుకు ఇంటి సభ్యులు ఓటింగ్ చేశారు.
ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్
కానీ ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని కాకుండా తక్కువ ఓట్లు వచ్చిన అపూర్వకి అవకాశం ఇస్తున్నట్లు బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చారు. దీనితో అపూర్వ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక మిగిలిన మిథిలేష్, రామకృష్ణ లకు సమానమైన ఓట్లు వచ్చాయి అని బిగ్ బాస్ వారిద్దరి మధ్య గేమ్ పెట్టారు. ఆ పోటీలో మిథిలేష్ విజయం సాధించి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అర్హత సాధించాడు. ఆ విధంగా అపూర్వ, మిథిలేష్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
నా అంత గలీజ్ గాడు లేడు
అంతకు ముందు హౌస్ లో క్లీనింగ్ విషయంలో పెద్ద రచ్చ జరిగింది. హౌస్ శుభ్రంగా లేదని త్రిగుణ్ అమన్ కి చెప్పాడు. క్లీనింగ్ బాధ్యత అమన్ ది. కానీ నువ్వు నాకు ఎందుకు చెబుతావ్. నన్ను కెలికాప్. నా అంత గలీజ్ గాడు లేడు. నేనెంటో చూపిస్తా అని అమన్ రెచ్చిపోయాడు. వీళ్ళ గొడవలోకి రోహిత్, షాలిని కూడా దూరి హంగామా చేశారు.
అమన్, సృష్టి లని పీకేశారుగా
ఆ తర్వాత బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ప్రస్తుతం కెప్టెన్సీ కంటెండర్స్ గా ఉన్న వారిలో ఇద్దరిని తొలగించే అధికారం మిథిలేష్, అపూర్వకి ఇస్తున్నట్లు బిగ్ బాస్ తెలిపారు. తద్వారా మిగిలిన కంటెండర్స్ కి పెయిర్ గా గేమ్ ఆడి ఇమ్యూనిటీ పొందే అవకాశం దక్కుతుంది అని బిగ్ బాస్ తెలిపారు. అపూర్వ, మిథిలేష్ చర్చించుకుని సృష్టి, అమన్ లని తొలగించాలి అని డిసైడ్ అయ్యారు. ముందుగా సృష్టిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. దానికి కారణం చెబుతూ.. సృష్టి కంట్రోల్ తప్పుతుంది. ఆమెకి కోపం వస్తే ఎలా బిహేవ్ చేస్తోందో ఎవరికీ తెలియదు. అలాంటి వ్యక్తి కెప్టెన్ కావడానికి వీల్లేదు అని చెప్పారు.
కొత్త కెప్టెన్ ముకేశ్
సుధీర్ ని ఆమె కొట్టడానికి వెళ్ళింది. సుధీర్ నాకు ఫ్రీడమ్ వచ్చింది అని చెప్పినప్పుడు అంతా సృష్టికి సపోర్ట్ చేశారు కానీ ఒక్కరు కూడా సుధీర్ కి సపోర్ట్ చేయలేదు. ఫ్రీడమ్ వచ్చింది అని అనడంలో తప్పేముంది. గేమ్ ఆడడంలో ఫ్రీడమ్ వచ్చింది అని సుధీర్ ఉద్దేశం కావచ్చు. అంటూ అపూర్వ, మిథిలేష్ సుధీర్ కి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత అమన్ పేరు చెబుతూ హౌస్ లో తను అంత అటెంటివ్ గా లేడు అని చెప్పారు. ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ లో ముకేశ్ కి జోడిగా అపూర్వ.. ఝాన్సీకి జోడీగా మిథిలేష్ పాల్గొన్నారు. కానీ టాస్క్ లో ముకేశ్, అపూర్వ జంట విజయం సాధించారు. ముకేశ్ కి కెప్టెన్ గా అవకాశం దక్కింది. అపూర్వకి అతడితో సమానంగా ఇమ్యూనిటీ లభించింది. ఝాన్సీ కెప్టెన్సీ బ్యాండ్ ని ముకేశ్ కి తొడిగి అతడిని కొత్త కెప్టెన్ చేసింది.

