- Home
- Entertainment
- Prabhas: ప్రభాస్ ముఖం మీదే అడిగేసి కళ్ళు తెరిపించిన కమెడియన్, మనసులో దాచుకుని మదనపడడం ఎందుకు
Prabhas: ప్రభాస్ ముఖం మీదే అడిగేసి కళ్ళు తెరిపించిన కమెడియన్, మనసులో దాచుకుని మదనపడడం ఎందుకు
ప్రభాస్ నటించిన ఓ మూవీలో సన్నివేశం కమెడియన్ కి నచ్చలేదు. వెంటనే ప్రభాస్ ముఖం మీదే ఆ కమెడియన్ అడిగేశారట. కమెడియన్ ఇచ్చిన ఆ సలహా చాలా విలువైనదిగా భావించిన ప్రభాస్ ఏం చేశారో తెలుసా ?

Prabhas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ బిగినింగ్ లో ప్రేమ కథా చిత్రాలు చేశారు. ప్రభాస్ ఫిల్మోగ్రఫీలో వర్షం, డార్లింగ్ లాంటి అందమైన లవ్ స్టోరీలు ఉన్నాయి. డార్లింగ్ సినిమా ఒక అందమైన పెయింటింగ్ లా ఉంటుంది. ప్రేమ కథా చిత్రాల్లో ఇది కల్ట్ మూవీగా నిలిచిపోయింది.
ప్రభాస్ డార్లింగ్ మూవీ
కరుణాకరన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ మూవీలో క్యూట్ లవ్ సీన్స్ తో పాటు ప్రభాస్ తన గ్యాంగ్ తో చేసే అల్లరి, కామెడీ, తండ్రి సెంటిమెంట్ చూడ ముచ్చటగా ఉంటాయి. ఈ సినిమాకి స్విట్జర్ల్యాండ్ ఎపిసోడ్ హైలైట్ అనే చెప్పాలి. కానీ ఇంటర్వెల్ సీన్ లో ప్రభాస్ ఒక్కసారిగా స్విట్జర్లాండ్ ఎపిసోడ్ మొత్తం అబద్దం అని రివీల్ చేస్తాడు.
ఆడియన్స్ కి స్వీట్ షాక్
ఆడియన్స్ కి స్వీట్ షాక్ లా ఆ రివీల్ ఉంటుంది. ఈ మూవీలో ప్రభాస్ ఫ్రెండ్ గా కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి నటించారు. అప్పటి వరకు జరిగిన స్టోరీ మొత్తం అబద్దం అని చెప్పడం శ్రీనివాస్ రెడ్డికి నచ్చలేదట. నచ్చని విషయాన్ని లోపల దాచుకుని మదనపడే కంటే ఒకసారి క్లారిటీ తీసుకుంటే బెటర్ అని శ్రీనివాస్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
ప్రేక్షకులని ఫూల్స్ చేయడం కరెక్టా
షూటింగ్ టైంలో ప్రభాస్ ని వెళ్లి అడిగా.. స్విట్జర్లాండ్ ఎపిసోడ్ మొత్తం అబద్దం అని చెబితే అది ఆడియన్స్ ఫూల్స్ ని చేసినట్లే కదా. అంటే ఇప్పటి వరకు మీరు చూసింది నిజం కాదు అని ఇంటర్వెల్ లో ప్రేక్షకులకు చెబుతున్నారు. ఇది బ్యాక్ ఫైర్ అవుతుందేమో అని శ్రీనివాస్ రెడ్డి ప్రభాస్ ని అడిగారట.
చిన్న మార్పు చేసిన ప్రభాస్
శ్రీనివాస్ రెడ్డి చెప్పిన మాటలతో ప్రభాస్ కూడా కన్విన్స్ అయ్యాడు. డైరెక్టర్ కరుణాకరన్ కి చెబితే.. అప్పటి కప్పుడు అక్కడ చిన్న ఎమోషనల్ డైలాగ్ చేర్చారు. 'అరె అప్పటి కప్పుడు కథ ఏమి అల్లేశావ్ రా' అని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దీనికి ప్రభాస్ బదులిస్తూ 'అల్లడం కాదురా చిన్నప్పటి నుంచి నందిని మీద నాకున్న పిచ్చి ప్రేమని కథగా చెప్పాను' అని అంటారు. ఆ డైలాగ్ తో ఆడియన్స్ కొంత వరకు శాంతించే అవకాశం ఉంది అని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

