MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rama Prabha: ప్రతి నెలా 25 వేలు అకౌంట్ లో వేస్తాడు, కానీ ఫోన్ మాత్రం ఎత్తడు, రమాప్రభకు సహాయం చేస్తున్న డైరెక్టర్ ఎవరు?

Rama Prabha: ప్రతి నెలా 25 వేలు అకౌంట్ లో వేస్తాడు, కానీ ఫోన్ మాత్రం ఎత్తడు, రమాప్రభకు సహాయం చేస్తున్న డైరెక్టర్ ఎవరు?

Rama Prabha: పాత తరం తారలతో ఈ తరం నటీనటులకు వారధిగా నిలిచిన నటి రమాప్రభ. దాదాపు మూడు తరాల నటీనటులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది రమాప్రభ. ఇండస్ట్రీ పట్టించుకోకపోయినా.. ఓ డైరెక్టర్ మాత్రం ఆమెకు నెల నెల డబ్బులు పంపిస్తాడని తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 24 2026, 09:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మూడుతరాలతో నటించిన సీనియర్ తార..
Image Credit : Asianet News

మూడుతరాలతో నటించిన సీనియర్ తార..

రమాప్రభ.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సీనియర్ తార. దాదాపు మూడు తరాల నటీనటులతో కలిసి ఆమె సిల్వర్ స్క్రీన్ ను షేర్ చేసుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల కాలం నుంచి.. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, ఆతరువాత మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల వరకూ మూడు తరాల వారితో నటించింది రమాప్రభ. ఇప్పటికీ అడపా దడపా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. 79 ఏళ్ల రమాప్రభ.. ఓ పల్లెటూరిలో ఇల్లు కట్టుకుని.. తన తమ్ముడి కుటుంబంతో కలిసి ఉంటోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దర్శకుడి గొప్ప మనసు గురించి రమాప్రభ కామెంట్స్..
Image Credit : Asianet News

దర్శకుడి గొప్ప మనసు గురించి రమాప్రభ కామెంట్స్..

ఫిల్మ్ ఇండస్ట్రీలో బంధాలు, అనుబంధాలు నిలవడం చాలా అరుదు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఒక యాక్టర్ ను గుర్తుపెట్టుకుని ఆదుకోవడం ఎంతమందికి సాధ్యమవుతుంది? సరిగ్గా ఈ విషయాన్నే గుర్తుచేస్తూ.. రమాప్రభ ఒక దర్శకుడు గురించి చెప్పిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ గొప్ప మనసు గురించి, ఆయనతో తనకు ఉన్న అనుబంధం గురించి ఆమె పంచుకున్న విశేషాలు సినీ ప్రేమికుల హృదయాలను హత్తుకుంటున్నాయి.

35
నెలకు 25,000 అకౌంట్‌లో వేస్తారు
Image Credit : our own

నెలకు 25,000 అకౌంట్‌లో వేస్తారు

రమాప్రభ చెప్పిన ఆ దర్శకుడు ఎవరో కాదు పూరీ జగన్నాథ్. ఆయన ప్రతీ నెల 25,000 తన బ్యాంక్ అకౌంట్‌లో జమ చేస్తుంటారు. చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ప్రముఖులతో పనిచేసినప్పటికీ, ఒక పెద్ద దర్శకుడు తనకు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ప్రతి నెలా క్రమం తప్పకుండా డబ్బు పంపడం ఆమెకు ఎంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఎంత సహాయం చేసినా, పూరీ జగన్నాథ్ మాత్రం తనకు ఫోన్ చేస్తే ఎత్తరు!

45
ఫోన్ ఎత్తకపోవడానికి కారణం ఏంటి?
Image Credit : our own

ఫోన్ ఎత్తకపోవడానికి కారణం ఏంటి?

"ఆయన ప్రతి నెలా నా అకౌంట్‌లో డబ్బులు వేస్తుంటారు. కానీ నేను ఆయనకు థ్యాంక్స్ చెబుదామని లేదా పలకరిద్దామని ఫోన్ చేస్తే మాత్రం ఫోన్ ఎత్తడు. ఎందుకంటే, నేను సహాయం చేస్తున్నానని ఆయన గొప్పగా చెప్పుకోవడానికి ఇష్టపడరు" అని రమాప్రభ తెలిపారు. తానిచ్చే చిన్న సాయానికి ఎదుటివారి నుంచి కృతజ్ఞతలు ఆశించడం పూరీ నైజం కాదని ఆమె వెల్లడించారు. ఎటువంటి ప్రచారం లేకుండా, సహాయం పొందినవారి వద్ద నుంచి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే రీతిలో మాట్లాడకుండా గుప్తంగా సహాయం చేయడమే ఆయన శైలి అని ఆమె వివరించారు.

55
జన్మబంధం.. రుణానుబంధం
Image Credit : Asianet News

జన్మబంధం.. రుణానుబంధం

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'బద్రి', 'దేశముదురు', 'నేను ఇంతే' వంటి కొన్ని చిత్రాల్లో రమాప్రభ నటించారు. అయితే కేవలం కొన్ని సినిమాల్లో నటించినంత మాత్రాన ఇంతటి ఆప్యాయత చూపించడం సామాన్యమైన విషయం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. "హైదరాబాద్‌లో నాతో తిన్నవారు, నా వల్ల లబ్ధి పొందినవారు ఎంతోమంది ఉన్నారు. కానీ వారెవరూ నా పరిస్థితిని పట్టించుకోలేదు. కానీ పూరీ జగన్నాథ్ మాత్రం నన్ను ఒక సొంత మనిషిగా భావించి ఈ సాయం చేస్తున్నారు. ఇది పూర్వజన్మ సుకృతం, మా మధ్య ఉన్న జన్మబంధం" అని ఆమె ఎమోషనల్ అయ్యారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Giri Babu: 40 రూపాయల రూమ్ రెంట్, స్కూల్ లో డ్రిల్ మాస్టర్ గా పనిచేస్తూ.. గిరిబాబుతో కలిసున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
Paradise Movie Review: ప్యారడైజ్‌ మూవీ రివ్యూ.. నాని విశ్వరూపం ఓకే.. కానీ అసలు సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Varshini: నరేష్ ని పొట్టోడు అనొద్దు, అది కూడా సమస్యే అతడికి.. ఆడదానితో ఆడి గెలిచి ఏం రచ్చ చేస్తున్నారో చూడు
Related Stories
Recommended image1
Giri Babu: 40 రూపాయల రూమ్ రెంట్, స్కూల్ లో డ్రిల్ మాస్టర్ గా పనిచేస్తూ.. గిరిబాబుతో కలిసున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
Prabhas: కాకులు దూరని కారడివిలో నాటు కోడి కావాలని ప్రభాస్ డిమాండ్, అర్ధరాత్రి ఫారెస్ట్ లో కోళ్లను వేటాడిన నటుడు ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved