- Home
- Entertainment
- 19 ఏళ్ల వరకు హీరోయిన్‌గా పెరిగిన స్టార్ హీరో ఎవరో తెలుసా?, ఇంట్లో అమ్మాయిలు లేని లోటు తీర్చిన వైనం
19 ఏళ్ల వరకు హీరోయిన్‌గా పెరిగిన స్టార్ హీరో ఎవరో తెలుసా?, ఇంట్లో అమ్మాయిలు లేని లోటు తీర్చిన వైనం
హీరోలు సినిమాల్లో పాత్ర డిమాండ్ మేరకు, ఫన్నీ సీన్ల కోసం, డ్రామా పండించడం కోసం లేడీ గెటప్‌ల్లో కనిపిస్తారు. అయితే ఈ లెజెండరీ నటుడు మాత్రం 19ఏళ్ల వరకు హీరోయిన్‌గానే పెరిగాడట.
- FB
- TW
- Linkdin
Follow Us
)
anr, akkineni nageswara rao
సినిమాల్లో హీరోలు ఆడవేషాలు వేయడం కామనే. చాలా మంది సూపర్ స్టార్స్ ఇలా లేడీ వేషాలతో మెప్పించారు. చిరంజీవి, బాలయ్య వంటి వారు కాసేపు అలా మెరిసిన వారే. ఎన్టీఆర్ కూడా ఆడవేశాలతో మెప్పించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు కూడా తన సినిమాల్లో చాలా సార్లు ఆడవేషాలు వేసి అలరించారు. ఇంకా చెప్పాలంటే వాటికి వన్నె తెచ్చారు. అయితే దీనిపై ఏఎన్ఆర్ ఓపెన్ అయ్యారు. ఆడవేషాలతో తనుకున్న అనుబంధం గురించి చెప్పారు.
anr, akkineni nageswara rao
ఏఎన్నార్ చిన్నప్పుడు నాటకాలు వేసేవారు. తనకు పెద్దగా ఆస్తులు లేవు. పేరెంట్స్ కి చదివించే ఆర్థిక స్థోమత లేదు. దీంతో ఏదో పని చేయాల్సి వచ్చింది. అప్పట్లో నాటకాలకు మంచి క్రేజ్ ఉండేది. ఊరూర తిరిగి నాటకాలు ప్రదర్శించి మంచి పేరుతెచ్చుకునేవారు. డబ్బులు కూడా వచ్చేవి. దీంతో వినోదంతోపాటు డబ్బులు వస్తుండటంతో ఏఎన్నార్ వాటిపై ఫోకస్ పెట్టారు. తనని నాటకాల్లో పెద్దలు కూడా బాగా ఎంకరేజ్ చేసేవారట.
anr, akkineni nageswara rao
తాను చాలా వరకు నాటకాల్లో ఆడవేషాలు వేసేవాడట. అప్పట్లో నాటకాల్లో అమ్మాయిలు నటించేవారు కాదు, మగవారే ఆడవేషాలు వేసేవారట. ఏఎన్నార్ క్యూట్‌గా ఉండటంతో లేడీ గెటప్‌లకు బాగా సూట్ అయ్యేవారట. దీంతో ఎక్కువగా లేడీ గెటప్‌లు వేయించేవారట. అలా అమ్మాయిగానే పాపులర్ అయ్యాడట ఏఎన్నార్. అయితే తన కుటుంబంలో అమ్మాయిలు లేరు, అంతా మగసంతానమే. ఒక అమ్మాయి పుట్టి చనిపోయిందట. దీంతో ఏఎన్నార్ పేరెంట్స్ కి అమ్మాయిలు లేరనే బాధ ఉండేదట.
anr, akkineni nageswara rao
ఏఎన్నార్ నాటకాల్లో ఆడవేషాలు వేసి గుర్తింపు తెచ్చుకోవడంతో, చుట్టు పక్కల ఉన్నవాళ్లంతా తమ పేరెంట్స్ కి ఆడపిల్లలు లేని లోటుని తీరుస్తున్నాడు నాగేశ్వరరావు అని అభినందించేవారట. దీంతో ఆయన తల్లిదండ్రులు కూడా సంతోషించేవారట. అక్కినేని కూడా ఆ గెటప్‌లో ఒదిగిపోవడంతో, జనం నుంచి ఆయన పాత్రకు అంతే ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో చాలా వరకు ఆయనకు ఆడవేషాలే ఇచ్చేవారట. నాటకాల్లో తానొక హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడట. ఈ విషయాన్నే ఏఎన్నారు చెబుతూ, తాను 19 ఏళ్ల వరకు హీరోయిన్‌గానే పెరిగానని తెలిపారు.
anr, akkineni nageswara rao
అయితే సినిమాల్లో లేడీ గెటప్‌లు వేయడానికి, వాటిని అంతే బాగా రక్తికట్టించడానికి కారణం చిన్నప్పుడు తాను నాటకాల్లో వేసిన లేడీ గెటప్‌లే అని, అందుకే తాను అంత బాగా చేయగలిగాను అని తెలిపారు ఏఎన్నార్. జయప్రద నిర్వహించిన టాక్ షోలో ఏఎన్నార్ ఈ విషయాన్ని బయటపెట్టారు. నాటకాలు ప్రదర్శించే సమయంలో ఓ రైల్వే స్టేషన్‌లో ఘంటసాల బలరామయ్య తనని చూసి కుర్రాడు బాగున్నాడు, సినిమాలకు సెట్ అవుతాడని చెప్పి మద్రాస్‌కి తీసుకెళ్లాడట.
anr, akkineni nageswara rao
అలా ఆయన ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఏఎన్నారు. `ధర్మపత్ని` చిత్రంలో చిన్న పాత్రతో ఆయన నటుడిగా మారారు. `శ్రీ సీతారామ జననం` చిత్రంతో లీడ్ గా మారారు. వరుసగా సినిమాలు చేసుకుంటూ ఎన్టీఆర్ కి దీటుగా రాణించారు, మెప్పించారు. ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా, లెజెండరీ నటుడుగా ఎదిగారు ఏఎన్నార్. ఆయన వారసత్వాన్ని ఇప్పుడు నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కొనసాగిస్తున్నారు.