ఫ్యాన్స్ కు అనిరుధ్ రవిచందర్ బిగ్ షాక్, నిరాశలో అభిమానులు, ఏం జరిగింది?
మ్యూజిక్ లవర్స్ కు అనిరుధ్ రవిచంద్రర్ బిగ్ షాక్ ఇచ్చారు. చెన్నైలో మొదటి సారిగా లైవ్ కాన్సర్ట్ ను ఎంజాయ్ చేద్దామనుకున్న ఫ్యాన్స్ కు ని నిరాశపరిచాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. ఇంతకీ ఆయన ఏం చేశారు.
- FB
- TW
- Linkdin
Follow Us

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా దుమ్మురేపుతున్నాడు అనిరుధ్ రవిచందర్. ప్రస్తుతం ఆయన చేతిలో తెలుగు,తమిళం కలిపి అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. రజినీకాంత్ 'కూలీ', విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్', విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ', శివకార్తికేయన్ 'మదరాసి', తలపతి విజయ్ 'జననాయకన్' వంటి సినిమాలు ఉన్నాయి. రాబోయే ఆరు నెలల్లో ఈ సినిమాలు విడుదల కానున్నాయి. ఈ సినిమాలతో సంగీత దర్శకత్వంలో బిజీగా ఉన్న అనిరుధ్, అప్పుడప్పుడు విదేశాలకు వెళ్లి సంగీత కచేరీలు కూడా నిర్వహిస్తున్నారు.
అప్పుడప్పుడు హుకుం పేరుతో ఆయన నిర్వహించే సంగీత కచేరీకి అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. అయితే ఎప్పుడూ ఫారెన్ లోనే కచేరీలు చేస్తున్న అనిరుధ్ కు.. చెన్నైలో ఎప్పుడు చేస్తారన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చెన్నైలో లైవ్ షో చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దీనికి సబంధించి టికెట్లు కూడా భారీగా అమ్ముడు పోయాయి.
జూలై 26న చెన్నైలోని ఓ చిన్న స్టేడియంలో కచేరీ జరగనున్నట్లు కొన్ని నెలల క్రితమే ప్రకటించారు. దీనికి సంబంధించిన టికెట్ల అమ్మకాలు కూడా జోరుగా సాగాయి. టికెట్ల అమ్మకం ప్రారంభమైన 30 నిమిషాల్లోనే మొత్తం 30 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. అనిరుధ్ కచేరీకి అంత డిమాండ్ ఉంది. కాని ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. ఈలైవ్ షో కోసం భారీగా అభిమానులు ఎదురుచూస్తున్నారని తెలియడంతో.. అనిరుధ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం అనిరుధ్ తరపున ఒక ప్రకటన విడుదలైంది. అనివార్య కారణాల వల్ల జూలై 26న చెన్నైలో జరగాల్సిన హుకుం కచేరీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. టికెట్లు కొనుగోలు చేసిన వారికి 7 నుంచి 10 రోజుల్లో డబ్బులు తిరిగి ఇస్తామని, త్వరలో కచేరీకి కొత్త తేదీ, వేదికను ప్రకటిస్తామని తెలిపారు. టికెట్లకు భారీ డిమాండ్ ఉండటం వల్ల ఈ కచేరీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే, అనిరుధ్ కచేరీ రద్దుకు పోలీసులు అనుమతి నిరాకరించడం కూడా ఒక కారణమని చెబుతున్నారు. ఈ కచేరీకి 30 వేల మందికి అనుమతి కోసం మొదట దరఖాస్తు చేసుకున్నారు. అయితే, మరో 10 వేల టికెట్లకు డిమాండ్ ఉండటంతో, మరో 10 వేల మంది హాజరు కావడానికి పోలీసులను అనుమతి కోరారట. కానీ పోలీసులు అనుమతి నిరాకరించారట. గతంలో ఏ.ఆర్.రెహమాన్ కచేరీలో అధిక సంఖ్యలో జనం రావడంతో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు అనుమతి నిరాకరించారట.
ఇది ఒక కారణం అయితే, అనిరుధ్ బిజీ షెడ్యూల్ కూడా మరో కారణమని చెబుతున్నారు. ఒక కచేరీ నిర్వహించడానికి ప్రాక్టీస్ తో పాటు కనీసం 5 రోజులైనా పడుతుంది. అనిరుధ్‌కు జూలై 31న 'కింగ్‌డమ్', ఆగస్టు 14న 'కూలీ' సినిమాలు విడుదల కానున్నాయి. ఈ రెండు భారీ సినిమాలు వరుసగా విడుదల కానుండటంతో, వాటి పనులు పూర్తి చేయలేకపోవడం కూడా కచేరీ రద్దుకు కారణమని చెబుతున్నారు.