MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్ లేకుండానే బాహుబలి పార్ట్ 3, రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడు? ఎవరు హీరో?

ప్రభాస్ లేకుండానే బాహుబలి పార్ట్ 3, రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడు? ఎవరు హీరో?

ప్రభాస్ లేని బాహుబలి సినిమాను ఊహించగలమా? ప్రభాస్ కాకుండా ఆ సినిమాలకు వేరే హీరోలు ఎవరు సెట్ అవుతారు? బాహుబలి పార్ట్ 3 లో హీరోగా రాజమౌళి ఎవరిని తీసుకోబోతున్నారు?

4 Min read
Mahesh Jujjuri
Published : Jul 22 2025, 08:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Image Credit : Facbook / Baahubali

చరిత్ర సృష్టించిన బాహుబలి

బాహుబలి సినిమాలు తెలుగు సినిమా చరిత్రను ప్రపంచ స్థాయిలో నిలబెట్టాయి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్‌క్లూజన్.. రెండు భాగాలుగా తెరకెక్కిన బాహుబలి, తెలుగు సినిమాను నెక్స్ట్‌ లెవల్‌కు తీసుకెళ్లింది. అంతే కాదు టాలీవుడ్ నుంచి ప్రభాస్‌ను మొదటి పాన్ ఇండియా స్టార్‌ను చేసింది కూడా బాహుబలి సినిమానే. 

కలెక్షన్ల పరంగా, స్టార్ డమ్ పరంగా ఎన్ని సినిమాలు వచ్చినా బాహుబలి క్రియేట్ చేసిన హిస్టరీ మాత్రం అలా నిలిచిపోయి ఉంటుంది. ప్రభాస్, అనుష్క, రానా దగ్గుబాటి, తమన్నా వంటి స్టార్ కాస్ట్‌తో రూపొందిన ఈమూవీ ఇండియాన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడంతో పాటు తెలుగు సినిమా ను కొత్త పుంతలు తొక్కించింది బాహుబలి సినిమా.

26
Image Credit : Facbook / Baahubali

బాహుబలి కలెక్షన్స్

ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో కలెక్షన్ల పరంగా కూడా బాహుబలి రికార్డ్ సాధించింది. బాహుబలి ఫ్రాంచైజీ సినిమాలు రెండు కలిపి దాదాపు 2500 కోట్లకు పైగా వసూళ్ళు సాధించింది. ఇక ఈసినిమాను రిలీజ్ చేస్తే.. ఈజీగా 50 కోట్లు వసూలు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక బాహుబలి సినిమాకు దంగల్ పోటీగా వచ్చినా.. బాహుబలి రికార్డ్ ను మాత్రం చెరిపివేయలేకపోయింది. అంతే కాదు బాహుబలి సినిమాతో ప్రభాస్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు తయారయ్యారు. 

మరీ ముఖ్యంగా జపాన్ లో అయితే ప్రభాస్ కు డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ప్రభాస్ బొమ్మలతో డ్రెస్ లు, వస్తువులూ.. టాటూలు, ఒకటి కాదు ప్రభాస్ ఫ్యాషన్ తో జపాన్ నిండిపోయింది. కొంత మంది వీరాభిమానులైతే ప్రభాస్ ను చూడటానికి జపాన్ నుంచి సొంత ఖర్చులతో ఇండియా వచ్చి.. హైదరాబాద్ లో ప్రభాస్ ఇంటిముందు వెయిట్ చేస్తుంటారు. బాహుబలి ప్రభావం అంతలా చూపించింది. ఇక ఈ సినిమాలో నటించిన రమ్యకృష్ణ , సత్యరాజ్, రానా తదితరులకు ఎలాంటి స్టార్ డమ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శివగామిగా రమ్యకృష్ణను చూసి జనాలు ఊగిపోయారు.

Related Articles

జూనియర్ ఎన్టీఆర్ వదిలేసుకున్న 8 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఏవో తెలుసా?
జూనియర్ ఎన్టీఆర్ వదిలేసుకున్న 8 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఏవో తెలుసా?
కృష్ణ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడానికి ఇబ్బంది పడిన హీరోయిన్ ఎవరో తెలుసా? కారణం ఏంటి?
కృష్ణ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడానికి ఇబ్బంది పడిన హీరోయిన్ ఎవరో తెలుసా? కారణం ఏంటి?
36
Image Credit : Facbook / Baahubali

పదేళ్లు పూర్తి చేసుకున్న బాహుబలి

రీసెంట్ గా బాహుబలి సినిమా పదేళ్లు పూర్తి చేసుకుంది. బాహుబలి ది బిగినింగ్ మూవీ 2015 లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మూవీ టీమ్ సంబరాలకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల పాత సినిమాలకు మంచి స్పందన వస్తున్న క్రమం కొంత మంది స్టార్లు రీరిలీజ్ లో కూడా భారీగా కలెక్షన్లను కొల్లగొడుతున్నారు. 

ఇక ఆమధ్య కాలంలో మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్, చిరు, పవన్ , బాలయ్య లాంటి స్టార్ హీరోల హిట్ సినిమాలను రీరిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఆ మ‌ధ్య వ‌చ్చిన‌ మహేష్‌బాబు ‘ఖలేజా’ రీ-రిలీజ్ బ్లాక్‌బస్టర్ వసూళ్లను అందుకుంది. 

ఈ ట్రెండ్‌లో భాగంగా బాహుబలి సినిమాను కూడా రీరిలీజ్ చేయబోతున్నారు టీమ్. అయితే ఈసినిమాను కేవలం ఒక్క భాగం మాత్రమే రిలీజ్ చేయకుండా ‘బాహుబలి 1’, ‘బాహుబలి 2’ సినిమాలను కలిపి ఒకే సినిమాగా ఎటిట్ చేయబోతున్నారు. ఈ సినిమాను ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో 2025 అక్టోబర్ 31న గ్రాండ్‌గా రీ రిలీజ్ చేయబోతున్నారు.

46
Image Credit : Facbook / Baahubali

ప్రభాస్ లేకుండానే బాహుబలి పార్ట్ 3 ప్లానింగ్

ఇక బాహుబలి రెండు సినిమాలు ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈక్రమంలోనే ఈ సినిమాకు పార్ట్ 3 కూడా ఉంటుందని రాజమౌళి తండ్రి, రచయిత రాజేంద్రప్రసాద్ గతంలో ఒక సారి వెల్లడించారు. అయితే బాహుబలి-3లో ఓ ట్విస్ట్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. బాహుబలి అంటేనే రాజమౌళి, ప్రభాస్, అనుష్క, కట్టప్ప, వీరు లేకుండా ఈ సినిమాను ఊహించడం కష్టం. అయితే బాహుబలి పార్ట్-1, పార్ట్-2లో హీరో హీరోయిన్లుగా నటించినటువంటి ప్రభాస్, అనుష్క లేకుండానే పార్ట్-3 సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది.

బాహుబలి-3లో మరో హీరో నటిస్తాడన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. అయితే పార్ట్ 3 మూవీలో హీరో ఎవరు అనేది తెలియాల్సి ఉంది. అంతే కాదు మరో విశేషం ఏంటంటే, ఈ సినిమాలో ప్రభాస్ చిన్న కామియో రోల్‌లో మాత్రమే కనిపించనున్నాడట. ఇక మెయిన్ క్యారెక్టర్‌గా బాలీవుడ్‌ నుంచి ఒక యంగ్ హీరోని తీసుకునే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్. ఈ యంగ్ హీరో ఎవరన్నది ఇంకా సీక్రెట్‌గానే ఉంది. కానీ ఈ కాస్టింగ్ నిర్ణయం సినిమాకి కొత్త ఊపు తీసుకొస్తుందని అంటున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే ఈ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి-3 కూడా మాహిష్మతి సామ్రాజ్యంతోనే కొనసాగుతుందా లేక కొత్త కథాంశంతో వస్తుందా అన్నది ఇంకా సస్పెన్స్‌గా ఉంది. త్వరలో బాహుబలి రెండు సినిమాలు రీ-రిలీజ్ చేయబోతున్నారు. ఈ సమయంలో బాహుబలి3 పై ప్రకటన వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. అప్పుడు కనుక ఈసినిమాపై ప్రకటన చేస్తే.. బాక్సాఫీస్ షేక్ అయ్యే అప్‌డేట్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్. మరి బాహుబలి-3లో హీరోగా ఎవరు కనిపిస్తారు? అసలు బాహుబలి-3పై అధికారిక ప్రకటన వస్తుందా లేదా అనేది అక్టోబర్ వరకు వేచిచూడాలి.

56
Image Credit : Facbook / Baahubali

రీ రిలీజ్ కాబోతున్న బాహుబలి

బాహుబలి రెండు సినిమాలు కలిపి కొత్తగా ఎడిట్ చేసిన వర్షన్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి రీ రిలీజ్ అయితే 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఖాయం అంటున్నారు. ఇప్పటి వరకు చాలా సినిమాలు రీరిలీజ్ అయ్యి రికార్డ్స్ క్రియేట్ చేశాయి. అయితే రీ-రిలీజ్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాల్లో స‌న‌మ్ తేరీ క‌స‌మ్ 41 కోట్లు రాబ‌ట్ట‌గా, తుంబాద్ మూవీ 38 కోట్లు వ‌సూళ్లు సాధించింది. 

ఇక తెలుగు విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు మురారి సినిమా 10 కోట్లు, ఖలేజా సినిమా 9 కోట్లుకి పైగా వ‌సూళ్లు సాధించాయి. ఇక బాహుబలి రిలీజ్ అయితే ఈ రికార్డ్స్ అన్నీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అంటున్నారు సినిమా విశ్లేషకులు. పైగా రెండు సినిమాలు కలిపి, కొంత కంటెంట్ ఆడ్ చేసి, రీలోడెడ్ వర్షన్ తీస్తున్నారు కాబట్టి ఈ సినిమా కొత్త సినిమాల మాదిరి రెస్పాన్స్ ను అందుకునే అవకాశం ఉంది. ఇక ఈసినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు, బాహుబలి ఫ్యాన్స్ కూడా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

66
Image Credit : Facbook / Baahubali

మరోసారి సెన్సార్ కు బాహుబలి?

బాహుబలి 1 2 గంటల 38 నిమిషాల డ్యూరేషన్ ఉండగా.. బాహుబలి 2 డ్యూరేషన్ 2 గంటల 31 నిమిషాలు. మొత్తంగా ఆసినిమాకు 5 గంటలకు పైగా ర‌న్ టైమ్ వస్తుంది. అయితే అంత సినిమా రిలీజ్ చేయడం కుదరదు కాబట్టి.. అందులో అనవసరమైన సీన్లు, కొన్నిపాటలు కట్ చేసి.. మూడున్నర గంటలకు కుదించి, ఇంట్రెస్ట్ ను పెంచే విధంగా ఆడ్ చేయాల్సినవి చేయబోతున్నట్టు సమాచారం. 

అంతే కాదు ఆడ్ చేసేవాటిలో గతంలో తొలగించిన డిలీటెడ్ సీన్స్‌ను కూడా ఉన్నట్టు తెలుస్తోంది. . ఇది ఈ సినిమాకు కొత్తదనంగా ఉండ‌డంతో పాటు మూవీపై ఆసక్తిని మరింత పెంచనుంది. ఈ స్పెషల్ ఎడిషన్‌ రిలీజ్ చేయాలి అంటే మళ్లీ సెన్సార్ కు వెళ్లాల్సి ఉంటుందని అంటున్నారు. బాహుబలి ఫస్ట్ పార్ట్ ను ఇంటర్వెల్ వరకూ.. రెండో భాగం సినిమాను ఇంటర్వెల్ తరువాత సెకండ్ పార్ట్ గా రిలీజ్ చేయబోతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
అనుష్క శెట్టి
ఎస్.ఎస్. రాజమౌళి
రమ్య కృష్ణ
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved