దాదాపు దశాబ్ధ కాలంగా హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు టాలీవుడ్ హీరో గోపీచంద్. ప్రస్తుతం హిట్ సినిమాల దర్శకుడితో ప్రయోగం చేస్తున్నాడు. మరి ఈసారైనా సక్సెస్ వరించేనా?
గోపీచంద్ ఫస్ట్ లుక్ పోస్టర్
టాలీవుడ్ లో మాచో స్టార్‌గా పేరుపొందిన హీరో గోపీచంద్.. గత 10 సంవత్సరాలుగా హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. 46వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ హీరో తాజాగా తన 33వ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న సంకల్పంతో ఉన్న గోపీచంద్.. ఘాజి లాంటి హిట్ సినిమాలు చేసిన సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
7వ శతాబ్దంలోని భారతీయ చరిత్రలోని ఒక సంఘటన ఆధారంగా ఈసినిమా రూపొందుతోంది. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ సినిమాలో గోపీచంద్ పూర్తిగా కొత్త పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు, ఈ పాత్రలో ఆయన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రత్యేకం కాబోతున్నట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతోందుతున్న ఈసినిమాను శ్రీనివాసా చిత్తూరి పవన్ కుమార్ తో కలిసి నిర్మిస్తున్నారు.
10 ఏళ్లుగా హిట్ లేక ఇబ్బందుల్లో గోపీచంద్
ఇక చాలా కాలంగా మాచో స్టార్ కు హిట్ లేదు. మంచి హైట్, పర్సనాలిటీ ఉండి, యాక్షన్ సినిమాలకు సరిగ్గా సరిపోయే గోపీచంద్ సరైన కథలను ఎంచుకోలేక కెరీర్ ను ఇబ్బందుల్లో పడేసుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే 2014 లో రిలీజ్ అయిన లౌక్యం సినిమా తరువాత గోపీచంద్ ఖాతాలో ఒక్క హిట్ సినిమా కూడా లేదు. అప్పటి నుంచి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా, ప్రయోగాలు చేసినా కూడా హిట్ సాధించలేకపోయాడు గోపీచంద్.
బాక్సాఫీస్ ను షేక్ చేసేంత కటౌట్ ఉన్నా.. సరైన కంటెంట్ దొరక్క కెరీర్ ను వేస్ట్ చేసుకున్నాడు గోపీచంద్. సక్సెస్ కోసం డిఫరెంట్ రూట్లను వెతుకాడు, రకరకాల దర్శకులను ప్రయత్నించాడు అయినా సక్సెస్ మాత్రం దక్కలేదు. అందకే ఈసారి కథ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. డైరెక్టర్లను గుడ్డిగా నమ్మకుండా మంచి కథను ఎంచుకుని ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.
ఘాజీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డితో గోపీచంద్ ప్రయోగం
ఘాజీ, అంతరిక్షంలో లాంటి డిఫరెంట్ సినిమాలను డైరెక్ట్ చేసిన సంకల్ప్ రెడ్డితో సినిమా చేస్తున్నాడు గోపీచంద్. అంతే కాదు మరో సినిమాను కూడా పట్టాలెక్కించాడు. యంగ్ డైరెక్టర్ కుమార్ వెల్లంకితో మరో సినిమాను స్టార్ట్ చేశాడు. ఈ సినిమా విషయంలో కూడా కథ చాలా అద్భుతంగా ఉంటుందని సమాచారం. ఒక సినిమా హిట్ అయితే పది ప్లాప్ లు ఫేస్ చేస్తూ వస్తోన్న గోపీచంద్.. ఈసారి సాలిడ్ కమ్ బ్యాక్ కు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి వర్కౌట్ అయితే చాలు గోపీచంద్ మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్టే అంటున్నారు సినిమా జనాలు.