MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • తెలుగులో నా ఫేవరెట్ హీరో అతడే.. ఒక్కసారైనా కలిసి నటించాలి.. క్రేజీ హీరోయిన్ కామెంట్స్

తెలుగులో నా ఫేవరెట్ హీరో అతడే.. ఒక్కసారైనా కలిసి నటించాలి.. క్రేజీ హీరోయిన్ కామెంట్స్

Anaswara Rajan: నటి అనస్వర రాజన్ ఛాంపియన్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. తెలుగు ప్రేక్షకుల అభిమానం, చంద్రకళ పాత్ర సవాళ్లు, నటన పట్ల ఆమెకున్న ఆసక్తి, బాల్యం నుంచీ సినీ ప్రయాణం లాంటి విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. 

2 Min read
Author : Pavithra D
Published : Dec 26 2025, 08:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది..
Image Credit : Instagram\AnaswaraRajan

ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది..

మలయాళ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటి అనస్వర రాజన్.. ప్రస్తుతం ఛాంపియన్ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది హీరోయిన్ అనస్వర రాజన్. తన పేరు అనస్వరకు అర్థం "నాశనం లేనిది" లేదా "అనంతమైనది" అని వివరించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు..
Image Credit : Instagram\Anaswara Rajan

తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు..

"తెలుగు ప్రేక్షకులు ఏ మంచి సినిమానైనా, ఏ మంచి నటుడినైనా ఆదరిస్తారు. అది మా పరిశ్రమలా కాదు. వారంతా మంచి చిత్రాలను అంగీకరిస్తారు" అని హీరోయిన్ అనస్వర చెప్పింది. 2019లో విడుదలైన 'తన్నీర్ మతన్ దినంగల్' సినిమా ద్వారానే తెలుగు ప్రేక్షకుల ప్రేమను పొందానని, అప్పటి నుంచే తెలుగు చిత్రాలలో నటించాలని ఆశపడ్డానని తెలిపింది.

35
మొదటి సినిమా ఆడిషన్ జరిగింది అప్పుడే..
Image Credit : Instagram\Anaswara Rajan

మొదటి సినిమా ఆడిషన్ జరిగింది అప్పుడే..

ఛాంపియన్ చిత్రం ఇతర ప్రేమకథా చిత్రాల కన్నా భిన్నమైనదని అనస్వర చెప్పింది. ఈ సినిమాలో ఆమె పోషించిన చంద్రకళ పాత్ర కొత్త సవాలును విసిరిందని పేర్కొంది. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు తన మొదటి సినిమా ఆడిషన్‌కు వెళ్లడం, ఎలాంటి నటన అనుభవం లేకుండానే ఎంపిక కావడం తనను ఆశ్చర్యపరిచిందని అనస్వర పేర్కొంది.

45
సినీ నేపధ్యం లేకుండానే ఇండస్ట్రీలోకి..
Image Credit : Instagram\Anaswara Rajan

సినీ నేపధ్యం లేకుండానే ఇండస్ట్రీలోకి..

కేరళలోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన తాను ఎలాంటి సినీ నేపధ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని తెలిపింది. ఆడిషన్‌కు వెళ్లడానికి తన అక్క సహాయపడిందని.. అలా తల్లిదండ్రులు తనను అనుమతించారని పేర్కొంది. సినిమా రంగం తనను ఒక నటిగా మాత్రమే కాకుండా, ఒక వ్యక్తిగా కూడా ఎదిగేలా చేసిందని అనస్వర స్పష్టం చేసింది.

55
అతడే నా ఫేవరెట్ హీరో..
Image Credit : Instagram\AnaswaraRajan

అతడే నా ఫేవరెట్ హీరో..

"నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. నటన నుండి లభించే అడ్రినలిన్ రష్ నాకు ఎంతో సంతృప్తినిస్తుంది. అది డబ్బు, కీర్తి కంటే ఎక్కువ" అని ఆమె అన్నారు. ప్రశంసలతో పాటు విమర్శలు రావడం సహజమేనని, మొదట్లో కష్టంగా అనిపించినా, ఇప్పుడు వాటిని స్వీకరించే సామర్థ్యం పెరిగిందని వివరించింది. అల్లు అర్జున్ తనకు ఇష్టమైన తెలుగు హీరో అని.. తెలుగు సినిమాలు చూస్తున్నానని తెలియకుండానే.. వాటిని ఇష్టపడ్డానని పేర్కొంది. 

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
తెలుగు సినిమా
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Village Backdrop Movies: రాంచరణ్ నుంచి రవితేజ వరకు, హీరోలకు సవాల్..వందల కోట్లు తెచ్చిన ముసుగు విలన్లు వీళ్ళే
Recommended image2
SJ Surya Villain Movies: ఇండియన్ 2 నుంచి సర్దార్ 2 వరకు.. ఎస్.జే.సూర్య విలనిజం ఎందుకు ఫ్లాప్ అవుతోంది? జైలర్ 2 గట్టెక్కిస్తుందా?
Recommended image3
Sobhan Babu: ఏమయ్యా ఎట్లా తీసావయ్యా సినిమా.. ఎస్వీ కృష్ణారెడ్డిని పిలిచి, నిలదీసిన శోభన్ బాబు, ఏమన్నాడంటే?
Related Stories
Recommended image1
Actress: చేసినవి 12 చిత్రాలైతే అందులో రెండే హిట్స్.. కానీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.. ఎవరంటే.?
Recommended image2
Actress: చేసినవి 8 చిత్రాలు.. కుర్రాళ్లకు కలల రాణి.. కానీ అర్ధాంతరంగా ఇండస్ట్రీ వదిలేసింది.. ఎవరంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved