- Home
- Entertainment
- నాకు పెళ్లి కాకుంటే ఆ హీరోతో డేటింగ్ చేసేదాన్ని, అనసూయ ఓపెన్ గా చెప్పేసింది.. ఇంతకీ ఆ స్టార్ ఎవరు ?
నాకు పెళ్లి కాకుంటే ఆ హీరోతో డేటింగ్ చేసేదాన్ని, అనసూయ ఓపెన్ గా చెప్పేసింది.. ఇంతకీ ఆ స్టార్ ఎవరు ?
టాలీవుడ్ క్రేజీ యాంకర్ అనసూయ ఎలాంటి కామెంట్ చేసినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది. అనసూయ ఎలాంటి విషయం గురించి అయినా ధైర్యంగా తన అభిప్రాయం చెబుతుంది.

Anasuya Bharadwaj
టాలీవుడ్ క్రేజీ యాంకర్ అనసూయ ఎలాంటి కామెంట్ చేసినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది. అనసూయకు అన్న ఫాలోయింగ్ అలాంటిది. గ్లామర్, నటనతో అనసూయ ఎంతటి గుర్తింపు తెచ్చుకుందో అదే స్థాయిలో వివాదాలు కూడా వార్తల్లో నిలిచాయి. అనసూయ ఎలాంటి విషయం గురించి అయినా ధైర్యంగా తన అభిప్రాయం చెబుతుంది. తనని విమర్శించే వాళ్ళకి అంతే ఘాటుగా బదులిస్తుంది. అందుకే అనసూయ వివాదాలు కూడా బాగా ఫేమస్ అయ్యాయి.
Anasuya Bharadwaj
అనసూయ ఓ బుల్లితెర కార్యక్రమంలో తన కెరీర్ గురించి మాట్లాడుతూ టాలీవుడ్ హీరోల గురించి సరదాగా కామెంట్స్ చేసింది. ఈ క్రమంలో ఓ స్టార్ హీరోతో డేటింగ్ గురించి అనసూయ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. యాంకర్ రవి, శ్రీముఖి ఆ టీవీ షో ని పోస్ట్ చేశారు. అనసూయ అతిథిగా హాజరైంది.
Anasuya Bharadwaj
అనసూయ కి ఇచ్చిన టాస్క్ ప్రకారం ఆమె అడిగిన ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పాలి. లేకుంటే పచ్చి మిరపకాయ తినాల్సి వస్తుంది అని యాంకర్ రవి, శ్రీముఖి తెలిపారు. అనసూయ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసింది. రవి ప్రశ్నిస్తూ మీకు ఒకవేళ పెళ్లి కాకుంటే టాలీవుడ్ లో ఏ హీరోతో డేటింగ్ చేసేవాళ్లు అని ప్రశ్నించాడు. దీనికి అనసూయ ఏమాత్రం ఆలోచించకుండా రాంచరణ్ అని సమాధానం ఇచ్చింది.
Anasuya Bharadwaj
రాంచరణ్ తో అనసూయ రంగస్థలం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆమె నటించిన రంగమ్మత్త పాత్రకు ప్రశంసలు దక్కాయి. అదేవిధంగా అనసూయ అడవి శేష్ గురించి కూడా కామెంట్స్ చేసింది. అడవి శేష్ షూటింగ్ లొకేషన్ లో మిలిటరీ ఆఫీసర్ లాగా స్ట్రిక్ట్ గా ఉంటారు. అడవి శేషు అలా ఉండడం వల్లే క్షణం కానీ, అతని ఇతర చిత్రాలు కానీ విజయం సాధిస్తున్నాయని అనసూయ ప్రశంసించింది.
Anasuya Bharadwaj
ఇదే కార్యక్రమంలో అనసూయ తన భర్త శశాంక్ భరద్వాజ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన భర్తలో ఉన్న ఒకే ఒక్క నెగిటివ్ క్వాలిటీ షార్ట్ టెంపర్ అని పేర్కొంది. మిగిలిన అన్ని విషయాల్లో తన భర్త మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ప్రశంసించింది. తన పేరు గురించి కూడా అనసూయ ఒక ఆసక్తికర విషయాన్ని రివీల్ చేసింది. మొదట తన తల్లి తనకి పవిత్ర అనే పేరు పెట్టాలనుకున్నారట. కాబట్టి పవిత్ర అనే పేరు కూడా తనకిష్టమని అనసూయ తెలిపింది.