- Home
- Entertainment
- అల్లు అర్జున్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఏకైక మూవీ ఏంటో తెలుసా? ఆ డైరెక్టర్ అంటే ఇప్పటికీ భయం
అల్లు అర్జున్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఏకైక మూవీ ఏంటో తెలుసా? ఆ డైరెక్టర్ అంటే ఇప్పటికీ భయం
అల్లు అర్జున్ బాలనటుడిగా కెరీర్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత `గంగోత్రి` చిత్రంతో హీరో అయ్యారు. కానీ ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడట. స్టార్ డైరెక్టర్ ఈ విషయాన్ని బయటపెట్టారు.

అట్లీతో సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్న అల్లు అర్జున్
అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్‌గా రాణిస్తున్నారు. `పుష్ప` సినిమాలతో ఆయన రేంజ్ మారిపోయింది. ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయారు. ఇప్పుడు అదే రేంజ్‌లో మూవీస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీతో రాబోతున్నారు.
దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న విషయం తెలిసిందే. భారీ కాస్టింగ్‌తో ఈ మూవీ రాబోతుంది. ఇందులో దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెతోపాటు మరో ఐదుగురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తుంది.
బాలనటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన బన్నీ
అయితే అల్లు అర్జున్ నలభై ఏళ్ల క్రితమే నటుడిగా కెరీర్‌ని ప్రారంభించారు. ఆయన బాలనటుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన `విజేత` చిత్రంలో బాలనటుడిగా కనిపించి ఆకట్టుకున్నాడు. అప్పటికీ బన్నీ ఏజ్ కేవలం మూడేళ్లు మాత్రమే. అయినా అలరించారు బన్నీ. ఆ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన మరో మూవీ `డాడీ` లోనూ బాలనటుడిగా అలరించారు. ఇక `స్వాతిముత్యం`లోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా కాసేపు మెరిశాడు.
`గంగోత్రి`తో హీరోగా ఎంట్రీ `పుష్ప 2`తో పాన్ ఇండియా స్టార్
ఈ క్రమంలో 2003లో ఆయన `గంగోత్రి` చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు రూపొందించిన ఈ చిత్రానికి అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరించగా, అశ్వినీదత్ నిర్మించారు. ఈ మూవీ బాగానే ఆడింది. కానీ అనుకున్నంత గొప్పవిజయం సాధించలేకపోయింది.
ఆ తర్వాత `ఆర్య` చిత్రంతో బ్రేక్ అందుకున్నారు బన్నీ. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. `బన్నీ`, `దేశముదురు`, `జులాయి`, `వేదం`, `రేసుగుర్రం`, `సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు`, `డీజే`, `అల వైకుంఠపురములో`, `పుష్ప`, `పుష్ప 2` చిత్రాలతో హీరో నుంచి స్టార్ హీరోగా, పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు.
`పెళ్లాం ఊరెళితే` చిత్రానికి అసిస్టెంట్‌గా అల్లు అర్జున్
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీకి ముందు డైరెక్షన్ డిపార్ట్ మెంట్‌లో పనిచేశారట. `పెళ్లాం ఊరెళితే` చిత్రానికి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పనిచేశారట. దీనికి ఎస్వీకృష్ణారెడ్డి దర్శకుడు. ఈ మూవీకి అల్లు అరవింద్ నిర్మాత కావడం విశేషం.
ఆ సమయంలో అల్లు అర్జున్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. దీంతో సినిమా షూటింగ్ లపై అవగాహన కోసం తండ్రి నిర్మించిన `పెళ్లాం ఊరెళితే` చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడట.
దర్శకుడు ఎస్వీకృష్ణారెడ్డి బయటపెట్టిన రహస్యం
ఈ విషయాన్ని దర్శకుడు ఎస్వీకృష్ణా రెడ్డి వెల్లడించారు. ఇటీవల ఆయన ఇండియాగ్లిడ్జ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రహస్యాన్ని బయటపెట్టారు. కొన్ని రోజులు తన వద్ద అసిస్టెంట్‌గా బన్నీ పనిచేశాడని వెల్లడించారు. అయితే సినిమా ఇండస్ట్రీలో తనకు ఎవరు అన్నా భయం లేదు అని, కానీ మీరంటే భయమని అల్లు అర్జున్ తనతో చెబుతుంటాడని తెలిపారు దర్శకుడు.
కథ చెప్పకపోయినా మీరంటే భయం
`ఫస్ట్ టైమ్ మిమ్మల్ని చూసినప్పుడే మీలో ఒక డైరెక్టర్ కనిపించారు, ఓహో డైరెక్టర్ అంటే ఇలా ఉంటారా? ఇలా మెయింటేన్ చేస్తారా? అనేది నా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. ఒకవేళ నాకు మీరు కథ చెప్పకపోయినా మీరంటే నాకు భయం ఉంటుందని అల్లు అర్జున్ చెప్పినట్టు దర్శకుడు ఎస్వీకృష్ణారెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.