- Home
- Entertainment
- శోభన్ బాబు తన వారసులను సినిమాల్లోకి తీసుకురాకపోవడానికి కారణం ఇదే, సోగ్గాడు స్వయంగా బయటపెట్టిన నిజం
శోభన్ బాబు తన వారసులను సినిమాల్లోకి తీసుకురాకపోవడానికి కారణం ఇదే, సోగ్గాడు స్వయంగా బయటపెట్టిన నిజం
తెలుగు తెర సోగ్గాడు శోభన్ బాబు తన వారసులను సినిమాల్లోకి తీసుకురాలేదు. అయితే ఎందుకు ఫ్యామిలీని దూరం పెట్టారో స్వయంగా ఆయనే వెల్లడించారు. అసలు నిజం బయటపెట్టారు.

మహిళా ఆడియెన్స్ లో శోభన్ బాబుకి విశేష ఫాలోయింగ్
తెలుగు సినిమాకి సోగ్గాడిగా పేరుతెచ్చుకున్నారు శోభన్ బాబు. తన తరగని అందంతో ఆకట్టుకోవడంతోపాటు కుటుంబ కథా చిత్రాలతోనూ మెప్పించారు. ముఖ్యంగా ఫ్యామిలీ సినిమాలే ఆయన్ని మహిళా ఆడియెన్స్ కి దగ్గరచేశాయి. వారు అభిమానులుగా మారడానికి కారణమయ్యాయి.
ఒక సిస్టమాటిక్ లైఫ్‌ని లీడ్ చేసిన శోభన్‌బాబు అటు కుటుంబం పరంగానూ, ఇటు ఇండస్ట్రీలోనూ అదే రూల్‌ని వర్తింప చేశారు. కుటుంబానికి సినిమాని, సినిమాకి కుటుంబాన్ని దూరం పెట్టారు. తాను సూపర్ స్టార్‌గా వెలిగినా, తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్నా, అది ఇంటి బయటకే పరిమితం చేశారు.
వేల కోట్లు ఆస్తులు సంపాధించిన సోగ్గాడు
ఒక్కరు సినిమాల్లో చేస్తే ఆ తర్వాత కొన్నితరాలు సినిమాల్లోనే ఉంటున్నాయి. కానీ శోభన్ బాబు మాత్రం తన కుటుంబాన్ని సినిమాకి దూరం పెట్టారు. సినిమాల్లో తన వారసత్వాన్ని కొనసాగించలేదు. హీరోలాంటి కటౌట్ ఉన్న కొడుకుని సినిమాలకు దూరంగా ఉంచారు.
శోభన్ బాబు కొడుకు ఇప్పుడు డాక్టర్ గా రాణిస్తున్నారు. తన వ్యాపారాలుచూసుకుంటున్నాడు. సోగ్గాడు వెళ్తూ వెళ్తూ కొన్ని వేలకోట్ల ఆస్తులు ఇచ్చిపోయాడు. వాటిని చూసుకోవడమే పెద్ద పనిగా మారింది. చెన్నైలోని వేల కోట్ల ఆస్తులను ఆయన కొడుకు మెయింటనెన్స్ చేస్తున్నాడు. వాటి నిర్వాహణకు వేల మంది ఎంప్లాయ్స్ పనిచేస్తుండటం విశేషం.
వారసులను సినిమాల్లోకి తీసుకురాని శోభన్ బాబు
మరి తాను సూపర్ స్టార్‌గా రాణించినా, తన కొడుకునిగాని, వారసులనుగానీ శోభన్ బాబు సినిమాల్లోకి తీసుకురాకపోవడానికి కారణం ఏంటనేది ఇప్పటి వరకు సరైన క్లారిటీ లేదు. కానీ శోభన్ బాబునే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. తన వారసులను సినిమాల్లోకి ఎందుకు తీసుకురాలేదో తెలిపారు.
ఆయన హీరోగా ఉన్న సమయంలోనే ఓ ఇంటర్వ్యూలో అసలు విషయాన్ని పంచుకున్నారు. సినిమాల్లో సంపాదించిన ఈ డబ్బు, కీర్తి ఏది ఊరికే రాలేదని, ఎంతో త్యాగం ఉందని, వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతేగానీ ఇంతటి పేరు ప్రఖ్యాతలు రాలేదని తెలిపారు సోగ్గాడు.
సినిమాల్లోకి వస్తే పర్సనల్ లైఫ్ త్యాగం
`నార్మల్‌గా ఉండేవాళ్లు ఆర్టిస్టు లు కాలేరు. అబ్ నార్మల్‌గా ఉండేవాళ్లే ఆర్టిస్టులవుతారు. నా పిల్లలకు డబ్బుతోపాటు శోభన్ బాబు కొడుకులన్నకీర్తినిచ్చాను. ఇంతకంటే మా వాళ్లకి ఏం కావాలి. నా ఆనందాన్నే ఇచ్చాను గానీ, బాధలను ఇవ్వలేదు. సినిమా అనేది భద్రత లేని జాబ్. అంతేకాదు కోట్లు సంపాదించినా మనశ్శాతి మాత్రం దొరకని జాబ్. కాదని ఏ ఆర్టిస్టునైనా చెప్పమనండి` అని తెలిపారు శోభన్ బాబు.
`మిగిలిన రంగాల్లో ఫిఫ్టీ లాభముంటే, సగం నష్టం. కానీ సినిమా జాబ్ అలా కాదు. వ్యక్తిగత జీవితం మొత్తం కోల్పోవల్సి వస్తుంది. విడిగా అయితే ఒక ఉద్యోగం పోతే, మరో ఉద్యోగం వెతుక్కోవచ్చు. కానీ సినిమా ఫీల్డ్ లో ఫెయిల్ అయితే ఆ ఆర్టిస్ట్ ని దేవుడే కాపాడాలి.
అందుకే నా కుటుంబాన్ని సినిమాల్లోకి తీసుకురాలేదు
దీంతోపాటు పర్సనల్ లైఫ్ కూడా పాడవుతుంది. మేం ఇటు సినిమా జీవితాన్నీ, అటు నిజ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మాగ్జిమం ట్రై చేస్తాం. ఆ ట్రైల్స్ లోనే ఒక జీవిత కాలం వెళ్లిపోతుంది. పిల్లలు నిద్రపోయే సమయంలో ఇంటికి చేరుకోవడం, వాళ్లు లేచేటప్పటికీ మేం ఇంకా నిద్రలేవకపోవడమో, లేదంటే అప్పటికే వెళ్లిపోవడమో చేయడం, ఇలా నేను పదేళ్లు కష్టం అనుభవించాను.
ఆ తర్వాత ఆలోచించి సీరియస్‌గా నిర్ణయం తీసుకున్నాను. ఆదివారాలు పనిచేయకూడదని, సాయంత్రం ఆరు తర్వాత షూటింగ్‌లో పాల్గొనకూడదని` అని వెల్లడించారు శోభన్‌బాబు. తనలాంటి పరిస్థితి రాకూడదనే తన కుటుంబాన్ని సినిమాల్లోకి తీసుకురాలేదని తెలిపారు శోభన్ బాబు.