MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Same Concept Movies: ఒకే కాన్సెప్ట్ తో అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌, నాని సినిమాలు.. నేచురల్‌ స్టార్‌ రికార్డు సృష్టిస్తాడా?

Same Concept Movies: ఒకే కాన్సెప్ట్ తో అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌, నాని సినిమాలు.. నేచురల్‌ స్టార్‌ రికార్డు సృష్టిస్తాడా?

ఒకే కాన్సెప్ట్ తో అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌, ఇప్పుడు నాని సినిమాలు చేశారు. బన్నీ సంచలనం సృష్టించాడు, కానీ రామ్‌ చరణ్‌ సత్తా చాటలేకపోయారు. ఇప్పుడు నాని వంతు వచ్చింది.

3 Min read
Author : Aithagoni Raju
Published : Sep 26 2026, 02:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఒకే కాన్సెప్ట్ తో అల్లు అర్జున్‌, నాని, రామ్‌ చరణ్‌ సినిమాలు
Image Credit : Asianet News

ఒకే కాన్సెప్ట్ తో అల్లు అర్జున్‌, నాని, రామ్‌ చరణ్‌ సినిమాలు

ఒకే కాన్సెప్ట్ తో సినిమాలు రావడం కామనే. కానీ కొంత గ్యాప్‌తో అలాంటి సినిమాలు వస్తుంటాయి. కానీ ఒకే టైమ్‌లో ఒకే కాన్సెప్ట్ తో మూవీస్‌ రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇప్పుడు జరిగింది. అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌, నాని ఒకే కాన్సెప్ట్ తోనే సినిమాలు చేశారు. ఆ కాన్సెప్ట్ `గుర్తింపు`. దీనితో అల్లు అర్జున్‌ సంచలనం సృష్టించారు. రామ్‌ చరణ్‌ డీసెంట్‌ హిట్‌ కొట్టాడు. ఇప్పుడు నాని వంతు వచ్చింది. `ప్యారడైజ్‌`తో సంచలనం సృష్టిస్తాడా అనేది చూడాలి. అయితే ఇదే కాన్సెప్ట్ తో ప్రభాస్‌ 21ఏళ్ల క్రితమే సినిమా చేయడం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సవారీల గుర్తింపు కోసం నాని `ప్యారడైజ్‌` పోరాటం
Image Credit : Asianet News

సవారీల గుర్తింపు కోసం నాని `ప్యారడైజ్‌` పోరాటం

నేచురల్‌ స్టార్‌ నాని తాజాగా `ది ప్యారడైజ్‌` మూవీలో నటించాడు. శ్రీకాంత్‌ ఓడెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. మోహన్‌ బాబు, సంపూర్ణేష్‌ బాబు, ప్రియదర్శి వంటి వారు నటించారు. రా అండ్‌ రస్టిక్‌, మాస్‌ కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మాత్రం దుమ్ములేపుతోంది. మొదటి రోజు అదిరిపోయే వసూళ్లని రాబట్టింది. రెండో రోజు కూడా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా సవారీలు అనే జాతి గుర్తింపు కోసం చేసిన పోరాటం నేపథ్యంలో సాగిన కథ. 200 ఏళ్లుగా గుర్తింపుకునోచుకోని జాతి.. తమ గుర్తింపు కోసం చేసిన పోరాటమే ఈ చిత్ర కథ. తమ సవారీ జాతి కోసం జడల్‌ పాత్రలో నాని తిరుగుబాటు చేస్తాడు. పోరాడటతాడు. చివరికి విజయం సాధిస్తాడు. అయితే ఈ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తోంది. కానీ కలెక్షన్లు బాగున్నాయి. ఓవరాల్‌గా ఇది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనేది మున్ముందు తెలుస్తుంది. నాని రికార్డులు సృష్టిస్తాడా అనేది చూడాలి.

35
తమ ఊరు గుర్తింపు కోసం, దారి కోసం పెద్ది గా రామ్ చరణ్‌ పోరాటం
Image Credit : Asianet News

తమ ఊరు గుర్తింపు కోసం, దారి కోసం పెద్ది గా రామ్ చరణ్‌ పోరాటం

ఇక ఆ మధ్యనే ఇదే కాన్సెప్ట్ తో రామ్‌ చరణ్‌ `పెద్ది` సినిమా చేశారు. అడవి ప్రాంతంలోని గిరిజన గూడెలకు గుర్తింపులేదు. చనిపోయినా, పుట్టిన పట్టించుకునేవారు లేదు. కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదు. దీంతో ఏళ్లతరబడి వాళ్లు ఆ ఫారెస్ట్ లోనే మగ్గుతుంటారు. అయితే తమ గుర్తింపు ఆట కావాలని, ఆటనే ఆయుధంగా మలుచుకొని తమ గుర్తింపు కోసం రామ్‌ చరణ్‌ పెద్దిగా చేసిన పోరాటమే ఈ చిత్రం. క్రికెట్‌ నుంచి రెజ్లింగ్‌, ఆ తర్వాత రన్నర్‌గా మారి ఛాంపియన్‌గా నిలుస్తాడు. ఆ తర్వాత తమ వారికి గుర్తింపుని, అలాగే రైల్వే స్టేషన్‌ని తీసుకొస్తాడు పెద్ది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. విమర్శకుల ప్రశంసలందుకుంది. కానీ కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదని సమాచారం.

45
ఇంటి పేరు కోసం పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ పోరాటం
Image Credit : our own

ఇంటి పేరు కోసం పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ పోరాటం

కానీ ఇదే కాన్సెప్ట్ తో అల్లు అర్జున్‌ `పుష్ప` సినిమా చేశాడు. అయితే తమ ప్రాంత గుర్తింపు కోసం కాదు, తమ ఇంటి పేరు కోసం పుష్ప చేసిన పోరాటమే ఈ చిత్రం. తన నాన్న ఉంచుకున్నదానికి పుట్టాడని పుష్పకి వారి సర్‌నేమ్‌ ఇవ్వరు. వారి కుటుంబంలో చేర్చుకోరు. దీంతో ఆ విషయంలో చిన్నప్పట్నుంచి అవమానాలు ఫేస్‌ చేస్తాడు పుష్ప. ఈ క్రమంలో తాను ఎర్రచందనం కూలీగా ప్రారంభమై, స్మగ్లర్‌గా మారి, ఆ తర్వాత సిండికేట్‌ని శాసించే నాయకుడిగా, అనంతరం రాజకీయాలనే శాసించే నాయకుడిగా ఎదుగుతాడు. ఆ తర్వాత ఫ్యామిలీ పుష్పరాజ్‌ని గుర్తిస్తుంది. తమ కుటుంబంలో కలుపుకుంటారు. ఎమోషన్స్, యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ మూవీ సంచలనం విజయం సాధించింది. మొదటి పార్ట్ మూడు వందల కోట్లకుపైగా వసూళ్లని రాబడితే రెండో భాగం ఏకంగా రూ.1800కోట్లు వసూలు చేయడం విశేషం.

55
21 ఏళ్ల క్రితమే గుర్తింపు కోసం ఛత్రపతిగా ప్రభాస్ పోరాటం
Image Credit : prime video

21 ఏళ్ల క్రితమే గుర్తింపు కోసం ఛత్రపతిగా ప్రభాస్ పోరాటం

అయితే ప్రభాస్‌ మాత్రం ఈ కాన్సెప్ట్ తో 21ఏళ్ల క్రితమే సినిమా చేశాడు. అదే `ఛత్రపతి`. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. సముద్ర తీర ప్రాంతంలోని జాలర్లు గుర్తింపు లేక పెద్ద వ్యాపారి వద్ద పనిచేస్తుంటారు. వారి ఇచ్చింది తీసుకొని బతకాలి, లేదని ఎదురుతిరిగితే చంపేస్తారు. అది చిన్న పిల్లాడు అయినా, పెద్ద వాళ్లయినా, ఈ క్రమంలో ఛత్రపతిగా ప్రభాస్‌ తిరుగుబాటు చేస్తాడు. గుర్తింపు సాధిస్తాడు. తమ ఏరియాకి నాయకుడు అవుతాడు. అయితే ఇది పూర్తి కమర్షియల్‌ యాంగిల్‌లో, మదర్‌ సెంటిమెంట్‌తో రూపొందించారు రాజమౌళి. అది వర్కౌట్‌ అయ్యింది. 2005లో విడుదలై అప్పట్లోనే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇలా గుర్తింపు కోసం చేసిన సినిమాలు చాలా వరకు ఆదరణ పొందుతున్నాయని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అల్లు అర్జున్
రామ్ చరణ్ కొణిదెల
ప్రభాస్
నాని (నటుడు)
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthi Vs Vijay: చెప్పేదొకటి చేసేదొకటి.. విజయ్ ప్రభుత్వంపై కార్తీ ఫైర్, అభిమానుల రియాక్షన్ ఇదే
Recommended image2
Anasuya: జిమ్ లో మంటలు పుట్టిస్తున్న అనసూయ.. వర్కౌట్ లుక్ చూశారా, వైరల్ ఫోటోస్
Recommended image3
Auto Ram Prasad: బిగ్ బాస్ కే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆటో రామ్ ప్రసాద్, జబర్దస్త్ కమెడియన్ లో ఈ కోణం కూడా ఉందా?
Related Stories
Recommended image1
Krishnudu: బిగ్‌ బాస్‌ తెలుగు 10 విన్నర్‌ అతనే, తేల్చేసిన కృష్ణుడు.. అతనే ట్రోల్‌ చేయించడంటూ సంచలన కామెంట్‌
Recommended image2
Paradise Day 2 Collections: జోరు తగ్గినా నాని ర్యాంపేజ్‌.. రెండో రోజు ప్యారడైజ్‌ కలెక్షన్లు ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved