MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Paradise Day 2 Collections: జోరు తగ్గినా నాని ర్యాంపేజ్‌.. రెండో రోజు ప్యారడైజ్‌ కలెక్షన్లు ఎంతంటే?

Paradise Day 2 Collections: జోరు తగ్గినా నాని ర్యాంపేజ్‌.. రెండో రోజు ప్యారడైజ్‌ కలెక్షన్లు ఎంతంటే?

నాని నటించిన `ది ప్యారడైజ్‌` మూవీ మొదటి రోజు బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. కనీవినీ ఎరుగని కలెక్షన్లు వచ్చాయి. మరి రెండో రోజు ఎలా ఉంది? అదే జోరు కనిపించిందా? పడిపోయాయా? అనేది చూస్తే

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 26 2026, 09:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్యారడైజ్‌ మూవీ బాక్సాఫీసు రిపోర్ట్
Image Credit : Asianet News

ప్యారడైజ్‌ మూవీ బాక్సాఫీసు రిపోర్ట్

నాని హీరోగా నటించిన `ది ప్యారడైజ్‌` మూవీ బాక్సాఫీసు వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. మొదటి రోజు ఈ చిత్రానికి ఏకంగా రూ.88కోట్లు వచ్చినట్టు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. సాక్నిల్క్ వంటి ట్రేడ్‌ సైట్లు మాత్రం రూ.74కోట్లు రాబట్టినట్టు వెల్లడించాయి. నిజం ఏదైనా నాని బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించారని చెప్పొచ్చు. ఇది ఆయన కెరీర్‌లోనే హైయ్యెస్ట్ కావడం ఓ విశేషం అయితే, ఆయన గత చిత్రాల ఓపెనింగ్స్ కి డబుల్‌ ఓపెనింగ్‌ని ప్యారడైజ్‌ మూవీ రాబట్టడం మరో విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ది ప్యారడైజ్‌ సినిమా రెండు రోజుల కలెక్షన్లు
Image Credit : Asianet News

ది ప్యారడైజ్‌ సినిమా రెండు రోజుల కలెక్షన్లు

మరి `ది ప్యారడైజ్‌` మూవీ రెండో రోజు ఎంత రాబట్టింది? కలెక్షన్లు పెరిగాయా? తగ్గాయా? అనేది చూస్తే, రెండో రోజు ఈ చిత్రానికి ఇండియా నెట్‌ రూ.15(14.90)కోట్లు రావడం విశేషం. ఓవర్సీస్‌లో నాలుగు కోట్లు వచ్చాయి. ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రెండో రోజు దాదాపు రూ.24కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక రెండు రోజుల్లో ఇండియాలో ఇది రూ.72.50కోట్ల గ్రాస్‌ ని, ఓవర్సీస్‌లో 26కోట్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో ఈ మూవీ దుమ్మురేపుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో రికార్డు కలెక్షన్లని రాబడుతుండటం విశేషం.

35
రెండో రోజు తగ్గిన కలెక్షన్లు, అయినా ర్యాంపేజ్‌
Image Credit : Asianet News

రెండో రోజు తగ్గిన కలెక్షన్లు, అయినా ర్యాంపేజ్‌

అయితే మొదటి రోజుతో పోల్చితే ఈ చిత్రానికి సుమారు 57శాతం కలెక్షన్ల డ్రాప్‌ ఉంది. ప్రీమియర్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మొదటి రోజు ఆ స్థాయి కలెక్షన్లని వసూలు చేసిందని చెప్పొచ్చు. కానీ రెండో రోజు ఆ జోరు ఉండదు. అయినప్పటికీ ఈ మూవీకి సెకండ్‌ డే డీసెంట్‌ నెంబర్స్ రావడం విశేషం. కాకపోతే ఇదే స్థాయిలో కలెక్షన్లు స్టడీగా ఉంటే ఇది పెద్ద రేంజ్‌కి వెళ్తుందని చెప్పొచ్చు, తగ్గిపోతే మాత్రం పరాజయం దిశగా వెళ్లే ప్రమాదం ఉంది. ఈ సినిమాకి శనివారం, ఆదివారం కలెక్షన్లు చాలా ముఖ్యం. ఈ రెండు రోజుల్లో వచ్చే దాన్ని బట్టే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది.

45
ప్యారడైజ్‌ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌
Image Credit : Asianet News

ప్యారడైజ్‌ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌

ఇక ప్యారడైజ్‌ మూవీకి అయిన బడ్జెట్‌, నాన్‌ థియేట్రికల్‌ రైట్స్, థియేట్రికల్‌ రైట్స్, బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ ఎంతనేది చూస్తే, మూవీకి అయిన బడ్జెట్‌ ప్రమోషన్స్ తో కలుపుకొని రూ.150కోట్లు అని సమాచారం. నాన్‌ థియేట్రికల్‌ రైట్స్ రూపంలో దాదాపు రూ.80 నుంచి వంద కోట్లు వచ్చినట్టు సమాచారం. అందులో నెట్‌ ఫ్లిక్స్ సుమారు రూ.50కోట్లకి తీసుకుందట. ఆడియోరైట్స్ రూపంలో మరో రూ.15కోట్లు వచ్చిందని సమాచారం. శాటిలైట్‌ రూపంలో బాగానే వచ్చిందట. ఇక థియేట్రికల్‌ రైట్స్ సుమారు రూ.96కోట్లకు అమ్ముడు పోయాయట. వంద కోట్లకుపైగా బిజినెస్‌ జరిగిందని మరో ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ల టార్గెట్‌తో థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం దాదాపు 40శాతం మొదటిరోజే రాబట్టింది. రెండు రోజుల్లో రూ.50-60 శాతం రాబట్టింది. ఇంకా దాదాపు వంద కోట్ల వరకు రాబడితే మూవీ హిట్‌ ఖాతాలో పడుతుందని చెప్పొచ్చు. మరి ఏం చేస్తుందో చూడాలి.

55
ది ప్యారడైజ్‌ రిజల్ట్ పై నాని రియాక్షన్
Image Credit : Asianet News

ది ప్యారడైజ్‌ రిజల్ట్ పై నాని రియాక్షన్

నాని హీరోగా, శ్రీకాంత్‌ ఓడెల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కయాదు లోహర్‌ హీరోయిన్‌గా నటించింది. మోహన్‌బాబు, రాఘవ్‌ విలన్లుగా చేశారు. సంపూర్నేష్ బాబు, ఈశ్వరీరావు, సోనాలి కులకర్ణి, ప్రియదర్శి, సత్యరాజ్‌ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. ఈ మూవీపై బాగా ట్రోలింగ్‌ జరిగింది. సినిమా బాగా లేదంటూ చాలా మంది సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో నాని స్పందించారు. ప్రేమించిన వారికి, హేట్‌ చేసుకున్న వారికి థ్యాంక్స్ చెప్పారు. సినిమాకి వస్తోన్న స్పందన ఆనందంగా ఉందని, ట్రోల్స్ ని ఎంజాయ్‌ చేస్తున్నానని, తప్పులను నేర్చుకొని ముందుకు వెళ్తానని, ఇంతగా ప్రేమని చూపిస్తున్న ఆడియెన్స్ కి, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు నాని. నాని చాలా మెచ్యూర్డ్ గా తన రియాక్షన్‌ని చెప్పడం విశేషం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
నాని (నటుడు)
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: 'బాస్ తొక్కేశాడు' చిరంజీవి వరకు వెళ్లిందా..చేతికి మట్టంటకుండా సోషల్ మీడియాని కుదిపేసిన బాస్
Recommended image2
Savitri: జెమినీ గణేశన్ ఉండగానే సావిత్రి పక్కన కూర్చున్న ఏఎన్నార్, అన్నపూర్ణమ్మ చూసి ఏమన్నారంటే?
Recommended image3
Prabhas: ప్రభాస్ ముఖం మీదే అడిగేసి కళ్ళు తెరిపించిన కమెడియన్, మనసులో దాచుకుని మదనపడడం ఎందుకు
Related Stories
Recommended image1
Paradise Movie Review: ప్యారడైజ్‌ మూవీ రివ్యూ.. నాని విశ్వరూపం ఓకే.. కానీ అసలు సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Savitri: జెమినీ గణేశన్ ఉండగానే సావిత్రి పక్కన కూర్చున్న ఏఎన్నార్, అన్నపూర్ణమ్మ చూసి ఏమన్నారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved