MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Krishnudu: బిగ్‌ బాస్‌ తెలుగు 10 విన్నర్‌ అతనే, తేల్చేసిన కృష్ణుడు.. అతనే ట్రోల్‌ చేయించడంటూ సంచలన కామెంట్‌

Krishnudu: బిగ్‌ బాస్‌ తెలుగు 10 విన్నర్‌ అతనే, తేల్చేసిన కృష్ణుడు.. అతనే ట్రోల్‌ చేయించడంటూ సంచలన కామెంట్‌

నటుడు కృష్ణుడు ఇటీవలే బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌ నుంచి ఎలిమినట్‌ అయ్యారు. ఆయన ఈ సీజన్‌ విన్నర్‌ ఎవరో ప్రెడిక్ట్ చేశారు. టాప్‌ 5 కంటెస్టెంట్ల పేర్లు చెప్పారు. అలాగే ట్రోల్స్ పై రియాక్ట్ అయ్యారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 25 2026, 05:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రెండో వారంలోనే బిగ్‌ బాస్‌ 10 నుంచి ఎలిమినేట్‌ అయిన కృష్ణుడు
Image Credit : Asianet News

రెండో వారంలోనే బిగ్‌ బాస్‌ 10 నుంచి ఎలిమినేట్‌ అయిన కృష్ణుడు

నటుడు కృష్ణుడు బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన రెండు వారాల్లోనే హౌజ్‌ నుంచి బయటకు వచ్చాడు. హౌజ్‌లో తానేంటో చూపిస్తానని చెప్పిన ఆయన అనూహ్యంగా ఎలిమినేట్‌ అయ్యారు. అయితే హౌజ్‌లోకి వెళ్లిన ఆయన సరైన ఆట ఆడలేదు. కంటెంట్‌ ఇవ్వలేకపోయారు. దీంతో ఎలిమినేట్‌ కావాల్సి వచ్చింది. ఎలిమినేషన్‌ అనంతరం ఏసియానెట్‌తో మాట్లాడుతూ ఈ సీజన్‌ విన్నర్‌ ఎవరో తేల్చి చెప్పాడు. అలాగే టాప్‌ 5 కంటెస్టెంట్లు ఎవరనేది వెల్లడించారు. దీనికితోడు తనకి వ్యతిరేకంగా ట్రోల్స్ జరిగిన నేపథ్యంలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
త్రిగుణ్‌ ఈ సీజన్‌ విన్నర్‌
Image Credit : Asianet News

త్రిగుణ్‌ ఈ సీజన్‌ విన్నర్‌

కృష్ణుడు మాట్లాడుతూ, ఈ సీజన్‌లో బిగ్ బాస్‌ తెలుగు 10 విన్నర్‌ అయ్యే ఛాన్స్ త్రిగుణ్‌కి ఉందని చెప్పాడు. తన ఆటతీరు, తన అగ్రెషన్‌, ప్రవర్తన అన్నీ చూస్తే త్రిగుణ్‌ విన్నర్‌ అయ్యే ఛాన్స్ ఉందని ప్రిడిక్షన్‌ ఇచ్చాడు కృష్ణుడు. ఇక బిగ్‌ బాస్‌లో తనలోని మరో యాంగిల్‌ని చూపించాలనుకున్నాడట. వినాయకుడు సినిమాతో అంతా అమాయకుడు అనుకుంటున్నారని, తనలో ఇంకా చాలా యాంగిల్స్ ఉన్నాయి, ఫన్‌ యాంగిల్‌ కూడా ఉందని, ఫ్యామిలీ యాంగిల్‌ కూడా ఉందని ఇవన్నీ చూపించాలనుకున్నాను, కానీ అనుకోకుండా ఎలిమినేట్‌ అయ్యానని తెలిపారు. ఎలిమినేట్‌ కావడం పట్ల తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, తన తప్పిదం వల్లే ఎలిమినేట్‌ అయినట్టు చెప్పారు. ఫుడ్‌ విషయంలో, స్వీట్స్ విషయంలో ఇబ్బంది పడ్డానని, దీని కారణంగా హెడెక్‌ వచ్చేదని, ఆటపై ఫోకస్‌ పెట్టలేకపోయానని తెలిపారు.

34
ట్రోల్స్ పై కృష్ణుడు కౌంటర్‌.. చేయించింది అతనే
Image Credit : Asianet News

ట్రోల్స్ పై కృష్ణుడు కౌంటర్‌.. చేయించింది అతనే

బిగ్‌ బాస్‌ షోకి వెళితే స్వీట్స్ కంట్రోల్‌ చేయగలను అనుకున్నానని, కానీ చేయలేకపోయానని, ఒకేసారి తగ్గించడంతో ఏం చేయాలో అర్థం కాలేదన్నారు. అలాగే నిద్ర కూడా సరిగా లేదని, తనకు లైట్స్ ఉంటే నిద్ర రాదని, కానీ హౌజ్‌లో లైట్‌ ఉండటంతో నిద్ర పోయేవాడిని కాదని, ఆ ప్రభావంతో తలనొప్పితో బాధపడినట్టు చెప్పారు. దీన్నే అలుసుగా తీసుకొని తనని కొందరు ట్రోల్‌ చేశారని చెప్పారు. హౌజ్‌లో ఉన్న ఒక కంటెస్టెంట్‌ తనని టార్గెట్‌ చేయించాడని, తన పీఆర్‌ టీమ్‌తోనే ఇదంతా చేయించాడని, తనని బ్యాడ్‌ చేసే ప్రయత్నం చేశాడని, దారుణంగా కామెంట్లు పెట్టారని వెల్లడించారు. తాను అమాయకుడిని కాదని, తాను తలచుకుంటే వాళ్లని కూడా ట్రోల్‌ చేయగలను, కామెంట్లు పెట్టగలను అని తెలిపారు. వారిలా చిల్లరగా తాను బిహేవ్‌ చేయలేనని చెప్పారు.

44
బిగ్‌ బాస్‌ 10 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే
Image Credit : X/@Starmaa

బిగ్‌ బాస్‌ 10 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే

ఇక బిగ్‌ బాస్‌ తెలుగు 10లో దేబ్జానీ బాగా నచ్చిందని, అలాగే సింగర్‌ ఝాన్సీ కూడా ఆడేవారని. దేబ్జానీ తనని పాండాగా కామెంట్‌ చేసిందని, అభిమానంతోనే ఆమె అలా చెప్పిందని వెల్లడించారు. ఈ సీజన్‌ టాప్‌ 5 కంటెస్టెంట్లు ఎవరనేది చెబితే, త్రిగుణ్‌, రోహిత్‌, అమన్‌, ముఖేష్‌ గౌడ, ఝాన్సీ లకు ఛాన్స్ ఉంటుందని నమ్ముతున్నట్టు తెలిపారు. ఇక హౌజ్‌లో కొంత స్క్రిప్ట్ ఉంటుందని, దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుందని తెలిపారు. అయితే ఆర్టిస్ట్ లు కొందరు ఫేక్‌గా, స్క్రీప్టెడ్‌గా రియాక్ట్ అవుతారు, కంటెంట్‌ ఇవ్వడం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తారు అని తెలిపారు. బిగ్‌ బాస్‌ షోకి వెళ్లడం తనకు ప్లస్సే అని, అదొక కొత్త ఎక్స్ పీరియెన్స్ అని చెప్పాడు కృష్ణుడు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nani: ప్యారడైజ్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్.. నాని ఎమోషనల్ పోస్ట్
Recommended image2
ANR: నా బర్త్ డేకి చిరంజీవి సినిమా రిలీజ్ చేయొద్దు, అతడిని పట్టుకోవడం కష్టం.. ఏఎన్నార్ ఎందుకు అలా అన్నారు
Recommended image3
Anumana Pakshi Movie Review: అనుమాన పక్షి మూవీ రివ్యూ, రాగ్‌ మయూర్‌ ఇలా చేశాడేంటి?
Related Stories
Recommended image1
Anumana Pakshi Movie Review: అనుమాన పక్షి మూవీ రివ్యూ, రాగ్‌ మయూర్‌ ఇలా చేశాడేంటి?
Recommended image2
Paradise Day 1 Collections: బాక్సాఫీసుపై నాని దండయాత్ర.. ప్యారడైజ్‌ సినిమాకి ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved