MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Auto Ram Prasad: బిగ్ బాస్ కే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆటో రామ్ ప్రసాద్, జబర్దస్త్ కమెడియన్ లో ఈ కోణం కూడా ఉందా?

Auto Ram Prasad: బిగ్ బాస్ కే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆటో రామ్ ప్రసాద్, జబర్దస్త్ కమెడియన్ లో ఈ కోణం కూడా ఉందా?

Auto Ram Prasad: జబర్ధస్త్ నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లోకి అడుగు పెట్టాడు ఆటో రామ్ ప్రసాద్. ఎప్పుడు నవ్వుతూ, నవిస్తూ.. ఆటో పంచ్ లతో సందడి చేసే రామ్ ప్రసాద్.. ఒక్క సారిగా సీరియస్ అయ్యాడు. ఏకంగా బిగ్ బాస్ కే వార్నింగ్ ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 26 2026, 12:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అనుకోని మలుపులు తిరుగుతున్న బిగ్ బాస్ తెలుగు...
Image Credit : youtube/@starmaa

అనుకోని మలుపులు తిరుగుతున్న బిగ్ బాస్ తెలుగు...

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మలుపులతో దూసుకుపోతోంది. హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు, ఎమోషన్స్, గొడవలు, కంటెస్టెంట్ల మధ్య రగిలే ఘర్షణలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సీజన్ 10 ను అంతకు మించి అన్నట్టుగా డిజైన్ చేసింది టీమ్. ఎప్పుడు ఏ ట్విస్ట్ వస్తుందో తెలియక.. ఆడియన్స్ లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇక ఈ సీజన్ కంటెస్టెంట్స్ లో బుల్లితెరపై తన ఆటో పంచ్‌లతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ స్పెషల్ గా నిలిచాడు. ఈ సీజన్‌లో ఏడో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన రామ్ ప్రసాద్.. తన మార్క్ కామెడీ పంచ్ లతో అలరిస్తున్నాడు. అయితే ఎప్పుడూ నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ ఉండే రామ్ ప్రసాద్‌లో సరికొత్త, సీరియస్ కోణాన్ని బిగ్ బాస్ హౌస్ వేదికగా ప్రేక్షకులు చూశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కెప్టెన్సీ టాస్క్.. లెటర్స్ వివాదం
Image Credit : Asianet News

కెప్టెన్సీ టాస్క్.. లెటర్స్ వివాదం

బిగ్ బాస్ హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్ సెలక్షన్ ప్రక్రియ ఎప్పుడూ ఉత్కంఠభరితంగానే సాగుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా కంటెస్టెంట్లకు వారి కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన లేఖలను (లెటర్స్) అర్హత లేదా టాస్క్ నిబంధనల పేరుతో చింపేయడం, ముక్కలుగా చేయడం వంటి పనులు హౌస్‌మేట్స్‌ను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తుంటాయి. కుటుంబానికి దూరంగా బిగ్ బాస్ హౌస్‌లో ఉంటున్న ప్రతీ ఒక్కరికీ ఇంటి నుంచి వచ్చే ఒక చిన్న ఉత్తరం కూడా కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. అలాంటి లేఖలను నాశనం చేసే క్రమం కంటెస్టెంట్ల మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీసింది.

34
బిగ్ బాస్ కే వార్నింగ్ ఇచ్చిన ఆటో రామ్ ప్రసాద్..
Image Credit : Jiohotstar

బిగ్ బాస్ కే వార్నింగ్ ఇచ్చిన ఆటో రామ్ ప్రసాద్..

లెటర్లను ముక్కలు చేయడం చూసిన ఆటో రామ్ ప్రసాద్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు.. అప్పటి వరకూ హౌస్ లో నవ్వులు పూయించిన ఆయన, తనలోని సరికొత్త ఆవేశాన్ని బయటకు తీశారు. "ఇంటి నుంచి వచ్చిన ఉత్తరాలను ఇలా ముక్కలు చేయడం సరికాదు. ఒకవేళ రేపు పొద్దున కుటుంబ సభ్యుల ఫ్యామిలీ ఫోటోలు వస్తే, వాటిని కూడా ఇలాగే ముక్కలు చేస్తారా? అలా చేస్తే నేను ఏమాత్రం ఒప్పుకోను. అది ఎవరు చెప్పినా సరే.. బిగ్ బాస్‌ను అయినా సరే ఎదిరిస్తాను" అని చాలా సీరియస్‌గా హెచ్చరించారు. ఆట కోసం లేదా టాస్క్ కోసం కుటుంబం, వారి భావోద్వేగాలను పక్కనబెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే రామ్ ప్రసాద్ నోటి నుండి వచ్చిన ఈ వార్నింగ్ తో హౌస్‌లోని మిగతా కంటెస్టెంట్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

44
కమెడియన్‌లోని మరో కోణం.. నాగార్జున ఏమంటాడో?
Image Credit : Jiohotstar

కమెడియన్‌లోని మరో కోణం.. నాగార్జున ఏమంటాడో?

బిగ్ బాస్ షో అంటే కేవలం ఫిజికల్ టాస్క్‌లు, వ్యూహాలు మాత్రమే కాదు.. మనుషుల నిజమైన వ్యక్తిత్వాన్ని, వారి భావోద్వేగాలను బయటకు తీసే వేదిక. ఆటో రామ్ ప్రసాద్ ఇచ్చిన ఈ వార్నింగ్ ద్వారా ఆయన కుటుంబానికి, ఆత్మీయ అనుబంధాలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతోంది. కామెడీ స్కిట్లలో నవ్వించడమే కాకుండా, తన ఆత్మగౌరవానికి, ఫ్యామిలీ ఎమోషన్స్ కు భంగం కలిగితే బిగ్ బాస్ వంటి పెద్ద వ్యవస్థనైనా ప్రశ్నించే ధైర్యం ఆయనకు ఉందని నిరూపించాడు రామ్ ప్రసాద్. మరి రామ్ ప్రసాద్ చేసిన ఈ పనికి నాగార్జున ఏరకంగా స్పందిస్తాడు. వీకెండ్ ఎపిసోడ్ లో ఈ విషయంలో క్లారిటీ ఇస్తాడా? లేక వార్నింగ్ ఇస్తాడా అనేది చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dorathy Box Office: రూ.1 కోటి కూడా రాలేదా? కీర్తి సురేష్ మూవీకి ఘోర అవమానం.. ఎలా ట్రోల్ చేస్తున్నారో తెలుసా
Recommended image2
Paradise Day 2 Collections: జోరు తగ్గినా నాని ర్యాంపేజ్‌.. రెండో రోజు ప్యారడైజ్‌ కలెక్షన్లు ఎంతంటే?
Recommended image3
Chiranjeevi: 'బాస్ తొక్కేశాడు' చిరంజీవి వరకు వెళ్లిందా..చేతికి మట్టంటకుండా సోషల్ మీడియాని కుదిపేసిన బాస్
Related Stories
Recommended image1
Savitri: జెమినీ గణేశన్ ఉండగానే సావిత్రి పక్కన కూర్చున్న ఏఎన్నార్, అన్నపూర్ణమ్మ చూసి ఏమన్నారంటే?
Recommended image2
Naa Anveshana: నేనొక వెధవ, పోరంబోకుని.. అయినా కోటీశ్వరుడుని ఎలా అయ్యానంటే? అన్వేష్ చెప్పిన సక్సెస్ సీక్రెట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved