- Home
- Entertainment
- అల్లు అర్జున్ కి పిచ్చ పిచ్చగా నచ్చేసిన 'లిటిల్ హార్ట్స్' మూవీ.. మౌళి తనూజ్, శివానీపై ప్రశంసల వర్షం
అల్లు అర్జున్ కి పిచ్చ పిచ్చగా నచ్చేసిన 'లిటిల్ హార్ట్స్' మూవీ.. మౌళి తనూజ్, శివానీపై ప్రశంసల వర్షం
Allu Arjun : అల్లు అర్జున్ లిటిల్ హార్ట్స్ సినిమాను ఫ్రెష్ లవ్ స్టోరీగా, ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను అలరించిందని ప్రశంసించారు. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించిన మౌళి తనూజ్, శివానీ నాగారం లపై కూడా బన్నీ ప్రత్యేక ప్రశంసలు కురిపించారు.

దూసుకుపోతున్న లిటిల్ హార్ట్స్ మూవీ
మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన "లిటిల్ హార్ట్స్" సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో పాటు సెలబ్రిటీల ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ "లిటిల్ హార్ట్స్" సినిమా చూసి ఫ్రెష్ లవ్ స్టోరీ, ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో ఆకట్టుకుందని ప్రశంసించారు.
సినిమా చూసిన అల్లు అర్జున్, ప్రశంసల వర్షం
అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ - లిటిల్ హార్ట్స్ సినిమా చూశాను. ఎలాంటి మెలొడ్రామా, సందేశాలు లేకుండా బాగా నవ్వించింది. ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఉన్న ఫ్రెష్ లవ్ స్టోరీతో ఆకట్టుకుంది. మౌళి, శివానీ తమ పర్ ఫార్మెన్స్ తో మెప్పించారు. ఇతర నటీనటులంతా బాగా నటించారు.
బన్నీ వాస్ కి అభినందనలు
సాయి మార్తాండ్ దర్శకత్వ ప్రతిభ నాకెంతో నచ్చింది. సింజిత్ మ్యూజిక్ రిఫ్రెషింగ్ గా అనిపించింది. లిటిల్ హార్ట్స్ లాంటి స్పెషల్ ఫిల్మ్ ను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్ కు నా అభినందనలు. అని ట్వీట్ చేశారు.
Watched #LittleHearts yesterday… What a funnn & laughter ride! No melodrama, no gyan… just full entertainment. A very fresh, young love story. A blast by the lead @mouli_talks, a sweet presence by @shivani_nagaram, and candid performances by friends & other artists. Loved the… pic.twitter.com/0ycrtuD4tg
— Allu Arjun (@alluarjun) September 11, 2025
తొలి షో నుంచే పాజిటివ్ టాక్
"లిటిల్ హార్ట్స్" చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేట్రికల్ గా రిలీజ్ చేశారు. తొలి షో నుంచే లిటిల్ హార్ట్స్ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
నాని, రవితేజ ప్రశంసలు
అల్లు అర్జున్ మాత్రమే కాదు.. నాని, రవితేజ లాంటి హీరోలు కూడా లిటిల్ హార్ట్స్ మూవీపై ప్రశంసలు కురిపించారు. హాస్యం, హృదయాన్ని హత్తుకునే సీన్స్, నిజాయతీతో కూడిన పెర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కటీ లిటిల్ హార్ట్స్ మూవీలో ది బెస్ట్ అనిపించేలా ఉన్నాయి అని రవితేజ ప్రశంసించారు.