MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Shanmukh Jaswanth: లవ్‌ మీద హోప్స్ పోయాయి, ఘోరంగా ఏడ్చేశా.. బ్రేకప్‌పై ఫస్ట్ టైమ్‌ రియాక్ట్ అయిన షణ్ముఖ్‌ జస్వంత్‌

Shanmukh Jaswanth: లవ్‌ మీద హోప్స్ పోయాయి, ఘోరంగా ఏడ్చేశా.. బ్రేకప్‌పై ఫస్ట్ టైమ్‌ రియాక్ట్ అయిన షణ్ముఖ్‌ జస్వంత్‌

బిగ్‌ బాస్‌ ఫేమ్‌, యూట్యూబర్‌, నటుడు షణ్ముఖ్‌ జస్వంత్‌ తాజాగా మొదటిసారి తన లవ్‌ బ్రేకప్‌ పై స్పందించాడు. ఆ సమయంలో బాగా ఏడ్చేశానని, ప్రేమలో హోప్ప్ పోయాయని తెలిపాడు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 08 2026, 09:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయిన షణ్ముఖ్‌ జస్వంత్‌
Image Credit : Youtube/@ShanmukhJaswanth

బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయిన షణ్ముఖ్‌ జస్వంత్‌

షణ్ముఖ్ జస్వంత్‌.. బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయిన నటుడు. అంతకు ముందు యూట్యూబర్‌గా చాలా పాపులర్‌. తన వెబ్‌ సిరీస్‌, షార్ట్ ఫిల్మ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. డాన్స్‌ వీడియోలతో విశేషంగా ఆకట్టుకున్నాడు. దీంతో ఆయనకు సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. ఈ క్రమంలో తనకు బిగ్‌ బాస్‌ తెలుగు 5 షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ షో ఆయన్ని చాలా రకాలుగా మార్చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బిగ్‌ బాస్‌ షో తర్వాత దీప్తి సునైనాతో బ్రేకప్‌
Image Credit : Youtube/@ShanmukhJaswanth

బిగ్‌ బాస్‌ షో తర్వాత దీప్తి సునైనాతో బ్రేకప్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 5లో పాల్గొన్న తర్వాత ఆయన వ్యక్తత్వానికి సంబంధించిన కామెంట్లు వచ్చాయి. విన్నర్‌ కావాల్సిన వాడు రన్నరప్‌గా మిగిలాడు. అనంతరం ఆయన ప్రియురాలు బ్రేకప్‌ చెప్పింది. షణ్ముఖ్‌, దీప్తి సునైనా ప్రేమలో ఉన్నారు. చాలా ఏళ్లు ప్రేమించుకున్నారు. బిగ్‌ బాస్‌ షో తర్వాత ఆయనకు గుడ్‌ బై చెప్పింది దీప్తి. ఆ సమయంలో ఇద్దరూ సోషల్‌ మీడియాలో పోస్ట్ లతో తమ బాధని వ్యక్తం చేసుకున్నారు. ముఖ్యంగా దీప్తి తన ఆవేదన వ్యక్తం చేసింది. కానీ షణ్ముఖ్‌ పెద్దగా ఓపెన్‌ కాలేదు.

35
బ్రేకప్‌పై తొలిసారి స్పందించిన షణ్ముఖ్‌
Image Credit : Youtube/@ShanmukhJaswanth

బ్రేకప్‌పై తొలిసారి స్పందించిన షణ్ముఖ్‌

ఈ క్రమంలో తాజాగా షణ్ముఖ్‌ జస్వంత్‌ ఓపెన్‌ అయ్యారు. ఆయన యూట్యూబ్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలుగు కనెక్ట్స్ కి ఇచ్చిన బ్రాడ్‌ కాస్ట్ లో షణ్ముఖ్‌ జస్వంత్‌ మొదటిసారి తన బ్రేకప్‌పై స్పందించారు. తన జీవితంలో హై, లో చాలా చూశానని తెలిపారు. తాను బేసిక్‌గా ఎమోషనల్‌ అని, బ్రేకప్‌ సమయంలో ఘోరంగా ఏడ్చేశానని తెలిపారు.  ఏం చేయాలో అర్థం కాలేదని, పెడితే పోస్ట్ లు, లేదంటే కన్నీళ్లు ఇలానే సాగిపోయిందని చెప్పారు షణ్ముఖ్‌. తాను బాధపడ్డాను, తన లాగే అవతలి వ్యక్తి కూడా బాధపడుతుందని గ్రహించాను, ఆ తర్వాత కంట్రోల్‌ చేసుకున్నట్టు చెప్పారు.

45
ప్రేమపై ఆశలు పోయాయి
Image Credit : Youtube/@ShanmukhJaswanth

ప్రేమపై ఆశలు పోయాయి

ఆ సమయంలో తాను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని, ఒత్తిడి తీసుకురాలేదని, వారి ఆలోచనలకు, నిర్ణయాలకు రెస్పెక్ట్ ఇచ్చి సైలెంట్‌గా ఉన్నట్టు తెలిపారు షణ్ముఖ్‌ జస్వంత్‌. అయితే ఓ దశలో ప్రేమపై తన ఆశలు పోయాయని, ఇక ప్రేమ అనే జోలికి వెళ్లకూడదని అనుకున్నట్టు తెలిపారు. అలాంటి సమయంలో మరో ప్రేమ తన లైఫ్‌లోకి వచ్చిందని, ఆ తర్వాత తన లైఫ్‌ చాలా మారిపోయిందని తెలిపాడు. షణ్ముఖ్‌ ఇటీవల వైష్ణవీ చోటిశెట్టితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. ఆయా ఫోటోలను పంచుకుంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.

55
వైష్ణవీ వచ్చాక నా జీవితమే మారిపోయింది- షణ్ముఖ్‌జస్వంత్‌
Image Credit : Youtube/@ShanmukhJaswanth

వైష్ణవీ వచ్చాక నా జీవితమే మారిపోయింది- షణ్ముఖ్‌జస్వంత్‌

వైష్ణవీ తన జీవితంలోకి వచ్చాక తన ఆలోచన విధానం చాలా మారిపోయిందన్నారు. చాలా ఓపెన్‌ అయినట్టు తెలిపారు. ఏదైనా ఫ్రీగా పంచుకోగలుగుతున్నట్టు వెల్లడించారు. అదే సమయంలో మొదటి ప్రేమకి గుర్తుగా డీ అనే గుర్తుని టాటూ వేయించుకున్నారు షణ్ముఖ్‌. అయితే దాన్ని తాను తొలగించలేదు. దీనిపై ఆయన స్పందిస్తూ, `పెళ్లి తర్వాతగానీ, లేదంటే ముందుగానే తీసేయాలనుకున్నా. కానీ ఈ విషయాన్ని వైష్ణవీకి చెప్పినప్పుడు ఆమె రియాక్షన్‌ వాహ్‌ అనిపించింది. అది నీకు మెమొరీ, ఉంచుకోవాలా? తీసుకోవాలా పూర్తిగా నీ ఇష్టం. దానికి నేను అభ్యంతరం తెలపను` అని తెలిపింది. దీంతో నేను షాక్‌ అయ్యాను. ఇలా కూడా అర్థం చేసుకుంటారా? అనిపించింది. జీవితానికి సంబంధించి నన్ను చాలా మార్చేసింది. సింపుల్‌ లైఫ్‌, ఇతరులకు హెల్ప్ చేయడం వంటి విషయాల్లో నాలో చాలా మార్పు తెచ్చింది` అని తెలిపారు షణ్ముఖ్‌. అదే సమయంలో జీవితంలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నట్టువెల్లడించాడు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Related Stories
Recommended image1
Rashmi Gautam: యాంకర్‌ రష్మి మొదటి సంపాదన ఎంతో తెలుసా? ఆమె క్రియేటివిటీకి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే
Recommended image2
Krishnam Raju: స్టార్‌ డైరెక్టర్‌ ఫ్యామిలీకి 3000 ఎకరాలు రాసిచ్చిన కృష్ణంరాజు తాత.. కారణం తెలిస్తే ఫ్యూజులు ఔట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved