MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్ హైదరాబాద్ కు బైబై చెప్పబోతున్నాడా? బన్ని ఫ్యామిలీతో ఎక్కడికి షిఫ్ట్ అవ్వబోతున్నాడు? నిజమెంత?

అల్లు అర్జున్ హైదరాబాద్ కు బైబై చెప్పబోతున్నాడా? బన్ని ఫ్యామిలీతో ఎక్కడికి షిఫ్ట్ అవ్వబోతున్నాడు? నిజమెంత?

అల్లు అర్జున్ హైదరాబాద్ ను వీడబోతున్నాడా? పాన్ ఇండియా ఇమేజ్ తో పాటు.. బాలీవుడ్ ఆఫర్లు కూడా వరుసగా వస్తుండటంతో బన్ని మకాం మార్చబోతున్నాడా? ఐకాన్ స్టార్ ఫ్యామిలీతో ఎక్కడికి షిప్ట్ అవ్వబోతున్నాడు? నిజమెంత..? 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 21 2026, 08:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
అల్లు అర్జున్ తో సినిమా అంటే 1000 కోట్లు ఉండాల్సిందే..?
Image Credit : youtube/unstoppable with nbk

అల్లు అర్జున్ తో సినిమా అంటే 1000 కోట్లు ఉండాల్సిందే..?

ప్రస్తుతం అల్లు అర్జున్ రేంజ్ వేరు. బన్నితో సినిమా అంటే బడ్జెట్ 1000 కోట్లు ఉండాల్సిందే.. సబ్జెక్ట్ పాన్ ఇండియాదై ఉండాల్సిందే. ఆ రేంజ్ ప్రొడ్యూసర్లు అయితేనే ఆయన ఇమేజ్ ను తట్టుకోగలరు. లాభాలు కూడా అంతే మూటగట్టుకుంటారు. ఇక పుష్ప రెండు సినిమాలతో బన్ని రేంజ్ మారిపోయింది. అల్లు అర్జున్ కోసం బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ రాకా మూవీ చేస్తున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
తమిళ్, హిందీపై బన్ని ఫోకస్..
Image Credit : Asianet News

తమిళ్, హిందీపై బన్ని ఫోకస్..

ఈసినిమా తరువాత లోకేష్ కనకరాజ్ తో మరో భారీ మూవీని బన్నీ సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నాడు. ఈమధ్యలోనే బన్ని.. సంజయ్ లీలా బన్సాలితో ఓ మూవీ చేస్తాడన్న టాక్ వినిపిస్తోంది. దాంతో అల్లు అర్జున్.. కొన్నేళ్లు.. టాలీవుడ్ మూవీస్ కాకుండా.. బయట మూవీస్ చేయబోతున్నట్టు అర్ధం అవుతోంది. దాంతో తన మాకాం కూడా హైదరాబాద్ నుంచి మార్చబోతున్నారట.

37
హైదరాబాద్ కు బన్ని బైబై చెప్పబోతున్నాడా?
Image Credit : youtube/@aha

హైదరాబాద్ కు బన్ని బైబై చెప్పబోతున్నాడా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇకపై హైదరాబాద్‌లో కనిపించరనే వార్తలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. సమాచారం ప్రకారం, అల్లు అర్జున్ హైదరాబాద్ నుంచి పూర్తిగా ముంబైకి షిప్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆయనను కలవాలంటే ముంబైకి వెళ్లాల్సిందే అని అంటున్నారు. ప్రతి సంవత్సరం అల్లు అర్జున్ బర్త్ డేకి అభిమానులు హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి చేరుకుని శుభాకాంక్షలు తెలియజేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. అయితే ఆయన ముంబైకి పూర్తిగా షిఫ్ట్ అయితే ఈ సంప్రదాయం మారే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

47
ముంబయ్ లో ఐకాన్ స్టార్ ఇల్లు కొన్నాడా?
Image Credit : Asianet News

ముంబయ్ లో ఐకాన్ స్టార్ ఇల్లు కొన్నాడా?

ఇప్పటికే రాకా షూటింగ్ కోసం.. ఎక్కువగా ముంబయ్ లోనే ఉంటున్నాడు అల్లు అర్జున్. అక్కడ ప్లాట్ కూడా తీసుకున్నట్టు సమాచారం. ఇక వరుసగా బన్ని బాలీవుడ్ ప్రాజెక్టులు చేసే ఆలోచనలో ఉన్నాడని.. అందుకే పూర్తిగా ముంబయ్ కి మారే ఆలోచనలో అల్లు అర్జున్ ఉన్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో బాలీవుడ్ స్టార్స్ అంతా సౌత్ వైపు చూస్తుంటే.. అల్లు అర్జున్ బాలీవుడ్ వెళ్లి ఏం చేస్తారనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.

57
ముంబయ్ నుంచే చక్రం తిప్పబోతున్న అల్లు అర్జున్..
Image Credit : Asianet News

ముంబయ్ నుంచే చక్రం తిప్పబోతున్న అల్లు అర్జున్..

ముంబైపై అల్లు అర్జున్‌కు మొదటి నుంచే ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి వాతావరణం, జీవనశైలి ఆయనకు నచ్చిన కారణంగా ఎప్పటికైనా అక్కడ స్థిరపడాలనే లక్ష్యం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య స్నేహా రెడ్డి, పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హ కూడా ముంబైకి వెళ్లనున్నారని సమాచారం. రాకా మూవీ తరువాత దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో అల్లు అర్జున్ మరో ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఎక్కువ భాగం ముంబై పరిసరాల్లోనే జరగనున్నట్లు తెలుస్తోంది. 

67
బాలీవుడ్ డైరెక్టర్ తో బన్ని..
Image Credit : Asianet News

బాలీవుడ్ డైరెక్టర్ తో బన్ని..

అదేవిధంగా, బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో కూడా అల్లు అర్జున్ సినిమా చేస్తే.. అక్కడే ఉండాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కూడా ముంబైలోనే జరగనుంది కాబట్టి.. ఫ్యామిలీతో అక్కడికే వెళ్లాలని ఆయన నిర్ణించుకున్నారని టాక్. మరి ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ.. సోషల్ మీడియా మాత్రం కోడై కూస్తోంది.

77
రాకా లుక్ తో రచ్చ రచ్చ చేసిన బన్ని..
Image Credit : Asianet News

రాకా లుక్ తో రచ్చ రచ్చ చేసిన బన్ని..

ఈమధ్య అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అట్లీ మూవీ నుంచి రాకా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రివీల్ చేస్తూ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఫస్ట్ లుక్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఊహకి అందని విధంగా ఉంది. ఫస్ట్ లుక్ లో బన్నీ వింత జంతువు తరహాలో కనిపించాడు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ చాలా డెడికేషన్ తో పనిచేస్తున్నాడు. 

స్టైలిష్ స్టార్ గా గుర్తింపు పొందిన బన్నీ ఆ పేరుకు పూర్తి భిన్నంగా ఫస్ట్ లుక్ లో బట్టతల, భయంకరమైన చేతులు, గోర్లతో కనిపించాడు. రాకా మూవీ స్పేస్ సైన్స్, ఫిక్షనల్ అంశాలతో రూపొందుతోంది అని గతంలో వార్తలు వచ్చాయి. అంటే బన్నీ ఈ మూవీలో ఏలియన్ తరహా పాత్ర పోషిస్తున్నాడా అనే అనుమానాలు మొదలయ్యాయి. మొత్తానికి ఫస్ట్ లుక్ తో అందరిలో క్యూరియాసిటీ మరింతగా పెంచాడు అల్లు అర్జున్.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
krishna: చార్లీ చాప్లిన్ గెటప్ వేయమంటే సూపర్ స్టార్ కృష్ణ ఏమన్నారో తెలుసా? షాక్ అయిన దర్శకుడు.. అస్సలు ఊహించలేదు..
Recommended image2
Irumudi 27 Days Collections: థియేటర్లో రవితేజ మాస్‌ జాతర.. 27వ రోజూ ఇరుముడికి సంచలన వసూళ్లు.. ఇక ఓటీటీ వంతు
Recommended image3
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Related Stories
Recommended image1
Allu Arjun పాట క్రియేట్ చేసిన రికార్డును బద్దలు కొట్టడం ఏ స్టార్ హీరో వల్ల కాదేమో
Recommended image2
700 కోట్ల ఆస్తి.. 20 కోట్లకు పైగా బంగారం..ఫారెన్ లో ఇళ్లు.. బిందాస్ గా బ్రతుకుతున్న ఇండియన్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved