MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Allu Arjun పాట క్రియేట్ చేసిన రికార్డును బద్దలు కొట్టడం ఏ స్టార్ హీరో వల్ల కాదేమో

Allu Arjun పాట క్రియేట్ చేసిన రికార్డును బద్దలు కొట్టడం ఏ స్టార్ హీరో వల్ల కాదేమో

Allu Arjun: ఆరేళ్ల క్రితం రిలీజ్ అయిన అల్లు అర్జున్ సాంగ్ ఒకటి టాలీవుడ్ ను ఇప్పటికీ ఊపేస్తోంది. అరుదైన రికార్డును సాధించి హడావిడి చేస్తోంది. తెలుగులో మరే హీరో సాధించలేని సరికొత్త ఘనతను బన్నీ ఈ సినిమాతో సాధించాడు. ఇంతకీ ఏంటా సాంగ్?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 15 2026, 09:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అల్లు అర్జున్ అరుదైన రికార్డు..
Image Credit : Asianet News

అల్లు అర్జున్ అరుదైన రికార్డు..

ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నాడు అల్లు అర్జున్.. పుష్ప రెండు సినిమాలతో జాతీయ స్థాయిలో తానేంటో నిరూపించుకున్న ఈ హీరో.. నార్త్ లో కూడా తిరుగులేని ఇమేజ్ ను సాధించాడు. ప్రస్తుతం బన్నీ రేంజ్ వేరు.. భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల లైన్ అప్ తో.. ఐకాన్ స్టార్ డేట్స్ ఫుల్ అయిపోయాయి. 

వరుసగా 1000 కోట్ల సినిమాలతో బన్నీ బిజీ బిజీగా ఉన్నాడు. ఈక్రమంలో ఆరేళ్ల క్రితం రిలీజ్ అయిన అల్లు అర్జున్ తెలుగు సాంగ్ ఒకటి.. అరుదైన రికార్డును బ్రేక్ చేసింది. కలెక్షన్స్ విషయంలో ఇప్పటికే ఏ తెలుగు హీరో సాధించలేని ఘనత సాధించిన అల్లు హీరో.. ఈ సాంగ్ విషయంలో కూడా అదే మ్యాజిక్ ను రిపిట్ చేశాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
100 కోట్ల ఫ్యూస్ కు దగ్గరలో అల్లు అర్జున్ సాంగ్..
Image Credit : our own

100 కోట్ల ఫ్యూస్ కు దగ్గరలో అల్లు అర్జున్ సాంగ్..

ఈమధ్య యూట్యూబ్ లో పాటల హవా పెరిగిపోయింది. పోటా పోటీగా తెలుగు పాటలు సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి. కోట్లలో వ్యూస్, లక్షల్లో లైక్స్ తో.. యూట్యబ్ ను షేక్ చేస్తున్న పాటలు చాలా ఉన్నాయి. అందులో 100 కోట్ల వ్యూస్ కు అతి దగ్గరలో అల వైకుంఠపురములో మూవీలోని బుట్టబొమ్మ సాంగ్. 

అల్లు అర్జున్ స్టైలీష్ లుక్స్, డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్... బన్నీ మార్క్ హుక్ స్టెప్స్ మెలోడీ ట్యూన్ తో మెస్మరైజ్ చేసిన బుట్ట బొమ్మ పాట తెలుగులో రికార్డులను బ్రేక్ చేసి దూసుకుపోతోంది. ఈ సాంగ్ 93 (938 మిలియన్‌ వ్యూస్‌) కోట్లకు పైగా వ్యూస్‌ని సాధించి సరికొత్త రికార్డు ను క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లో ఇంత వరకూ ఏ తెలుగు సినిమా పాట సాధించలేని అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

35
బుట్ట బొమ్మ పాటకు సోషల్ మీడియా క్రేజ్..
Image Credit : Asianet News

బుట్ట బొమ్మ పాటకు సోషల్ మీడియా క్రేజ్..

తమన్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిన ఈ పాటకు ఆర్మాన్ మాలిక్ అద్భుతమైన గాత్రంతో ప్రాణం పోశాడు. యూత్ కు బాగా కనెక్ట్ అయ్యేలా రామజోగయ్య శాస్త్రీ రాసిన లిరిక్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకూ.. అందరు హమ్ చేసుకునేంత సులువగా ఉండటంతో.. అప్పట్లో ప్రతీ ఒక్కరి నోటా ఈ పాటే వినిపించింది. ఇక అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా జానీ మాస్టర్ అందించిన కొరియోగ్రాఫీ పాటకే హైలెట్ అయ్యింది. 

ఇక ఈ పాటలో అల్లు అర్జున్ హుక్ స్టెప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటలో నిజంగా బుట్ట బొమ్మలా కనిపించింది పూజా హెగ్డే. ఈ సినిమా నుంచి ఆమె పేరు పక్కన్న బుట్ట బొమ్మ ట్యాక్ కూడా పెట్టడం స్టార్ట్ చేశారు. ఇక బ్యాక్ గ్రౌండ్ సెట్ తో పాటు.. కాస్ట్య్యూమ్స్, మేకప్, ఇలా చిన్నా పెద్ద విషయాలన్నీ ఈ పాట సక్సెస్ లో భాగం అయ్యాయి.

45
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాట..
Image Credit : youtube/@adityamusic

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పాట..

అల వైకుంఠపురములో సినిమాలో ఉన్న పాటలన్ని అద్భుతంగా ఉంటాయి.. కానీ ఈ పాట మాత్రం చాలా స్పెషల్ గా నిలిచింది. రిలీజ్ అయిన వెంటనే ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందనను అందుకుంది. సోషల్ మీడియాలో ఈ పాట ఎంత వైరల్ అయ్యిందంటే.. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో లక్షలాది మంది ఈ స్టెప్స్‌ను రీక్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో బుట్టబొమ్మ పాట ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అన్ని దేశాల్లో తెలుగువారు, ఫారెనర్స్ కూడా ఈ పాటకు రీల్స్ చేశారు. హుక్ స్టెప్ తో స్పెషల్ వీడియోలు కూడా చేశారు. దాంతో ఈ పాటకు అంతకంతకు వ్యూస్ పెరుగుతూ వచ్చాయి.

55
100 కోట్ల వ్యూస్ కు దగ్గరగా..
Image Credit : Youtube

100 కోట్ల వ్యూస్ కు దగ్గరగా..

ఈ పాట విజయం వెనుక అందరి కృషి ఉంది. అద్భుతమైన సంగీతం, ఆకట్టుకునే లిరిక్స్, స్టైలిష్ డ్యాన్స్, విజువల్ గ్రాండియర్ ఇలా అన్నీ కలిసి బుట్టబొమ్మ పాటని ఒక క్లాసిక్ హిట్‌గా నిలబెట్టాయి. ప్రస్తుతం 93 కోట్ల ( 938 మిలియన్‌ వ్యూస్‌) వ్యూస్ తో ఉన్న ఈ పాట త్వరలోనే 100 కోట్ల వ్యూస్ మార్క్ ను దాటుతుందని అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగు సినీ సంగీత చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే సాంగ్ అవుతుందని ఐకాన్ స్టార్ అభిమానులు ఆశిస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Related Stories
Recommended image1
Mangli Controversies : మంగ్లీని చుట్టు ముట్టిన వివాదాలు, స్టార్ సింగర్ ను టెన్షన్ పెట్టిన కాంట్రవర్సీలు ఇవే..
Recommended image2
రామ్ పోతినేని కి పెళ్లంటే ఇష్టం లేదా..? బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడా? మ్యారేజ్ పై ఎనర్జిటిక్ స్టార్‌ కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved