- Home
- Entertainment
- చిరంజీవితో సినిమా చేయమని స్టార్ హీరో తండ్రిని రిక్వస్ట్ చేసిన అల్లు అరవింద్.. కానీ అంతలోనే..
చిరంజీవితో సినిమా చేయమని స్టార్ హీరో తండ్రిని రిక్వస్ట్ చేసిన అల్లు అరవింద్.. కానీ అంతలోనే..
చిరంజీవితో సినిమా చేయమని ఓ స్టార్ హీరో తండ్రిని అల్లు అరవింద్ రిక్వస్ట్ చేశారట. కానీ వారి కలయికలో సినిమా రాలేదు. దాని వెనుక ఉన్న విషాదం గురించి అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అల్లు అరవింద్ కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఎన్నో చిత్రాల్లో నటించారు. తన బావమరిది అల్లు అరవింద్ నిర్మాణంలో చిరంజీవి నటించారు. అప్పట్లో చాలా మంది అగ్ర దర్శకులు చిరంజీవితో సినిమా చేయాలని ప్రయత్నించేవారు. అల్లు అరవింద్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆసక్తికర విషయం రివీల్ చేశారు.
హీరో గోపీచంద్ తండ్రి
హీరో గోపీచంద్ తండ్రి టి కృష్ణ అప్పట్లో విప్లవాత్మక చిత్రాలు రూపొందించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్. విజయశాంతితో ఆయన ఎక్కువ చిత్రాలు తెరకెక్కించారు. ప్రతిఘటన, నేటి భారతం, వందే మాతరం లాంటి అద్భుతమైన చిత్రాలని టి కృష్ణ రూపొందించారు. విజయశాంతికి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల హీరోయిన్ గా గుర్తింపు వచ్చిందంటే అందుకు కారణం టి కృష్ణ అనే చెప్పాలి.
ప్రతిఘటన చూడగానే వెళ్లి కలిశా
అల్లు అరవింద్ ఓ కార్యక్రమంలో హీరో గోపీచంద్ గురించి మాట్లాడుతూ ఆయన తండ్రి టి కృష్ణ గురించి ప్రస్తావించారు. ప్రతిఘటన మూవీ చూసిన వెంటనే నాకు టి కృష్ణ గారిని కలవాలని అనిపించింది. వెంటనే వెళ్లి మీట్ అయ్యాను. మీరు మా బ్యానర్ లో చిరంజీవి హీరోగా సినిమా చేయాలి అని రిక్వస్ట్ చేశాను.
అంతలోనే విషాదం
ఆయన కూడా అంగీకారం తెలిపారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల టి కృష్ణ గారు మన మధ్య లేకుండా పోయారు. ఆ విధంగా గోపీచంద్ తండ్రి గారితో సినిమా చేసే అవకాశం కోల్పోయాము అని అల్లు అరవింద్ అన్నారు. టి కృష్ణ అనారోగ్యం కారణంగా అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే.
గోపీచంద్ తో సినిమా చేసే ఛాన్స్
కానీ మా బ్యానర్ లో గోపీచంద్ తో సినిమా చేసే అవకాశం దక్కింది అని అల్లు అరవింద్ అన్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో గోపీచంద్ పక్కా కమర్షియల్ అనే చిత్రంలో నటించారు. ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.