అటు తిరిగి ఇటు తిరిగి ప్రభాస్ మెడకు వివాదం.. దీపికా ఎగ్జిట్ కి కారణం ఎవరు ?
ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ నటించాల్సిన స్పిరిట్, కల్కి 2 చిత్రాల నుంచి దీపికా పదుకొణె తప్పుకోవడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఈ వివాదంలో ప్రభాస్ పేరు తెరపైకి వచ్చింది.

ప్రభాస్ వరుస చిత్రాలు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఊహించని విధంగా ఇటీవల వార్తల్లో నిలిచారు. ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ, రాజా సాబ్ చిత్రాల్లో నటిస్తున్నారు. త్వరలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ ప్రారంభం కావలసి ఉంది. ఆ తర్వాత కల్కి చిత్రానికి సీక్వెల్ కల్కి 2 కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఈ రెండు చిత్రాలలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించాల్సింది.
దీపికా పదుకొణె వివాదం
కానీ దీపికా రెండు చిత్రాల నుంచి తప్పుకోవడం సంచలనంగా మారింది. ముందుగా స్పిరిట్ చిత్రం నుంచి తప్పుకుంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. రీసెంట్ గా వైజయంతి మూవీస్ సంస్థ కూడా దీపికా కల్కి 2 చిత్రంలో నటించడం లేదని అధికారికంగా ప్రకటించింది. దీపికా రెమ్యునరేషన్, ఆమె పెట్టిన డిమాండ్ల విషయంలో విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి.
అటు తిరిగి ఇటు తిరిగి ప్రభాస్ మెడకు..
ఇప్పుడు ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి ప్రభాస్ మెడకు చుట్టుకున్నట్లు తెలుస్తోంది. స్పిరిట్ , కల్కి 2 రెండు చిత్రాల నుంచి దీపికా తప్పుకోవడం వెనుక ప్రభాస్ హస్తం ఉందంటూ రూమర్స్ వస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు ప్రభాస్ వే. ప్రభాస్ ప్రమేయం లేకుండా ఏమీ జరగదు అనే రూమర్స్ వస్తున్నాయి.
క్లారిటీ ఇదే
ప్రభాస్ ని కార్నర్ చేస్తూ రూమర్స్ వస్తుండడంతో ఆయన టీం స్పందించినట్లు తెలుస్తోంది. స్పిరిట్, కల్కి 2 చిత్రాల నుంచి దీపికా తప్పుకోవడానికి.. ప్రభాస్ కి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
అది నిర్మాతలు, దీపికా మధ్య వ్యవహారం
దీపికా ఆ చిత్రాల నుంచి తప్పుకోవడం అనేది పూర్తిగా ఆమెకి, నిర్మాతలకు సంబంధించిన వ్యవహారం అని అంటున్నారు. అనవసరంగా ఈ వివాదంలోకి ప్రభాస్ ని లాగడం కరెక్ట్ కాదని చెబుతున్నారు.