- Home
- Entertainment
- Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
బిగ్ బాస్ తెలుగు 9 షోలో 102వ రోజు ఎమోషనల్ గా సాగింది. ఫైనల్ వీక్ కావడంతో బిగ్ బాస్ ఒక్కొక్కరి గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక్కొక్కరి జర్నీ చూపిస్తున్నారు. ఈ క్రమంలో తనూజ భావోద్వేగానికి గురైంది.

బిగ్ బాస్ తెలుగు 9
బిగ్ బాస్ తెలుగు 9లో ప్రస్తుతం చివరి వారం సాగుతోంది. దీనితో బిగ్ బాస్ ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఒక్కో కంటెస్టెంట్ గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. 102వ రోజు తనూజని బిగ్ బాస్ ప్రశంసించడంతో ప్రారంభం అయింది. తనూజని బిగ్ బాస్ ఒక రేంజ్ లో పొగిడేశారు. నటిగా తనూజ ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించింది. కానీ బిగ్ బాస్ హౌస్ లో నటించడం కుదరదు.
తనూజపై ఒక రేంజ్ లో ప్రశంసలు
ఇక్కడ ఉండే పరిస్థితులు వేరు. అయినప్పటికీ చాలా ధైర్యంగా నిలబడ్డారు. తనూజ ఎంతో బలంగా గేమ్ ఆడింది. ఎప్పుడూ ఇతరుల సపోర్ట్ కోసం పాకులాడుతూ ఉంటుంది అనే విమర్శలని సైతం తట్టుకుంది. బంధాలు ఎదురైనప్పుడు ఆమెలోని సున్నితత్వం బయటపడింది. అవసరమైనప్పుడు బంధాలు పక్కన పెట్టి తనలోని ధైర్యాన్ని ముందుకు తీసుకువచ్చింది అంటూ బిగ్ బాస్ తనూజపై ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత బిగ్ బాస్ తనూజ ఏవీ ప్రదర్శించారు. ఏవీలో తనూజ హౌస్ లో చేసిన అల్లరి, కన్నీళ్లు పెట్టుకోవడం, బంధాలు ఇవన్నీ చూపించారు.
ఎమోషనల్ అయిన తనూజ
దీనితో తనూజ చాలా ఎమోషనల్ అయింది. ఎక్కడో పుట్టిన తాను ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాను అంటే అందుకు కారణం తనని అభిమానిస్తున్న ప్రేక్షకులే అని తనూజ పేర్కొంది. ఆ తర్వాత తనూజ హౌస్ లోకి వచ్చి తన సంతోషాన్ని ఇతర సభ్యులతో పంచుకుంది. ముఖ్యంగా కళ్యాణ్ తో తాను ఉన్న దృశ్యాలు చూపించినప్పుడు చాలా ఎగ్జైట్ అయినట్లు తనూజ పేర్కొంది. కళ్యాణ్ కి చెబుతూ ఉబ్బి తబ్బిబైపోతూ కనిపించింది.
కళ్యాణ్ పై బయటపడ్డ తనూజ ప్రేమ
నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించానని హౌస్ లో గతంలో చెప్పింది. ఆ దృశ్యం చూపించిన వెంటనే కళ్యాణ్ తో తనూజ మాట్లాడిన మాటలు, సంఘటనలని వరుసగా చూపించారు. ఒరేయ్ మనిద్దరినీ చూపించారు రా అంటూ తనూజ కళ్యాణ్ తో ఎంతో సంబరపడిపోతూ కనిపించింది. మా ఇద్దరి గురించి చూపిస్తున్నప్పుడు సాంగ్ కూడా వచ్చింది అని చెప్పింది. తనూజ సంతోషం చూస్తుంటే ఆమె నిజంగానే కళ్యాణ్ ని లవ్ చేస్తోందా అనే సందేహం రాక మానదు. ఇప్పటికీ వీళ్లిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే పుకార్లు ఉన్నాయి.
పవన్ గురించి ఇలా..
ఆ తర్వాత బిగ్ బాస్ పవన్ గురించి చెప్పారు. డిమాన్ పవన్ శక్తి సామర్థ్యాలని ప్రశంసించారు. ప్రేమించిన వారి కోసం నిలబడే వ్యక్తిత్వాన్ని అభినందించారు. ప్రేమించిన వ్యక్తి బయటకి వెళ్ళిపోతున్నప్పుడు పవన్ మనసు ఎంతగా భాదపడిందో తనకు కూడా తెలుసు అని బిగ్ బాస్ అన్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ పవన్ ఏవీ చూపించారు. పవన్ కూడా ఎమోషనల్ అయి బిగ్ బాస్ కి కృతజ్ఞతలు తెలిపాడు.
