- Home
- Entertainment
- చిరంజీవికి ఇండస్ట్రీ హిట్ ఇచ్చి ఆయన విలన్ నే పెళ్లి చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. అప్పట్లో ఒక ఊపు ఊపేసింది
చిరంజీవికి ఇండస్ట్రీ హిట్ ఇచ్చి ఆయన విలన్ నే పెళ్లి చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. అప్పట్లో ఒక ఊపు ఊపేసింది
మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్ మూవీలో నటించిన ఓ హీరోయిన్ విలన్ పాత్రలు చేసే నటుడిని వివాహం చేసుకుంది. ఆ హీరోయిన్ ఎవరు ? ఆమె భర్త ఎవరు ? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

'చూడాలని ఉంది' మూవీ హీరోయిన్
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ హిట్లర్ కి ముందు ఒకలా.. హిట్లర్ తర్వాత మరోలా సాగింది. వరుస పరాజయాల్లో ఉన్న చిరంజీవిని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లో పెట్టిన చిత్రం హిట్లర్. హిట్లర్ ముందు వరకు చిరంజీవికి చాలా ఇండస్ట్రీ హిట్ చిత్రాలు ఉన్నాయి. హిట్లర్ తర్వాత చిరంజీవికి తొలి ఇండస్ట్రీ హిట్ మూవీ చూడాలని ఉంది చిత్రంతో దక్కింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చూడాలని ఉంది మూవీలో సౌందర్య, అంజలా ఝవేరి హీరోయిన్లుగా నటించారు.
9 చిత్రాల్లో 2 ఇండస్ట్రీ హిట్లు
అంజలి ఝవేరి సినిమాలకు గుడ్ బై చెప్పేసి చాలా కాలమే అవుతోంది. అంజలా ఝవేరి తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అభిమానుల్లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. తన గ్లామర్ తో అప్పట్లో యువతని ఒక ఊపు ఊపేసింది. అంజలా ఝవేరి తెలుగులో 9 చిత్రాల్లో నటించింది. మరికొన్ని చిత్రాల్లో గెస్ట్ రోల్స్ లో మెరిసింది. ఆమె నటించిన 9 చిత్రాల్లో 2 ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. ఒకటి చూడాలని ఉంది మూవీ కాగా మరొక ఇండస్ట్రీ హిట్ సమరసింహారెడ్డి.
అగ్ర హీరోలతో నటించిన అంజలా ఝవేరి
ఆమె తెలుగులో అడుగుపెట్టింది విక్టరీ వెంకటేష్ నటించిన ప్రేమించుకుందాం రా చిత్రంతో. ఆ మూవీ సంచలన బ్లాక్ బస్టర్ గా నిలిచి దాదాపు ఇండస్ట్రీ హిట్ రేంజ్ కి వెళ్ళింది. నాగార్జునతో కలిసి రావోయి చందమామ చిత్రంలో నటించింది. ఇలా అంజలా ఝవేరి అప్పట్లో టాలీవుడ్ అగ్ర హీరోలు చిరు, బాలయ్య, వెంకీ, నాగార్జునలతో కలసి నటించిన ఘనత సొంతం చేసుకుంది.
చిరంజీవి మూవీలో విలన్
చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో ఆమె గెస్ట్ రోల్ లో మెరిసింది. చిరంజీవితో రొమాన్స్ చేసిన ఆమె చివరికి చిరంజీవి సినిమాలో విలన్ గా నటించిన నటుడినే వివాహం చేసుకుని సెటిల్ అయింది. ఆమె భర్త మరెవరో కాదు.. తరుణ్ అరోరా. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చిత్రంలో తరుణ్ అరోరా విలన్ గా నటించారు. అదే విధంగా భోళా శంకర్ మూవీలో కూడా నటించారు.
చివరగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో..
అంజలా ఝవేరి చివరగా తెలుగులో శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో మెరిసింది. ఆ తర్వాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఆమె భర్త తరుణ్ అరోరా కూడా భోళా శంకర్ చిత్రం తర్వాత మరో మూవీకి సైన్ చేయలేదు.