పవన్ పలకరించారన్న ఆలీ... మమల్ని దూరం చేసింది వాళ్ళే అంటూ..!
పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుల్లో ఆలీ ఒకరు. పవన్-ఆలీల స్నేహం ఇప్పటిది కాదు. పవన్ కెరీర్ బిగినింగ్ నుండి వీరిద్దరి మధ్య స్నేహం ఉంది. పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలో ఆలీకి ఓ పాత్ర ఉండేది.

2019ఎన్నికల ముందు వరకు పవన్-ఆలీల స్నేహం స్ట్రాంగ్ గానే ఉంది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో వీరిమధ్య విబేధాలు తలెత్తాయి.
ఆలీ జనసేన పార్టీని కాదని అనూహ్యంగా వైఎస్సార్ సీపీలో జాయిన్ అయ్యారు. ఇది పవన్ కి నచ్చలేదు. మిత్రుడే మోసం చేశాడంటూ ఆలీపై పవన్ బహిరంగ ఆరోపణలు చేశారు. అలాగే ఆలీని కష్టాలలో ఆదుకుంటే.. నాకు హ్యాండిచ్చాడని వేదిక సాక్షిగా ఆరోపణలు చేశాడు.
పవన్ ఆరోపణలకు ఆలీ సైతం కౌంటర్ ఇవ్వడం జరిగింది. పవన్ ఎప్పుడూ నాకు అవకాశాలు ఇప్పించలేదు, ఆర్ధికంగా ఆదుకోలేదు అన్నారు. పవన్ కంటే ముందే పరిశ్రమకు వచ్చిన నేను స్వశక్తితో ఎదిగానని అన్నారు.
ఈ మాటల యుద్ధం తరువాత వీరిధ్దరి మధ్య దూరం పెరిగింది. దాదాపు రెండేళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఆలీ పవన్ కళ్యాణ్ కలవడం, మీడియా దృష్టిని ఆకర్షించింది.
దీనితో మీడియా ఆలీని పవన్ తో స్నేహం, విబేధాల గురించి అడుగగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అసలు పవన్ కి నాకు వ్యక్తిగత విభేదాలు లేవని, పార్టీలు మాత్రమే వేరని అన్నారు.
పవన్ తనను బాగా పలకరించారు అన్నారు. ఆ మధ్య పెళ్లి వేడుకలో కూడా కలుసుకున్నాం అన్నారు ఆలీ. అలాగే ఒకేసారి ఆయన్ని కలుద్దామని అనుకుంటే.. పుణేలో ఉన్నారని తెలుసుకొని ఆగిపోయాను అన్నారు.
ఇక మా మధ్య విబేధాలు ఉన్నట్లు మీడియా సృష్టించిందే తప్పా... మేము బాగానే ఉన్నాం. మధ్యలో వాళ్లే లేనిపోయి అపోహలు కలిపించారని ఆలీ నేరం మొత్తం మీడియా వాళ్ళపై నెట్టివేశారు .
ఇక భవిష్యత్ లో పవన్ తో సినిమా చేయడం ఖాయమని ఆలీ తెలియజేశారు. ఆలీ హీరోగా లాయర్ విశ్వనాథం, అందరూ బాగుండాలి అందులో నేనుండాలి, అనే చిత్రాలు తెరకెక్కుతున్నాయి.